Most Expensive Cars దేశంలో అత్యంత ఖరీదైన కార్లు.. వాటి ఓనర్లు, ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
భారత్‌లో సరికొత్త కార్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో కార్లు మార్కెట‌్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో దాదాపు రూ. 3.99 లక్షల నుంచి కార్ల ప్రారంభమవుతున్నాయి. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని ఆయా కంపెనీలు సరికొత్తకారులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. దీంతో దేశంలో ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది.
దేశంలో చాలామంది ధనికులు, పారిశ్రామిక, సినీ రంగంలో ఉన్నవాళ్లు అత్యంత ఖరీదైన కార్లు కలిగి ఉన్నారు. దేశంలో ప్రసిద్ధ వ్యక్తులు అత్యంత ఖరీదైన ప్రత్యేకమైన వాహనాలను కలిగి ఉన్నారు. అత్యంత ఖరీదైన వాహనాలు ఏవి, వాటిని ఎవరు కలిగి ఉన్నారో ఈ కథనంలో మీకు అందించబోతున్నాం. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లు, వాటి యజమానుల జాబితా మీ కోసం..

బెంట్లీ ముల్సానే సెంటినరీ ఎడిషన్ ఈడబ్ల్యూబీ: భారతదేశంలో అత్యంత ఖరీదైన వాహనం బెంట్లీ ముల్సానే సెంటినరీ ఎడిషన్ ఈడబ్ల్యూబీ ఎడిషన్ గా నిలిచింది. ఈ సూపర్ లగ్జరీ సెడాన్ ను భారతదేశంలోని అతిపెద్ద మెడికల్ న్యూట్రిషన్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో ఒకటైన బ్రిటిష్ బయోలాజికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ వి.ఎస్.రెడ్డి కలిగి ఉన్నారు. ఈ కారు ఖరీదు సుమారు రూ.14 కోట్లుగా ఉంది.
బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బెంట్లీ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన లిమిటెడ్ ఎడిషన్ గా ఈ కారు నిలచింది. ప్రపంచంలో కేవలం 100 యూనిట్లను మాత్రమే బ్రాండ్ సృష్టించింది. ఈ లగ్జరీ కారు 6.75-లీటర్ వి8 ఇంజిన్ పనిచేస్తుంది. ఇది 506 bhp వద్ద 1020nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇది 8-స్పీడ్ జెడ్ఎఫ్ ఆటోమేటిక్ ఆప్షన్ లో రానుంది. 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.5 సెకన్లలో అందుకోవడంఈ కారు ప్రత్యేకత. ఇది గంటకు 296 కిలోమీటర్ల గనిష్ట వేగాన్ని అందుకుంటుంది.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII ఈడబ్ల్యూబీ: వాస్తవానికి ఈ జాబితాలో ముఖేష్ అంబానీ ఆస్తుల ప్రకారం చూసుకుంటే ఆయన వాడే కారు ముందు ఉండాలి కానీ.. రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII ఈడబ్ల్యూబీ ముంబైలో ఈ కారు బేస్ ప్రైస్ రూ.13.5 కోట్లుగా ఉంది. కాబట్టి ఇది రెండో స్థానాన్ని దక్కించుకుంది. అయితే రోల్స్ రాయిస్ కస్టమైజ్డ్ ఉత్పత్తులకు ప్రసిద్ది చెందిందని గుర్తింపు ఉంది. కాబట్టి అంబానీ గ్యారేజీలో ఉన్న కారు విలువ రూ.13.5 కోట్లకు పైగా ఉంటుందని మనం చెప్పవచ్చు. ఎక్స్ షోరూమ్ ప్రకారం ఇది రెండో స్థానాన్ని పొందింది.
ఈ భారీ రోల్స్ రాయిస్ సిరీస్ ఈడబ్ల్యూబీ 6.75 -లీటర్ ట్విన్-టర్బోఛార్జ్ డ్ V2 ఇంజన్ తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 563bhp వద్ద 900ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆర్ పిఎమ్ వద్ద ఉంటుంది. ఇది 8-స్పీడ్ శాటిలైట్-అటాచ్డ్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్ ద్వారా చక్రాలకు శక్తిని బదిలీ చేస్తుంది. ఈ సమయంలో కారు 1700RPM పీక్ పవర్ ను విడుదల చేస్తుంది. ఈ కారు కేవలం 05 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

మెక్‌లారెన్ 12 ఎల్‌టీ స్పైడర్: ఆ తర్వాతి స్థానంలో రూ.12కోట్ల విలువైన మెక్‌లారెన్ 12 ఎల్ టీ స్పైడర్ ఉంది. అత్యంత ఖరీదైన ఈ సూపర్ కారును హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త నసీర్ ఖాన్ సొంతం చేసుకున్నారు. ఈ జాబితాలోని తర్వాతి కారు కూడా అతనికి చెందినదే కావడం విశేషం. అయితే అతని మెక్ లారెన్ 765 ఎల్‌టీ స్పైడర్ ప్రపంచవ్యాప్తంగా 765 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. ఇది భారతదేశంలోని ఇతర సూపర్ కార్ల కంటే ప్రత్యేకమైనది.
మెక్‌లారెన్ 765 ఎల్‌టీ స్పైడర్‌లో 4.0-లీటర్ ట్విన్-టర్బోఛార్జ్‌డ్ వి8 పెట్రోల్ ఇంజన్ కలదు ఇది 765bhp వద్ద 800 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్ బాక్స్‌తో జతచేయబడింది. దీనిలోని పవర్ మొత్తం వెనుక చక్రాలకు పంపబడుతుంది. దీంతో కారు వేగంగా ప్రయాణించే శక్తిని పొందుతుంది.
మెర్సిడెస్ ఎస్600 గార్డ్: ఈ జాబితాలో ఉన్న రెండవ అంబానీ కారు ఇది. మెర్సిడెస్ ఎస్600 గార్డ్ రూ.10 కోట్లకు పైగా ఖరీదైన స్పెషల్ ఆర్డర్ వాహనంగా ఉంది. భారత్ లో ఈ కారును ఉపయోగిస్తున్న ఏకైక వ్యక్తి ముకేశ్ అంబానీ. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కార్లలో ఇది ఒకటి, దీనిలో ప్రయాణించే వారు ఎటువంటి దాడి నుంచి రక్షించ గలిగే ప్రత్యేక కవచాన్ని కలిగి ఉంది. ఎస్-గార్డ్ వీఆర్10 లెవల్ ప్రొటెక్షన్‌తో ఇది వస్తుంది. ఇది ట్విన్-టర్బోఛార్జ్‌డ్ 6.0-లీటర్ వి12 ఇంజన్ గరిష్టంగా 523 bhp వద్ద 850 nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు.
రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్: ఈ కారుని కూడా నసీర్ ఖాన్ కలిగి ఉన్నాడు. దీని ధర సుమారు 8.20 కోట్లుగా ఉంది. అంబానీ కుటుంబం భారతదేశంలో కల్లినన్లను కలిగి ఉన్న జాబితాలో ఉన్నారు. తాజాగా షారుఖ్ ఖాన్ రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ కారును కొనుగోలు చేశారు. 6.75-లీటర్ ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 600bhp వద్ద 900nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో జతచేయబడి ఉంటుంది. దీని పవర్ మొత్తం నాలుగు చక్రాలకు పంపబడుతుంది.


Click it and Unblock the Notifications








