Most Expensive Number Plate వామ్మో నంబర్ ప్లేట్ కి రూ.122 కోట్లా..?
ప్రతి ఒక్కరు కారు లేదా బైక్ కొనాలనే కలలు కంటారు. వాటిని కొనుగోలు చేసిన అనంతరం దానికి తగిన గుర్తింపు సంఖ్య కోసం తెగ ఆరాట పడతారు. వారికంటూ ఓ ప్రత్యేకత ఉండాలని తెలియజేసుకునేందుకు ఫ్యాన్సీ నెంబర్లను ఎంచుకుంటారు. అయితే చాలా మంది దీనిపై ప్రత్యేక చూపరు. కాకపోతే కొందరు పనికట్టుకుని వీటికోసం నిర్వహించే వేలంలో ఉత్సాహంగా పాల్గొంటారు.
కొంతమంది సంపన్న వ్యాపారవేత్తలు సెలబ్రిటీలు కారు ఫ్యాన్సీ నంబర్‌పై చాలా క్రేజ్ కలిగి ఉన్నారు. ఇందుకోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. వీటికోసం ఇంకా కోట్లలో డబ్బు ఖర్చు చేసే వారు కూడా ఉన్నారు. ఇటీవల జరిగిన 'మోస్ట్ నోబుల్ నంబర్స్' ఛారిటీ వేలంలో ఒక VIP కార్ నంబర్ ప్లేట్ 'P 7' రికార్డు స్థాయిలో అమ్ముడు పోయింది. ఆ వివరాలు మీకోసం..

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు..
ఈ ఛారిటీ నిర్వహించిన వేలంలో మునుపెన్నడు లేని విధంగా 55 మిలియన్ దిర్హామ్‌లకు 'P 7' అమ్ముడుపోయింది. ఇది భారతీయ కరెన్సీలో దాదాపు రూ.122.6 కోట్లు సమానం. 'P 7' అనే నంబర్ ప్లేట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది.. ఫ్రెంచ్-ఎమిరాటీ వ్యాపారవేత్త, టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడైన పావెల్ వాలెరివిచ్ దురోవ్.. ఈ నంబరును సొంతం చేసుకున్నారు. వేలం ద్వారా వచ్చే ఆదాయం నేరుగా "1 బిలియన్ మీల్స్ ఎండోమెంట్" ప్రచారానికి వెళ్తుంది.
రంజాన్ కోసం అతిపెద్ద ఆహార సహాయ స్వచ్ఛంద నిధిని స్థాపించడం ఈ ప్రచారం లక్ష్యం. ప్రపంచ ఆకలిని అంతం చేసే ప్రయత్నాలలో భాగంగా UAE వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దీనిని ప్రారంభించారు. నెంబర్ ప్లేట్ కోసం ఇంత డబ్బు వెచ్చిస్తున్నారని టేకర్లు గుర్తుంచుకోవాలి.
సేవాకోసం వేలం..
ఇంత పెద్ద మొత్తంలో డబ్బును మంచి పనికి వినియోగించడం అభినందనీయం. మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్‌తో కలిసి వేలం నిర్వహించబడింది. ఈ వేలంలో AA19, AA22, AA80, O71, X36, W78, H31, Z37, J57, N41 వంటి 10 రెండు అంకెల సంఖ్యలతో సహా అనేక ఇతర నంబర్ ప్లేట్లు వేలంలో భాగంగా ఉన్నాయి.
ఇతర ప్రత్యేక నంబర్ ప్లేట్లలో Y900, Q22222, Y6666 ఉన్నాయి. AA19 సంఖ్య 4.9 మిలియన్ దిర్హామ్‌లకు విక్రయించగా, O 71 150 మిలియన్ దిర్హామ్‌లకు, Q22222 9,75,000 దిర్హామ్‌లకు విక్రయించబడింది. 2008లో అబుదాబికి చెందిన కారు నంబర్ 1 ప్లేట్ 52.2 మిలియన్ దిర్హామ్‌లకు (సుమారు 116.3 కోట్లు) విక్రయించి నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. ఫోన్ నంబర్లు ఇతర నంబర్లకు సంబంధించిన వేలం కూడా నిర్వహించారు.
దేశంలోనూ అధిక మొత్తంలో..
దేశంలోనూ ఈ తరహా ఫ్యాన్సీ నెంబర్లకు గిరాకీ ఎక్కువగా ఉంది. అయితే ఇవి కేవలం ప్రభుత్వ పరిధిలో ఉండటంతో ఆ సొమ్ము అంతా ప్రభుత్వ ఖాతాలోకే వెళ్లనుంది. సెలబ్రిటీలు, క్రికెటర్లు, రాయకీయ నాయకులు ఎక్కువగా వీటిని ఖరీదు చేస్తున్నారు. సంపన్నులు కూడా భారీ మొత్తంలో ఫ్యాన్సీ నెంబర్ల కోసం అధిక మొత్తంలో వెచ్చిస్తున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








