ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన టాప్ 10 లగ్జరీ హెలికాప్టర్లు: ఆశ్చర్యగొలిపే నిజాలు...
టూరిజం, రక్షణ సేవలు మరియు సైనికుల ప్రయాణానికి గల ఏకైక రవాణా మార్గం వాయు రవాణా మార్గం మరియు వ్యక్తిగతంగా కూడా ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇలా వీరందరు రవాణా కొరకు ఎక్కువగా ఉపయోగిస్తున్నది హెలికాఫ్టర్లుని.
అంతే కాకుండా వ్యక్తిగతంగా ఉపయోగించే హెలికాఫ్టర్లలో సొంత అవసరాలకు సంభందించి ఇంకా ఎక్కువ ఫీచర్లు కలిగి ఉంటాయి. అలాంటి వాటిలో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన లగ్జరీ హెలికాఫ్టర్ల గురించి క్రింది స్లైడర్‌లో అందించాము. ప్రతి రెండు స్లైడర్‌లు ఒక హెలికాఫ్టర్ యొక్క ప్రత్యేక విశేషాలను అందిస్తుంది.

10. యూరోకాప్టర్ ఇసి 135
జర్మనీకి చెందిన ఎయిర్‌బస్ విమానాల సంస్థ తన హెలికాప్టర్‌కు యూరోకాఫ్టర్ ఇసి 135 అనే పేరుతో నామకరణం చేసింది. ఈ యురోకాఫ్టర్ ఇసి 135 హెలికాఫ్టర్‌ని 1996 లో పరిచయం చేశారు. దాదాపుగా 1000 యూరోకాఫ్టర్‌లను తయారు చేసినట్లు సమాచారం మరియు అందులో దాదాపుగా 500 వరకు ఎయిర్ అంబులెన్స్‌ల కోసం, పోలీస్ మరియు హెల్త్ సెక్టార్ లలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వ్యక్తిగతంగా కూడా దీనిని ఎక్కువ మంది ఎంచుకున్నారు.

ప్రత్యేకతలు
కాలం మారేకొద్ది ఈ సంస్థ వివిద రకాల వేరియంట్లలో ఈ యూరోకాఫ్టర్‌లను అందిస్తోంది. వ్యక్తిగత అవసరాల బట్టి ఈ హెలికాఫ్టర్‌లలో దాదాపుగా 1.8 మిలియన్ డాలర్ల విలువ చేసే ఇంటీరియర్ డిజైన్‌ను అందిస్తోంది. ఇందులో ఒకరు లేదా ఇద్దరు పైలట్లు మరియు ఐదు నుండి ఏడు మంది ప్రయాణించేందుకు వీలుగా ఉండేలా డిజైన్ చేశారు.

9.ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ ఎడబ్ల్యూ 109
లగ్జరీ హెలికాఫ్టర్లకు ప్రసిద్ది గాంచిన హెలికాఫ్టర్ ఇది. దీనిని 1976 సంవత్సరంలో పరిచయం చేశారు. దీని ఇంటీరియర్‌ను పూర్తిగా లెథర్‌తో తయారుచేశారు. మరియు ఇందులో మంచి ఇంటీరియర్‌ను కల్పించారు.

ప్రత్యేకతలు
ఈ హెలికాఫ్టర్ అత్యదికంగా 964 కిలోమీటర్లు ప్రయాణించగలదు. మరియు దీని వేగం గంటకు 285 కిలోమీటర్లు. ఈ అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఎడబ్ల్యూ 109 హెలికాఫ్టర్ ధర 6.3 మిలియన్ అమెరికన్ డాలర్లు.

8. మెర్సిడెస్ -బెంజ్ ఇసి 145 యూరోకాప్టర్
వ్యక్తిగత హెలికాఫ్టర్ ప్రియుల కోసం మెర్సిడెస్ బెంజ్ ఈ హెలికాప్టర్‌ను అందించింది. దీనిని 2002 పరిచయం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో అత్యధికంగా 9 మంది వరకు కలిసి ప్రయాణించవచ్చు.

మరిన్ని విశిష్టతలు
ఈ హెలికాఫ్టర్ అత్యధికంగా గంటకు 246 కిలోమీటర్ల వేగంతో ఎగరగలదు, ఇది అత్యధికంగా 686 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇది 17,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు. దీని ధర 7 మిలియన్ అమెరికన్ డాలర్లు.

7. యూరోకాప్టర్ ఇసి 175
ఈ యూరోకాఫ్టర్ ఇసి 175 హెలికాఫ్టర్‌ను 2009 లో పరిచయం చేశారు. ఇందులో అత్యధికంగా 16 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

ప్రత్యేకతలు
ఇది గంటకు 286 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు మరియు ఇది గరిష్టంగా 555 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. దీని ధర 7.9 అమెరికన్ డాలర్లు. మన దేశంలో సుమారుగా 51 కోట్లు ఉండవచ్చు.

