మీరు మీ వాహనంతో తరచూ రాష్ట్రాలు మారుతుంటారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్..

వృత్తి రీత్యా నిత్యం వివిధ రాష్ట్రాలకు బదిలీ అయ్యే ఉద్యోగుల సౌకర్యార్థం, వాహనాల రీ-రిజిస్ట్రేషన్ విషయంలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త డ్రాఫ్ట్ రూల్స్‌ను ప్రతిపాదించింది. ఈ మేరకు మోటార్ వాహన చట్టంలో కొన్ని సవరణలు చేయాలని ఈ డ్రాఫ్టులో ప్రతిపాదించారు.

మీరు మీ వాహనంతో తరచూ రాష్ట్రాలు మారుతుంటారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్..

ఈ కొత్త ప్రతిపాదనల వలన రక్షణ రంగానికి చెందిన ఉద్యోగులు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 5 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కార్యాలయాలున్న ప్రైవేట్ / కార్పోరేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు తమ వాహనాల రీ-రిజిస్ట్రేషన్ విషయంలో లబ్ధి పొందనున్నారు. ఈ సవరణలతో వీరికి ప్రధాన సమస్యగా ఉన్న వాహనాల రీ-రిజిస్ట్రేషన్‌కు చక్కటి పరిష్కారం లభించనుంది.

మీరు మీ వాహనంతో తరచూ రాష్ట్రాలు మారుతుంటారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్..

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మారే ఉద్యోగులు తమ వాహనాల రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు గానూ, దానికి సంబంధించిన నియమాలను సరళీకృతం చేయడానికి ఒక కొత్త వ్యవస్థను రూపొందించారు.

MOST READ:అప్పుడే అమ్ముడైపోయిన 2021 సుజుకి హయాబుసా బైక్.. మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే?

మీరు మీ వాహనంతో తరచూ రాష్ట్రాలు మారుతుంటారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్..

ఇందులో భాగంగా, పైన పేర్కొన్న సంస్థలలో పనిచేసే ఉద్యోగులు ఉపయోగించే వాహనాలకు IN సిరీస్ నెంబరు ఉపయోగించడం జరుగుతుంది. ఇలాంటి వాహనాల విషయంలో మోటార్ వాహన పన్నును రెండేళ్లకు ఒక్కసారి చొప్పున లేదా 4, 6, 8, 10 ఇలా రెండు గుణకాల చొప్పున వసూలు చేయటం జరుగుతుంది.

మీరు మీ వాహనంతో తరచూ రాష్ట్రాలు మారుతుంటారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్..

ఉదాహరణకు పైన పేర్కొన్న ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగ సంస్థలో పనిచేస్తున్న వ్యక్తి వృత్తిరీత్యా తెలంగాణా రాష్ట్రం నుండి కర్ణాటక రాష్ట్రానికి బదిలీ అవుతున్నారని అనుకుంటే, అలాంటి ఉద్యోగులు ఉపయోగించే వాహనాలకు IN సిరీస్ నెంబరును కేటాయిస్తారు. వారు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలో 2 ఏళ్లకు ఒక్కసారి చొప్పున రోడ్ టాక్స్ కడుతారు.

MOST READ:కరోనా వేళ అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట; నోయిడా పోలీస్

మీరు మీ వాహనంతో తరచూ రాష్ట్రాలు మారుతుంటారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్..

ఒకవేళ సదరు వ్యక్తి 6 ఏళ్ల పాటు కర్ణాటక రాష్ట్రంలో ఉంటాడని అనుకుంటే, అతను రెండేళ్లకు ఒక్కసారి చొప్పున కానీ లేదా మొత్తం ఆరేళ్లకు ఒకేసారి కానీ రోడ్ టాక్స్ చెల్లింపు చేసుకోవచ్చు. ఈ విధానం కోసం ప్రజలు ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా, ఐటి ఆధారిత ఆన్‌లైన్ సేవల ద్వారా దీనికి పరిష్కారం అందించాలని కేంద్రం యోచిస్తోంది.

మీరు మీ వాహనంతో తరచూ రాష్ట్రాలు మారుతుంటారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్..

ప్రభుత్వం ఈ విధానాన్ని పైలట్ ప్రాతిపధికన చేపట్టాలని చూసితోంది. ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసిన తరువాత, ప్రజలు తమ వాహనాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి సులభంగా నడపగలుగుతారు. సాధారణ ప్రజలు, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల అభిప్రాయాల కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్లు దాని అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయబడ్డాయి.

MOST READ:మీరు మీ వాహనంతో తరచూ రాష్ట్రాలు మారుతుంటారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్..

మీరు మీ వాహనంతో తరచూ రాష్ట్రాలు మారుతుంటారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్..

ఇతర రాష్ట్రానికి వెళ్లేటప్పుడు వాహనాలను తిరిగి రిజిస్టర్ చేసుకునే విధానం సౌకర్యవంతంగా లేదని, ఈ విధానాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. వాహన రిజిస్ట్రేషన్ కోసం ఐటి ఆధారిత పరిష్కారం ఈ ప్రక్రియను సులభతరం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొంది.

మీరు మీ వాహనంతో తరచూ రాష్ట్రాలు మారుతుంటారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్..

ఇతర రాష్ట్రాల్లో వాహనాల రిజిస్ట్రేషన్ కోసం 12 నెలల సమయం!

మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాన్ని మరొక రాష్ట్రంలో ఉపయోగించటానికి రిజిస్ట్రేషన్ బదిలీ చేయవలసి ఉంటుంది. ఇందుకోసం ప్రజలకు 12 నెలల సమయాన్ని కేటాయిస్తారు. అంటే, 12 నెలల పాటు సదరు వ్యక్తి తన పాత వాహన రిజిస్ట్రేషన్ నెంబరుతోనే కొత్త రాష్ట్రంలో సంచరించవచ్చు.

MOST READ:బిఎమ్‌డబ్ల్యూ కార్ల కొత్త ధరలు వచ్చేశాయ్.. చూసారా..!

మీరు మీ వాహనంతో తరచూ రాష్ట్రాలు మారుతుంటారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్..

అయితే, కొత్తగా మారిన రాష్ట్రంలో తన పాత వాహనాన్ని రీ-రిజిస్టర్ చేసుకోవాలంట, మొదట తమ వాహనం రిజిస్టర్ అయిన చోట నుండి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసి) పొందాల్సి ఉంటుంది. ఆ తరువాత వారు కొత్త రాష్ట్రంలో రహదారి పన్ను చెల్లించి, తమ పాత వాహనాన్ని కొత్త రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే, మొదట రిజిస్టర్ చేయబడిన చోట, రోడ్ టాక్స్ వాపసు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
MoRTH Proposed New Vehicle Reregistration Norms; That Will Help Govt Employees, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X