మీ కారులో హ్యాండ్‌బ్రేక్ చక్కగా పనిచేస్తుందా లేదో ఇలా చెక్ చేసుకోండి..

కార్లలో హ్యాండ్ బ్రేక్ ప్రాముఖ్యత గురించి చాలా మందికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనినే పార్కింగ్ బ్రేక్ అని కూడా పిలుస్తుంటారు. అయితే, ఇప్పుడు వస్తున్న మోడ్రన్ కార్లలో అసలు హ్యాండ్ బ్రేక్ అనే ఫీచరే (మ్యాన్యువల్ హ్యాండ్ బ్రేక్) కనిపించడం లేదు. నిజానికి, కార్లలో హ్యాండ్ బ్రేక్ ఓ ఎమెర్జెన్సీ బ్రేక్ మాదిరిగా పనిచేస్తుంది.

మీ కారులో హ్యాండ్‌బ్రేక్ చక్కగా పనిచేస్తుందా లేదో ఇలా చెక్ చేసుకోండి..

అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదాన్ని నివారించాల్సి వచ్చినప్పుడు, ఆ సమయంలో కారు యొక్క మ్యాన్యువల్ హ్యాండ్‌బ్రేక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా, నిటారుగా ఉండే రోడ్ల పైకి ఎక్కుతున్నప్పుడు లేదా వాలుగా ఉండే రోడ్లపై దిగుతున్నప్పుడు కూడా ఈ ఫీచర్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మీ కారులో హ్యాండ్‌బ్రేక్ చక్కగా పనిచేస్తుందా లేదో ఇలా చెక్ చేసుకోండి..

చాలా మంది వ్యక్తులు తమ కార్లలోని హ్యాండ్‌బ్రేక్‌ని క్రమం తప్పకుండా మార్చరు లేదా సర్వీస్ చేయించడాన్ని విస్మరిస్తూ ఉంటారు. ఫలితంగా, చాలా త్వరగా పాడవటం ప్రారంభిస్తుంది. లోపపూరితమైన హ్యాండ్‌ బ్రేక్, ప్రమాదకరమైన ప్రయాణం అని అర్థం. ఇది మిమ్మల్ని ప్రమాదాలకు గురిచేసే అవకాశం ఉంది.

మీ కారులో హ్యాండ్‌బ్రేక్ చక్కగా పనిచేస్తుందా లేదో ఇలా చెక్ చేసుకోండి..

అయితే, హ్యాండ్‌ బ్రేక్ వైఫల్యానికి సంబంధించిన ఈ 5 సంకేతాలను సరైన సమయంలో మీరు ముందుగా గుర్తించి వాటిని సరిచేయించుకున్నట్లయితే, మీ ప్రయాణం సాఫీగా మరియు సజావుగా సాగిపోతుంది. మరి ఆ ఐదు సంకేతాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మీ కారులో హ్యాండ్‌బ్రేక్ చక్కగా పనిచేస్తుందా లేదో ఇలా చెక్ చేసుకోండి..

1. హ్యాండ్‌ బ్రేక్ చాలా టైట్ గా ఉండటం

సాధారణంగా ఏ కారులోని హ్యాండ్ బ్రేక్ అయినా, సులువుగా ఒక్క చేతితో ఆపరేట్ చేసేలా ఉంటుంది. అలా కాకుండా, మీ కారులోని హ్యాండ్‌బ్రేక్ సాధారణం కంటే గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే, అది వైరింగ్ సమస్యకు సంకేతం కావచ్చని గుర్తించాలి.

మీ కారులో హ్యాండ్‌బ్రేక్ చక్కగా పనిచేస్తుందా లేదో ఇలా చెక్ చేసుకోండి..

ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు గట్టిగా హ్యాండ్‌ బ్రేక్ ను ఉపయోగించడం చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా, టైట్ గా ఉన్న బ్యాండ్ బ్రేక్ వలన బ్రేకులు మరియు టైర్లు కూడా త్వరగా అరిపోయే అవకాశం ఉంది. కాబట్టి, ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వీలైనంత తర్వగా హ్యాండ్ బ్రేక్ ను సరిచేయించుకోవటం మంచిది.

మీ కారులో హ్యాండ్‌బ్రేక్ చక్కగా పనిచేస్తుందా లేదో ఇలా చెక్ చేసుకోండి..

2. హ్యాండ్‌ బ్రేక్ చాలా వదులుగా ఉండటం

హ్యాండ్‌ బ్రేక్ టైట్ గా ఉంటేనే కాదు వదులుగా ఉన్నా కూడా సమస్యే. వదులుగా ఉన్న హ్యాండ్ బ్రేక్ లో తీగలు అలైన్‌మెంట్ సాగిపోయి ఉండటం లేదా వదలుగా ఉండటం జరగవచ్చు. ఇది మీ కారు హ్యాండ్‌బ్రేక్‌ను డిస్‌బ్యాలెన్స్ చేసి, దానిని ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా, అత్యవసర పరిస్థితుల్లో బ్రేకింగ్ వేసినప్పుడు అది హ్యాండ్ బ్రేక్ ను లాక్ చేయడంలో విఫలం కావచ్చు. కాబట్టి, మీ కారులోని హ్యాండ్ బ్రేక్ వదులుగా ఉన్నట్లు అనిపిస్తే, వెంటనే దానిని సరిచేయించుకోండి.