6. యూరోకాఫ్టర్ ఇసి 155
ఈ హెలికాప్టర్‌లో అత్యధికంగా 13 మంది ప్రయాణించవచ్చు. అలాగే ఈ మోడల్‌లో బిజినెస్ క్లాస్ సీట్లు గల హెలికాఫ్టర్‌లో అయితే 6 నుండి 8 మంది ప్రయాణించవచ్చు.

ప్రత్యేకతలు
ఈ యూరోకాఫ్టర్ ఇసి 155 హెలికాఫ్టర్ అత్యధిక వేగం గంటకు 322 కిలోమీటర్లు మరియు ఇది గరిష్టంగా 858 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగలదు. దీని ధర 10 మిలియన్ అమెరికన్ డాలర్లు. మన దేశంలో దీని విలువ దాదాపుగా 65 కోట్లు ఉంటుంది.

5.సికోర్‌స్కై యస్‌యమ్-76-సి
ఈ హెలికాఫ్టర్‌లో అత్యధికంగా 12 మంది ప్రయాణించవచ్చు అయితే వ్యక్తిగత హెలికాఫ్టర్‌లో కేవలం 4 మాత్రమే సౌకర్యవంతంగా ప్రయాణించే వెసులుబాటు ఉంది.

ప్రత్యేకతలు
దీని అత్యధిక వేగం గంటకు 286 కిలోమీటర్లు మరియు ఇది గరిష్టంగా 761 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. దీని విలువ 12.95 అమెరికన్ డాలర్లు అయితే మన రుపాయల్లో దాదాపుగా 84 కోట్లు రుపాయలుగా ఉంది.

4. అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఎడబ్ల్యూ 139
ఈ హెలికాఫ్టర్‌ను ఎక్కువగా మిలిటరీ మరియు రక్షణ రంగావల్లో ఉపయోగిస్తారు. అవసరాన్ని బట్టి దీనిని వ్యక్తిగత అవసరాల కోసం కూడా మార్చుకోవచ్చు. మరియు ఇందులో అత్యధికంగా ఎనిమిది మంది ప్రయాణించవచ్చు.

ప్రత్యేకతలు
ఈ అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఎడబ్ల్యూ 139 హెలికాఫ్టర్ వేగం గంటకు 310 కిలోమీటర్లు మరియు ఇది అత్యధికంగా 922 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీని విలువ దాదాపుగా 14.5 అమెరికన్ డాలర్లుగా ఉంది.

3. బెల్ 525
2012 డల్లాస్‌లో జరిగిన ఎగ్జిబిషన్‌లో దీనిని ప్రదర్శించారు. అయితే అప్పటి నుండి ఎంతో మంది దీనిని ఆర్డర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో గల క్యాబిన్‌లో అత్యధిక స్థలం కలదు మరియు ఇందులో గరిష్టంగా 16 నుండి 20 మంది ప్రయాణించవచ్చు.

మరిన్ని విషయాలు
ఈ హెలికాఫ్టర్ గంటకు 306 కిలోమీటర్ల వేగంతో ఎగరగలదు మరియు ఇది అత్యధికంగా 926 కిలో మీటర్ల వరకు ప్రయాణించగలదు. దీని విలువ దాదాపుగా 15 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. మన రుపాయల్లో అయితే దీని ధర దాదాపుగా 97 కోట్లు రుపాయలుగా ఉంటుందని అంచనా. దీని 2017 లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం

2. సికోర్‌స్కై యస్-92
ఇందులో అత్యధితంగా 9 మంది వరకు ప్రయాణించవచ్చు. ఈ హెలికాఫ్టర్‌లో క్యాబిన్ స్పేస్‌కు కొదవేలేదు. మరియు ఇందులో అత్యంత విలువైన బంగారం మరియు వజ్రాలుతో అలంకరించారు.

మరిన్ని విషయాలు
ఇది అత్యధికంగా గంటకు 312 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది గరిష్టంగా 956 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోగలదు. హెలికాఫ్టర్ల రేంజ్‌ని బట్టి వీటి విలువ 17 నుండి 32 అమెరికన్ డాలర్ల వరకు ఉండనుంది. మన దేశం లో వీటి ప్రారంభ విలువ 110 కోట్ల రుపాయలు.

1. అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఎడబ్ల్యూ 101
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పేరుగాయించిన లగ్జరీ హెలికాఫ్టర్ ఇదే. దీనిని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారింగా ఉపయోగిస్తున్నాడు. ఇది 6.5 మీటర్లు పొడవు, 2.3 మీటర్ల వెడల్పు మరియు 1.91 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఇందులో గరిష్టంగా 24 మంది ప్రయాణించవచ్చు.

ప్రత్యేకతలు
ఈ హెలికాఫ్టర్ అత్యధిక వేగం 309 కిలోమీటర్లు మరియు ఇది గరిష్టంగా 1,389 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని విలువ 21 అమెరికన్ డాలర్లు అదే మన రుపాయల్లో అయితే దీని విలువ దాదాపుగా 136 కోట్ల రుపాయలుగా ఉంది.


Click it and Unblock the Notifications