అత్యంత ఖరీదైన టాప్ 10 కారు ప్రమాదాలు

By Ravi

రోడ్డుపై వెళ్తున్నప్పుడు ప్రమాదాలు జరగాలని ఎవ్వరూ కోరుకోరు. కానీ అనుకోని పరిస్థితుల వలన కొన్ని రోడ్డు ప్రమాదాలు అనివార్యం అవుతుంటాయి. కొన్ని రకాల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం ఎక్కువగా జరుగితే, మరికొన్ని రకాల రోడ్డు ప్రమాదాల్లో ఆస్తినష్టం ఎక్కువగా జరుగుతుంటాయి.

ప్రత్యేకించి కోట్ల రూపాయలు ఖరీదు చేసే సూపర్ కార్ల వలన కలిగే ప్రమాదాల్లో ప్రాణ నష్టం కన్నా ఆస్తి నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఈనాటి మన ఆఫ్ బీట్ కథనంలో ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన టాప్ 10 కారు ప్రమాదాల గురించి తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

టాప్ 10 కాస్ట్లీ కార్ క్రాషెస్

తర్వాతి స్లైడ్‌లలో టాప్ 10 కాస్ట్లీ కార్ క్రాషెస్ గురించి తెలుసుకోండి.

10. బుగాటి ఈబి110

10. బుగాటి ఈబి110

ఈ జాబితాలో 10వ స్థానంలో ఉన్నది 1992 మోడల్ బుగాటి. మెయింటినెన్స్ వర్క్ కోసం ఓ సర్వీస్ అవుట్‌లెట్‌కు వచ్చిన ఈ సూపర్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా మెకానిక్ చేతిలో ఇది యాక్సిడెంట్‌కు గురైంది. రోడ్డుపై ఆయిల్ పడి ఉండటంతో, కారు కంట్రోల్ తప్పి జారిపోయి, రోడ్డు పక్కనే ఉన్న స్థంభాన్ని ఢీకొట్టిందని ఆ మెకానిక్ చెప్పుకొచ్చాడు. ఈ కారు ఖరీదు 5 లక్షల డాలర్లు.

9. పగని జోండా సి12 ఎస్

9. పగని జోండా సి12 ఎస్

ఈ లిస్టులో 9వ స్థానంలో ఉన్నది పగని జోండా సి12 ఎస్. పగని ఇలాంటి కార్లను కేవలం 12 యూనిట్లు మాత్రమే తయారు చేసింది. ఆ కారు యజమాని వేగంగా డ్రైవ్ చేయటంతో అదుపుతప్పి పేవ్‌మెంట్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు వైపు, కుడి వైపు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ కారు ఖరీదు 6.5 లక్షల డాలర్లు.

8. మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ 300

8. మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ 300

క్లాసిక్ కారు ప్రియులు ఇష్టపడే బెంజ్ కార్లలో ఎస్ఎల్ 300 గల్‌వింగ్ కూడా ఒకటి. లా కరెరా ప్యాన్అమెరికానా ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన ఈ క్లాసిక్ మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ 300 కారు ప్రమాదానికి గురై, ఇదిగో ఇలా తయారైంది. ఈ కారు ఖరీదు సుమారు 7.5 లక్షల డాలర్లు.

7. జాగ్వార్ ఎక్స్‌జే 220

7. జాగ్వార్ ఎక్స్‌జే 220

ఈ జాబితాలో 7వ స్థానంలో ఉన్నది జాగ్వార్ ఎక్స్‌జే 220. ఈ క్లాసిక్ కారును తయారు చేసినప్పుడు, ఆ సమయంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే కార్లలో ఇది కూడా ఒకటి ఉండేది. దీని గరిష్టం వేగం గంటకు 217 మైళ్లు. వేగం కారణంగా అదుపు తప్పిన ఈ కారు రోడ్డుపై ఉన్న పేవ్‌మెంట్ ఎక్కి, స్థంభాన్ని ఢీకొట్టింది.

