ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన కార్లు

By Ravi

డబ్బున్న దొరబాబులకు విలాసాలంటే భలే మోజు. వారు ఉపయోగించే ప్రతి వస్తువు కూడా తమ స్థాయిని ప్రతిభింభింపజేసేలా ఉండాలనుకుంటారు కొందరు ధనవంతులు. అందుకే తాము ధరించే దుస్తుల నుంచి ప్రయాణించే కార్ల వరకూ అన్ని విలాసవంతంగానే ఉంటాయి. మరి ఈ విలాసాలు చవగా రావు. 'పిండి కొద్ది రొట్టె' అన్న చందంగానే, వెచ్చించే డబ్బును బట్టి విలాసాలు అందుబాటులో ఉంటాయి.

ఈ నేపథ్యంలో, ఖరీదైన కార్లపై మోజుపడే ధనవంతుల కోసం ప్రపంచంలోని పలు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ప్రత్యేకించి ఒక వర్గం ప్రజల కోసమే కార్లను తయారు చేస్తుంటాయి. ఉదాహరణకు ఫెరారీ, లాంబోర్గినీ, ఆస్టన్ మార్టిసన్, మాసేరటి మొదలైన సంస్థలు తయారు చేసే కార్లు సమాన్యులకు కనుచూపు మేరలో కూడా అందుబాటులో ఉండవు. ఇవి ప్రత్యేకించి ధనవంతుల కోసం మాత్రమే తయారు చేయబడుతాయి.

మరి ఈ ప్రపంచంలో లభ్యమవుతున్న అత్యంత ఖరీదైన కార్లంటే, వాటి కథేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

లాంబోర్గినీ వెనెనో

లాంబోర్గినీ వెనెనో

- ధర 3.9 మిలియన్ డాలర్లు

ఈ ఏడాది జరిగిన 2013 జెనీవా మోటార్ షోలో లాంబోర్గినీ ఈ లిమిటెడ్ ఎడిషన్ వెనెనో సూపర్ కారును విడుదల చేసింది. ఇలాంటి కేవలం 3 కార్లను మాత్రమే కంపెనీ ఉత్పత్తి చేసింది. లాంబోర్గనీ నుండి లభిస్తున్న కార్లలో కెల్లా ఇదే అత్యంత వేగంగా పరుగులు పెట్టే సూపర్ కారు ఇదే. ఇందులో శక్తివంతమైన 6.5 లీటర్ వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 750 పిఎస్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ఈ శక్తి అవెంటేడర్‌లో ఉపయోగించిన ఇంజన్ కన్నా 50 పిఎస్‌లు అధికం. ఈ ఇంజన్‌ను 7-స్పీడ్ రోబోటైజ్డ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

డబ్ల్యూ మోటార్స్ లైకన్ హైపర్‌స్పోర్ట్

డబ్ల్యూ మోటార్స్ లైకన్ హైపర్‌స్పోర్ట్

- ధర 3.4 మిలియన్ డాలర్లు

2013 ఖతార్ మోటార్ షో ద్వారా తొలిసారిగా ప్రజల ముందుకు వచ్చిన తొలి అరేబియన్ హైపర్ కారు డబ్ల్యూ మోటార్స్ లైకన్ హైపర్‌స్పోర్ట్. ఇందులో 750 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తిని చేసే ఇంజన్‌ను ఉపయోగించారు. దీని గరిష్ట వేగం గంటకు 245 మైళ్లు.

బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్

బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్

- ధర 2.4 మిలియన్ డాలర్లు

బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్ కేవలం ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన కారు మాత్రమే కాదు, ఇది ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే స్ట్రీట్ లీగల్ కారు కూడా. దీని గరిష్ట వేగం గంటకు 267 మైళ్లు.

ఆస్టన్ మార్టిన్ వన్-77

ఆస్టన్ మార్టిన్ వన్-77

- ధర 1.85 మిలియన్ డాలర్లు

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ విడుదల చేసిన ఆస్టన్ మార్టిన్ వన్-77 ఓ లిమిటెడ్ ఎడిషన్ కారు. పేరుకు తగినట్లుగానే కేవలం 77 యూనిట్లను మాత్రమే కంపెనీ ఉత్పత్తి చేసింది. ఇందులో ఉపయోగించిన వి12 ఇంజన్ గరిష్టంగా 750 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 220 మైళ్లు.

