లగ్జరీ మరియు మిడ్-రేంజ్ కార్లలో లభించే కొన్ని కామన్ ఫీచర్లు!

ప్రస్తుతం, భారత మార్కెట్లో అనేక రకాల లగ్జరీ కార్లు అందుబాటులోకి వచ్చాయి. లగ్జరీ కార్లు అధిక ధరలను కలిగి ఉంటాయి. అయితే, వీటిలో ఆ ధరకు తగినట్లుగానే కొన్ని ప్రీమియం ఫీచర్లు కూడా ఆఫర్ చేయబడుతాయి. నిజానికి, లగ్జరీ మరియు మిడ్-రేంజ్ కార్లలో కొన్ని రకాల ఫీచర్లు చాలా కామన్‌గా లభిస్తాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

లగ్జరీ మరియు మిడ్-రేంజ్ కార్లలో లభించే కొన్ని కామన్ ఫీచర్లు!

1. పానోరమిక్ సన్‌రూఫ్

ఆడి, బిఎమ్‌డబ్ల్యూ, వోల్వో, జాగ్వార్ వంటి సంస్థలు తమ కార్లలో పానోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను అందిస్తుంటాయి. ఇవి సాధారణ సన్‌రూఫ్‌లతో పోలిస్తే రెట్టింపు పరిమాణాన్ని కలిగి ఉంటాయి. పానోరమిక్ సన్‌రూఫ్ కలిగిన కార్లలో ప్రయాణిస్తుంటే, ఓ కన్వర్టిబల్ కారులో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది. మన మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, ఎంజి హెక్టర్ మరియు జీప్ కంపాస్ వంటి పలు మిడ్-రేంజ్ కార్లలో కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

లగ్జరీ మరియు మిడ్-రేంజ్ కార్లలో లభించే కొన్ని కామన్ ఫీచర్లు!

2. పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

ఒకప్పుడు హై-ఎండ్ లగ్జరీ కార్లకు మాత్రమే పరిమితమైన ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఫీచర్ ఇప్పుడు మిడ్-రేంజ్ మరియు ఎంట్రీ లెవల్ కార్లలో కూడా లభిస్తుంది. ఈ అధునాతన ఫీచర్ ఇప్పుడు నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్, హ్యుందాయ్ అల్కాజార్ మరియు టాటా టియాగో వంటి కార్లలో కూడా అందుబాటులో ఉంది. ఇది క్యాబిన్ అనుభూతిని పెంచుతుంది మరియు డ్రైవర్‌కు కావల్సిన సమాచారాన్ని క్లీన్‌గా తెలియజేస్తుంది.

లగ్జరీ మరియు మిడ్-రేంజ్ కార్లలో లభించే కొన్ని కామన్ ఫీచర్లు!

3. వెంటిలేటెడ్ సీట్లు

కొన్నేళ్ల క్రితం వరకు, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి వంటి సంస్థలు అందించే కార్లలో కార్లలో వెంటిలేటెడ్ సీట్లు లభించేవి. కానీ ఇప్పుడు హ్యుందాయ్, స్కోడా మరియు కియా వంటి సంస్థలు విక్రయిస్తున్న క్రెటా, కుషాక్, సోనెట్ మరియు సెల్టోస్ వంటి కార్లలో కూడా ఈ తరహా సీట్లు లభిస్తున్నాయి. ఇవి వేసవికి కాలంలో చక్కగా పనిచేస్తాయి. చెమటను నివారించడంలో సహకరిస్తాయి.

లగ్జరీ మరియు మిడ్-రేంజ్ కార్లలో లభించే కొన్ని కామన్ ఫీచర్లు!