6. మెక్‌లారెన్ ఎఫ్1

6. మెక్‌లారెన్ ఎఫ్1

ఈ లిస్టులో 6వ స్థానంలో ఉన్న మెక్‌లారెన్ ఎఫ్1 సూపర్ కార్. మిస్టర్ బీన్ కామిక్ ద్వారా అందరికీ సుపరిచితుడైన రోవన్ ఆట్కిన్సన్ ఈ కారును క్రాష్ చేశాడు. ఇలాంటివి కేవలం 107 కార్లు మాత్రమే తయారయ్యాయి. ఈయన గతంలో ఆస్టన్ మార్టిన్ కారును కూడా క్రాష్ చేశాడు. ఈ కారు ఖరీదు సుమారు 1.25 మిలియన్ డాలర్లు.

5. ఫెరారీ ఎన్జో

5. ఫెరారీ ఎన్జో

ఇదొక లిమిటెడ్ ఎడిషన్ ఫెరారీ కారు. ఫెరారీ సంస్థ వ్యవస్థాపకుడు ఎన్జో ఫెరారీ జ్ఞాపకార్థం తయారు చేసిన మోడల్ ఇది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు కానీ, ఇందులో ఫెరారీ ఎన్జో కారు రెండు ముక్కలై రోడ్డున పడింది. కారు ముందువైపు అర్థ భాగాన్ని మనం ఈ ఫొటోలో చూడొచ్చు. ఈ కారు ఖరీదు సుమారు 1.3 మిలియన్ డాలర్లు.

4. బుగాటి వేరాన్

4. బుగాటి వేరాన్

ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నది ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే బుగాటి వేరాన్ కారు. తడిసిన రోడ్డుపై గంటకు 100 మైళ్లకు పైగా వేగంగా వెళ్తున్న ఈ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో ఈ కారును కొనుగోలు చేసిన ఒక్క వారం కూడా పూర్తి కాలేదు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. దీని ఖరీదు సుమారు 1.6 మిలియన్ డాలర్లు.

3. 1959 ఫెరారీ 250 జిటి టిడిఎఫ్

3. 1959 ఫెరారీ 250 జిటి టిడిఎఫ్

క్లాసిక్ కార్ల స్పేర్స్ చాలా అరుదుగా లభిస్తాయి. ఇలాంటి కార్లకు ప్రమాదం జరిగితే వాటిని షెడ్డుకే పరిమితం చేయాలి. అలాంటి ఓ కారు ప్రమాదమే ఇది. ఈ జాబితాలో 3వ స్థానంలో ఉన్నది 1959 ఫెరారీ 250 జిటి టిడిఎఫ్. ఓ రేస్ ట్రాక్‌పై ఈ కారు ప్రమాదానికి గురైంది. దీని ఖరీదు 1.65 మిలియన్ డాలర్లు.

2. ఫెరారీ 250 జిటి స్పైడర్

2. ఫెరారీ 250 జిటి స్పైడర్

ఖరీదైన కార్లను మన చేతుల్తోనే క్రాష్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్కోసారి మన టైం బాగోలేకపోతే ప్రకృతి కూడా మన మీద పగబట్టొచ్చు. ఇదిగో ఈ ఫొటోలోని కారును చూడండి, బీచ్ పక్కన పార్క్ చేసి ఉన్న ఈ ఫెరారీ 250 జిటి స్పైడర్ కారును హారికేనే ఎలా పాడు చేసిందో. మే 2008లో ఇలాంటి కార్లలో ఒకటి వేలంలో 10,894,900 డాలర్ల వెల పలికింది.

1. ఫరారీ 250 జిటిఓ

1. ఫరారీ 250 జిటిఓ

గత 2008లో జరిగిన ఓ ఫెరారీ 250 జిటిఓ కారు ప్రమాదం ఈ జాబితాలో అత్యంత ఖరీదైన ప్రమాదంగా నిలిచింది. ఈ అరుదైన క్లాసిక్ కారు ఖరీదు 28.5 మిలియన్ డాలర్లు. ఈ కారును ఎగ్జిబిషన్ కోసం తీసుకువెళ్తుండగా ప్రమాదం జరిగింది.


Photo Cresits: wreckedexotics

More from DriveSpark

Article Published On: Monday, September 1, 2014, 10:21 [IST]
English summary
In the modern world, accidents and crashes have become common due to the growth of population and people making more money. Owning cars has become easy. Here in our list below, we take a look at the world's top 10 most expensive crashes till date.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+