పగని జోండా సింక్యూ రోడ్‌స్టర్

పగని జోండా సింక్యూ రోడ్‌స్టర్

- ధర 1.85 మిలియన్ డాలర్లు

ఆస్టన్ వన్-77 కారు మాదిరిగానే పగని జోండా సింక్యూ రోడ్‌స్టర్ కూడా అత్యంత అరుదైన కారు. అయితే, దీని టాప్ స్పీడ్ ఆస్టన్ మార్టిన్ వన్-77 కన్నా తక్కువే. పగని జోండా సింక్యూ రోడ్‌స్టర్ గరిష్ట వేగం గంటకు 217 మైళ్లు.

లాంబోర్గినీ రెవెంటన్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ రెవెంటన్ రోడ్‌స్టర్

- ధర 1.6 మిలియన్ డాలర్లు

ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ కంపెనీ లాంబోర్గినీ అందిస్తున్న రెవెంటన్ రోడ్‌స్టర్ కూడా లిమిటెడ్ ఎడిషన్ మోడల్. కంపెనీ కేవలం 20 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. ఇది కేవలం 3.3 సెకండ్లలోనే గంటకు 0-60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 211 మైళ్లు.

కొయినిగ్‌సెగ్ అగెరా ఆర్

కొయినిగ్‌సెగ్ అగెరా ఆర్

- ధర 1.6 మిలియన్ డాలర్లు

బుగాటి కార్లు గట్టి పోటీ ఇవ్వగల సామర్థ్యం ఉన్న కార్లను కొయినిగ్‌సెగ్ ఉత్పత్తి చేస్తుంది. బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్ మోడల్‌కు ధీటుగా రూపొందించిన కారే ఈ కొయినిగ్‌సెగ్ అరెగా ఆర్. దీని గరిష్ట వేగం గంటకు 235 మైళ్లు.

మేబ్యాక్ ల్యాండ్యూలెట్

మేబ్యాక్ ల్యాండ్యూలెట్

- ధర 1.38 మిలియన్ డాలర్లు

మెర్సిడెస్ బెంజ్‌కు చెందినదే ఈ మేబ్యాక్ బ్రాండ్. ఈ లగ్జరీ సెలూన్ గరిష్ట వేగం గంటకు 115 మైళ్లు. వెనుక సీట్లలోని ప్యాసింజర్లు ప్రకృతి గాలిని ఆస్వాదించేందుకు కోసం పైభాగంలో స్లైడింగ్ రూఫ్ ఉంటుంది.

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

- అంచనా ధర 1.3 మిలియన్ డాలర్లు

ఫెరారీ ఇటీవల ఆవిష్కరించిన హైపర్‌కారు లాఫెరారీ. ఇది ఫెరారీ కార్లలో కెల్లా అత్యంత ఖరీదైన కారు కావచ్చని అంచనా. ఇందులో 950 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే ఇంజన్‌ను ఉపయోగించారు. దీని గరిష్ట వేగం గంటకు 217 మైళ్లు. కేవలం 499 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి కానున్నాయి.

మెక్‌లారెన్ పి1

మెక్‌లారెన్ పి1

- ధర 1.3 మిలియన్ డాలర్లు

2013 జెనీవా మోటార్ షోలో మెక్‌లారెన్ తమ పి1 హైపర్ కారును ఆవిష్కరించింది. ఇందులో ఉపయోగించిన వి8 ఇంజన్ గరిష్టంగా 903 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

జెన్వో ఎస్‌టి1

జెన్వో ఎస్‌టి1

- ధర 1.225 మిలియన్ డాలర్లు

జెన్వో ఎస్‌టి1 సూపర్ కారు కూడా లిమిటెడ్ ఎడిషనే. కేవలం 15 కార్లను మాత్రమే కంపెనీ ఉత్పత్తి చేసింది. ఇందులో 7.0 లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది కేవలం 3 సెకండ్ల కన్నా తక్కువ సమయంలో 0-60 మైళ్ల వేగంతో పరుగులు తీయగలదు. దీని గరిష్ట వేగం గంటకు 233 మైళ్లు.

హెన్నెస్సీ వెనామ్ జిటి స్పైడర్

హెన్నెస్సీ వెనామ్ జిటి స్పైడర్

- ధర 1.1 మిలియన్ డాలర్లు

వెనామా్ జిటి సూపర్ కారు సృష్టికర్త జాన్ హెన్నెస్సీ సృష్టించారు. ఈ కన్వర్టిబల్ కారులో 7.0 లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది కేవలం 2.5 సెకండ్లలోనే గంటకు 0-60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, July 22, 2013, 18:58 [IST]
English summary
Drivespark cracks down on some of the most expensive cars in world. Take a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+