మీ కారులో హ్యాండ్‌బ్రేక్ చక్కగా పనిచేస్తుందా లేదో ఇలా చెక్ చేసుకోండి..

3. హిల్ టెస్ట్

మీ కారులోని హ్యాండ్‌ బ్రేక్ సరిగ్గా పనిచేస్తుందో లేదో తనిఖీ చేయడానికి ఒక మార్గం ఉంది. అదేమిటంటే, మీ కారును ఏటవాలుగా ఉండే రోడ్డుపై పార్క్ చేయడానికి ప్రయత్నించండి. ఆ సమయంలో మీరు మీ కారులో యొక్క పార్కింగ్ (హ్యాండ్) బ్రేక్‌ ని ఉపయోగించండి. ఒకవేళ కారు హ్యాండ్‌ బ్రేక్ సరిగ్గా పనిచేస్తుంటే, మీ కారు వెనుకకు లేదా ముందుకు జరగదు.

మీ కారులో హ్యాండ్‌బ్రేక్ చక్కగా పనిచేస్తుందా లేదో ఇలా చెక్ చేసుకోండి..

అలాకాకుండా, వాలు రోడ్డుపై మీ కారులో హ్యాండ్ బ్రేక్ అప్లయ్ చేసిన తర్వాత కూడా కదలడం ప్రారంభిస్తే, దాని హ్యాండ్‌ బ్రేక్ లోపపూరితంగా ఉందని అర్థం. కానీ, ఈ జాగ్రత్త! ఇలా పరీక్ష చేసేటప్పుడు మీ కారు వెనుక మరియు ముందు భాగాల్లో ఎలాంటి వాహనాలు రాకుండా ఉండేలా చూసుకోండి.

మీ కారులో హ్యాండ్‌బ్రేక్ చక్కగా పనిచేస్తుందా లేదో ఇలా చెక్ చేసుకోండి..

4. హ్యాండ్ బ్రేక్ వేసినా కారు ఆగకపోతే..

సాధారణంగా, మనం హ్యాండ్ బ్రేక్ ని కారు పార్క్ చేసినప్పుడు లేదా ట్రాఫిక్ లైట్ వద్ద ఎక్కువ సమయం వేచి ఉన్నప్పుడు లేదంటే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగిస్తుంటాం. ఇలా అత్యవసర పరిస్థితుల్లో కారులోని హ్యాండ్ బ్రేక్ ని ఉపయోగించినప్పుడు కారు ఆగకుండా ముందుకు వెళ్తుంటే, దాని హ్యాండ్ బ్రేక్ వ్యవస్థలో ఏదో లోపం ఉందని గుర్తించాలి.

మీ కారులో హ్యాండ్‌బ్రేక్ చక్కగా పనిచేస్తుందా లేదో ఇలా చెక్ చేసుకోండి..

సాధారణంగా కారు పాతదయ్యే కొద్ది అందులోని కొన్ని భాగాలు అరిగిపోతూ ఉంటాయి. ఇలా అరిగిపోయే భాగాల్లో హ్యాండ్ బ్రేక్ కూడా ఒకటి. అరిగిపోయిన భాగాల కారణంగా, హ్యాండ్ బ్రేక్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. హ్యాండ్‌బ్రేక్ ఎటువంటి రాపిడి (ట్రాక్షన్)ని ఉత్పత్తి చేయకపోతే, మీరు దాన్ని వెంటనే మెకానిక్ వద్ద సరిచేయించాల్సిన అవసరం ఉంటుంది.

మీ కారులో హ్యాండ్‌బ్రేక్ చక్కగా పనిచేస్తుందా లేదో ఇలా చెక్ చేసుకోండి..

5. హ్యాండ్ బ్రేక్ ఆన్‌లో ఉన్నప్పుడు డ్రైవ్ చేయకండి

కారును స్టార్ట్ చేసినప్పటి నుండి తిరిగి స్టాప్ చేసే వరకూ చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. కారును స్టార్ట్ చేసిన తర్వాత బ్రేక్ మీద నుండి కాలు తీసి యాక్సిలరేటర్ పై కాలు పెట్టే లోపే, మీ కారులో హ్యాండ్ బ్రేక్ ఆన్ లో ఉందో లేక ఆఫ్ లో ఉందే చూసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ కారులోని హ్యాండ్ బ్రేక్ ఆన్ లో ఉంచి డ్రైవ్ చేయకండి. ఇలా చేయటం వలన బ్రేక్ డ్రమ్ ఖాలీ అయి, అసలు బ్రేకులు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది.

మీ కారులో హ్యాండ్‌బ్రేక్ చక్కగా పనిచేస్తుందా లేదో ఇలా చెక్ చేసుకోండి..

కారును స్టార్ చేసి ముందుకు వెళ్తున్నప్పుడు, కారులో డ్రాగ్ అనిపించినా లేదా నడుపుతున్న కారు భారంగా ముందుకు వెళ్తున్నట్లు అనిపించినా హ్యాండ్ బ్రేక్ ఆన్‌లో ఉందని అర్థం లేదా హ్యాండ్ బ్రేక్ పూర్తిగా ఆఫ్ కాలేదని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో కారులోని బ్రేకులు అరిగిపోవటం లేదా టైర్లు త్వరగా అరిగిపోవటం జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్త.

Most Read Articles

English summary
Most common symptoms of faulty handbrake or parking brake
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X