4. పవర్డ్ ఫ్రంట్ సీట్లు

కొంతకాలం క్రితం ఈ ఫీచర్ రూ.25 లక్షలు లేదా అంతకంటే అధిక ధర గల కార్లలో మాత్రమే లభించేది. కానీ ఇప్పుడు ఇది ఎమ్‌జి హెక్టర్, హ్యుందాయ్ క్రెటాలో మరియు కియా సెల్టోస్ వంటి కార్లలో కూడా లభిస్తుంది. ఇటీవల మార్కెట్లో విడుదలైన టాటా సఫారీ మరియు టాటా హారియర్ మోడళ్లలో కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

లగ్జరీ మరియు మిడ్-రేంజ్ కార్లలో లభించే కొన్ని కామన్ ఫీచర్లు!

5. డ్రైవింగ్ మోడ్స్

ఒకప్పుడు స్పోర్ట్స్ కార్లలో మాత్రమే లభించే డ్రైవింగ్ మోడ్స్ ఫీచర్లు ఇప్పుడు మిడ్-రేంజ్ కార్లలో కూడా అందుబాటులోకి వచ్చింది. టాటా ఆల్ట్రోజ్ వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఈ కారులో డైనమిక్, స్పోర్ట్, ఎకానమీ మరియు నార్మల్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. హ్యుందాయ్ అల్కాజార్, హారియర్ మరియు హెక్టర్ వంటి కొన్ని మిడ్-రేంజ్ కూడా ఇది అందుబాటులో ఉంది.

లగ్జరీ మరియు మిడ్-రేంజ్ కార్లలో లభించే కొన్ని కామన్ ఫీచర్లు!

6. కూల్డ్ గ్లవ్ బాక్స్

ఒకప్పుడు గ్లవ్ బాక్స్ అనేది చేతి గ్లౌజులు భద్రపరచుకునేదాని కోసం తయారు చేసిన ఫీచర్. కానీ, ఇప్పుడు ఇందులో కూల్డ్ గ్లవ్ బాక్స్ అనే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని సహాయంతో మీరు మీ పానీయాలను చల్లబరచుకోవచ్చు. ఇంతకుముందు వరకూ ఈ ఫీచర్ లగ్జరీ కార్లలో మాత్రమే లభిస్తుండగా, ఇప్పుడు టాటా టియాగో మరియు రెనో ట్రైబర్, స్కోడా రాపిడ్, హ్యుందాయ్ ఔరా వంటి కార్లలో కూడా లభిస్తుంది.

లగ్జరీ మరియు మిడ్-రేంజ్ కార్లలో లభించే కొన్ని కామన్ ఫీచర్లు!

7. డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్

హై-ఎండ్ లగ్జరీ కార్లలో మాత్రమే లభించే ఈ డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఇప్పుడు రూ.15 లక్షల ధర కలిగిన కార్లలో కూడా లభిస్తుంది. ఉదాహరణకు, మనదేశంలో లభిస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా ఈ తరహా ఫీచర్ లభిస్తుంది. దీని సాయంతో డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ వైపు ఉష్ణోగ్రతలను విడివిడిగా సర్దుబాటు చేసుకోవచ్చు.

లగ్జరీ మరియు మిడ్-రేంజ్ కార్లలో లభించే కొన్ని కామన్ ఫీచర్లు!

8. ప్రీమియం సౌండ్ సిస్టమ్

ఒక కారులో మంచి సౌండ్ సిస్టమ్‌ను పొందాలంటే, ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేయాలి లేదా థర్డ్ పార్టీల నుండి కొనుగోలు చేయాలి. కానీ, ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న కొన్ని మిడ్-రేంజ్ కార్లలోనే బోస్, హార్మన్ వంటి హై-ఎండ్ బ్రాండ్‌ల నుండి సౌండ్ సిస్టమ్‌లు లభిస్తున్నాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎమ్‌జి హెక్టర్, హ్యుందా ఐ20 మరియు టాటా హారియర్ వంటి కార్లలో ప్రీమియం సౌండ్ సిస్టమ్ లభిస్తుంది.

Most Read Articles

English summary
Most Common And Premium Features Found In Luxury And Mid-range Cars In India. Read in Telugu.
Story first published: Monday, July 19, 2021, 16:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X