అత్యంత ఖరీదైన మోటార్ హోమ్ 'ఎలిమెంట్ పలాజో'
మోటార్ వాహనాలు నివాస గృహాలుగా మార్చుకోవడం కొందరికి సరదా. పలు ఆటోమొబైల్ కంపెనీలు, వాహన మోడిఫైయర్లు, కోచ్ బిల్డర్లు నివాస పరిసరాల్లో ఉండే అన్ని సదుపాయాలను మోటార్ వాహనాల్లో కల్పిస్తూ సదరు వాహనాలను నివాసయోగ్యమైన వాహనాలుగా మార్చేస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే వీటిని కదిలే ఇళ్లు అనొచ్చు. వీటినే మోటార్ హోమ్స్ అని అంటుంటారు. పిండి కొద్ది రొట్టె అన్న చందంగా డబ్బు వెచ్చించే కొద్ది విలాసవంతమైన మోటార్ హోమ్‌లను సొంతం చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన, విలాసవంతమైన మోటార్ హోమ్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటలీకు చెందిన మార్చీ మొబైల్స్ అనే కంపెనీ ఓ అద్భుతమైన మోటార్ హోమ్‌ను తయారు చేసింది. కళ్లు చెదిరే అందంతో, అత్యంత విలాసవంతమైన మరియు సౌకర్యవంతమైన ఇంటీరియర్లతో కంపెనీ ఈ మోటార్ హోమ్‌ను తీర్చిదిద్దింది. ఈ మోటార్ హోమ్ పేరు ఎలిమెంట్ పలాజో (పలాజో అంటే ప్యాలెస్ అని అర్థం). ఇది నిజంగానే పేరుగా తగినట్లుగా కదిలే ప్యాలెస్‌ను తలపిస్తుంది.
ఎలిమెంట్ పలాజో మోటార్ హోమ్‌లో ఉండే లగ్జరీ ఫీచర్లు మిలియనీర్లలో ఇళ్లలో కూడా ఉండవంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో. మరి ఈ మోటార్ హోమ్ ధరెంతో తెలుసా..? 30 లక్షల డాలర్లు. అంటే మనదేశ కరెన్సీలో జస్ట్ రూ.15 కోట్లు మాత్రమే. మరి ఈ లగ్జరీ మోటార్ హోమ్‌లో అంత లగ్జరీ ఏముందో చూసేద్దాం రండి..!

ఎలిమెంట్ పలాజో మోటార్ హోమ్
ఇటలీకు చెందిన మార్చీ మొబైల్స్ అనే కంపెనీ ఓ అద్భుతమైన మోటార్ హోమ్‌ను తయారు చేసింది. ఎలిమెంట్ పలాజో మోటార్ హోమ్ అని పిలిచే ఈ వాహనం ప్రపంచంలో అత్యంత ఖరీదైనది.

ఎలిమెంట్ పలాజో మోటార్ హోమ్
ఎలిమెంట్ పలాజో మోటార్ హోమ్ ఫ్రంట్ డిజైన్ చాలా విచిత్రంగా ఉంటుంది. దీని ఏరోడైనమిక్స్ కారణంగా 20 శాతం ఇంధనం ఆదా అవుతుంది. ఇది 530 హెచ్‌పి టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌తో నడుస్తుంది.

ఎలిమెంట్ పలాజో మోటార్ హోమ్
మినీ బార్, మాస్టర్ బెడ్ విత్ అటాచ్డ్ బాత్‌రూమ్, ఆటోమేటిక్ సన్‌రూఫ్, సొగసైన ఇంటీరియర్ డిజైన్, కంటికి ఇంపైన ఇంటీరియర్ లైటింగ్, ఇంటర్నెట్ బ్రౌజ్ చేసేందుకు వైఫై, అతిథులకు ఆతిథ్యమిచ్చేందుకు విలాసవంతమైన సోఫా వంటి అనేక లగ్జరీ ఫీచర్లు ఈ కోచ్‌లో గమనించవచ్చు.

ఎలిమెంట్ పలాజో మోటార్ హోమ్
ఇందులో మూడు సెట్టింద్స్ ఉంటాయి. అందులో ఒకటి వ్యక్తి ఉపయోగార్థం (ఎలిమెంట్ పలాజో), మరొకటి విఐపిల కోసం (ఎలిమెంట్ వైవా - విఐపి షటిల్), ఇంకొకటి ప్రచారం కోసం (ఎలిమెంట్ విజన్ - ప్రమోషన్ వెహికల్).

ఎలిమెంట్ పలాజో మోటార్ హోమ్
ఎలిమెంట్ వైవా - విఐపి షటిల్
ఈ సెట్టింగ్ ప్రముఖులు, విఐపిలు మరియు వ్యాపార వేత్తల కోసం. ఇందులో ఆరుగు సౌకర్యంగా కూర్చొని వ్యాపార సంభాషణలు సాగించుకోవచ్చు.

ఎలిమెంట్ పలాజో మోటార్ హోమ్
ఎలిమెంట్ విజన్ - ప్రమోషన్ వెహికల్
ఈ సెట్టింగ్ డిస్‌ప్లే, ప్రమోషన్ ఏరియా కోసం ఉపయోగించుకోవచ్చు. ఇందులో 200 చ.అ. విస్తీర్ణంలో స్థలం ఉంటుంది.

ఎలిమెంట్ పలాజో మోటార్ హోమ్
ఈ మోటార్ వాహనం ధర 30 లక్షల డాలర్లు. అంటే మనదేశ కరెన్సీలో సుమారు రూ.15 కోట్లు.

ఎలిమెంట్ పలాజో మోటార్ హోమ్
ఎలిమెంట్ పలాజో ఫ్లోర్ ప్లాన్



Click it and Unblock the Notifications








