గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్‌లైన్‌లోనే..

మోటారిస్టుల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీఓ కార్యాయాల వద్ద అనవసరమైన రద్దీని నివారించడానికి, తద్వారా ఆర్టీఓల పనితీరును పెంచడానికి కేంద్రం కొన్ని సేవలను ఆన్‌లైన్ చేసింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్‌లైన్‌లోనే..

లెర్నర్స్ లైసెన్స్ పొందటం, డ్రైవర్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవటం మరియు కొత్త వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవటం మొదలైన 18 రకాల ఆర్టీఓ సేవలను ఆన్‌లైన్ చేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ గురువారం (మార్చి 4) ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.

గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్‌లైన్‌లోనే..

ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్న 18 రకాల సేవలను పొందటానికి వినియోగదారులు ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదని సదరు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సేవలను పొందటానికి వినియోగదారులు తప్పనిసరిగా ఆధార్‌ను కలిగి ఉండాలని, ఆధార్ అథెంటికేషన్ ద్వారా ప్రజలు సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన కాంటాక్ట్‌లెస్ సేవలను పొందవచ్చని పేర్కొంది.

MOST READ:అడవి ఏనుగు భారినుంచి తృటిలో తప్పించుకున్న ప్రముఖ సింగర్ [వీడియో]

గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్‌లైన్‌లోనే..

ఈ మేరకు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ స్టేట్‌మెంట్‌లో "డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌కు సంబంధించిన కొన్ని రకాల సేవలు పూర్తిగా ఆన్‌లైన్ చేయబడ్డాయి. ఇప్పుడు ఈ సేవలను ఆర్టీఓకి వెళ్ళకుండానే ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ఆధార్ అథెంటికేషన్ ద్వారా స్వచ్ఛంద ప్రాతిపదికన, ఎవరైనా ఈ కాంటాక్ట్‌లెస్ సేవల ప్రయోజనాన్ని పొందవచ్చు" అని పేర్కొంది.

గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్‌లైన్‌లోనే..

ప్రతి భారతీయ పౌరుడికి కేటాయించిన 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య (ఆధార్)తో డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఆర్‌సి (రిజిస్టేషన్ సర్టిఫికెట్)ను అనుసంధానించడానికి కేంద్ర ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత ఈ ఆర్టీఓ ఆన్‌లైన్ సేవలు తెరపైకి వచ్చాయి.

MOST READ:త్వరపడండి.. అక్కడ ఒక కేజీ కేక్ కొంటె ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ

గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్‌లైన్‌లోనే..

ఈ నిర్ణయం గురించి మంత్రిత్వ శాఖ మరొక ట్వీట్‌లో వ్యాఖ్యానిస్తూ.. "ఇది పౌరులపై అనవసరమైన భారాన్ని తగ్గిస్తుంది. ప్రజలు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరియు నేరుగా ఎవ్వరీని సంప్రదించకుండా ఈ సేవలను పొందవచ్చు. అంతేకాకుండా, ఇది ఆర్టీఓ కార్యాలయాల్లో పెరిగే రద్దీని కూడా తగ్గిస్తుంది. ఫలితంగా, ఆర్టీఓ కార్యాలయాల సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది" అని పేర్కొంది.

గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్‌లైన్‌లోనే..

ఆధార్ అథెంటికేషన్ ద్వారా ప్రజలు తమ ఇంటి వద్ద నుండే పొందగలిగే 18 రకాల ఆన్‌లైన్ ఆర్టీఓ సేవల వివరాలు ఇలా ఉన్నాయి:

1. లెర్నర్స్ లైసెన్స్

2. డ్రైవింగ్ టెస్ట్ అవసరం లేని డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్

3. డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్

4. డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో చిరునామా మార్పు

5. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ జారీ

6. లైసెన్స్ నుండి వాహనం క్లాస్ యొక్క సరెండర్

7. మోటారు వాహనం యొక్క తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు

8. పూర్తిగా నిర్మించిన బాడీ యొక్క మోటారు వాహన రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు

9. రిజిస్ట్రేషన్ యొక్క డూప్లికేట్ సర్టిఫికేట్ జారీ కోసం దరఖాస్తు

10. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం ఎన్ఓసి మంజూరు కోసం దరఖాస్తు

MOST READ:మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్‌గా ఇచ్చారు, ఎందుకో తెలుసా!

గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్‌లైన్‌లోనే..

11. మోటారు వాహనం యొక్క యాజమాన్య బదిలీ కోసం నోటీసు

12. మోటారు వాహనం యొక్క యాజమాన్య బదిలీ కోసం దరఖాస్తు

13. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో చిరునామా మార్పు గురించి తెలియజేయడం

14. గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా కేంద్రం నుండి డ్రైవర్ శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు

15. దౌత్య అధికారి మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు

16. దౌత్య అధికారి మోటారు వాహనం యొక్క తాజా రిజిస్ట్రేషన్ మార్క్ కేటాయించడానికి దరఖాస్తు

17. అద్దె-కొనుగోలు ఒప్పందం యొక్క ఆమోదం

18. అద్దె-కొనుగోలు ఒప్పందం యొక్క ముగింపు

గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్‌లైన్‌లోనే..

ప్రస్తుతం దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో, ప్రభుత్వం ఈ ఆర్టీఓ సేవలను ఆన్‌లైన్ చేయటం నిజంగా స్వాగతించదగిన విషయం. ఇలాంటి చిన్నపాటి సేవల కోసం ప్రజలు ఇకపై ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి ఈ సేవల్లో దేనికైనా ఆధార్ కార్డు చాలా ముఖ్యం. ఆధార్ అథెంటికేషన్ ద్వారానే ఈ సేవలను పొందగలరు.

MOST READ:అక్రమ బిఎస్4 కార్లను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు; హైదరాబాద్‌లో కూడా మూలాలు!

Most Read Articles

English summary
Now No Need To Visit RTO; MORTH India Made 18 Important RTO Services Online, Complete Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X