ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన కార్ పార్కింగ్ స్పేస్

హాంగ్‌కాంగ్‌లో సగటు కారు ధర కంటే సగటు పార్కింగ్ ప్రదేశం ధరే ఎక్కువగా ఉంది. హాంగ్‌కాంగ్‌లో పార్కింగ్ స్పేస్ మార్కెట్ ధర ఏరోజుకు ఆరోజు విపరీతంగా పెరిగిపోతోంది. తాజాగా ఓ పార్కింగ్ స్పేస్ ధర రూ. 5.6 కోట్ల

By Anil Kumar

భూమి మీద ఏడవ అతి పెద్ద దేశం కావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అవసరాలు తీరిపోతున్నాయి. జనాభా పరంగా రెండవ అతి పెద్ద దేశం అయినప్పటికీ, పార్కింగ్ పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తడం లేదు. కానీ అక్కడక్కడ కొన్ని నగరాల్లో పార్కింగ్ సమస్యలు లేకపోలేదు. అయితే, హాంగ్‌కాంగ్ వంటి పొరుగు దేశాలతో పోల్చుకుంటే భారతీయులు అదృష్టవంతులనే చెప్పాలి.

అత్యంత ఖరీదైన కారు పార్కింగ్ స్పేస్

పశ్చిమాసియాలో బాగా అభివృద్ది చెందిన హాంగ్‌కాంగ్ వంటి దేశాల్లో పార్క్ ప్రదేశాలు భారీ ధర పలుకుతున్నాయి. అక్కడ కారు కొనడం సమస్య కాదు, ఆ కారుకు సరిపడా పార్కింగ్ స్పేస్ కొనుగోలు చేయడమే అసలైన సమస్య.

అత్యంత ఖరీదైన కారు పార్కింగ్ స్పేస్

అవును, మీరు చదివింది నిజమే, హాంగ్‌కాంగ్‌లో సగటు కారు ధర కంటే సగటు పార్కింగ్ ప్రదేశం ధరే ఎక్కువగా ఉంది. హాంగ్‌కాంగ్‌లో పార్కింగ్ స్పేస్ మార్కెట్ ధర ఏరోజుకు ఆరోజు విపరీతంగా పెరిగిపోతోంది. తాజాగా ఓ పార్కింగ్ స్పేస్ ధర రూ. 5.6 కోట్ల రుపాయలు పలికింది(ఇండియన్ కరెన్సీలో).

అత్యంత ఖరీదైన కారు పార్కింగ్ స్పేస్

ఏడు అడుగుల పార్కింగ్ కోసం ఏకంగా ఐదు కోట్ల అరవై లక్షలు వెచ్చించడమే ఇదే మొదటిసారి. మరియు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన పార్కింగ్ స్పేస్ కూడా ఇదే. ప్రపంచ వ్యాప్తంగా బాగా అభివృద్ది చెందిన చిన్న చిన్న దేశాల్లో జనాభా పెరిగిపోవడం మరియు విస్తీర్ణం తక్కువగా ఉండటంతో ఇలాంటి వాటి మార్కెట్ ఎక్కువైపోయింది.

అత్యంత ఖరీదైన కారు పార్కింగ్ స్పేస్

ఈ తరుణంలో, పురాతణ కార్లను సేకరించే డారిన్ వూ అనే వ్యక్తి 1968 మోడల్ మెర్సిడెస్ బెంజ్ పుల్‌మ్యాన్ లిమోసిన్ మరియు 1957 ఫియట్ అబర్త్ కార్లను, వాటి పార్కింగ్ స్పేస్ మీద వెచ్చించే డబ్బును ఆదా చేసుకునేందుకు హాంగ్‌కాంగ్ నుండి కాలిఫోర్నియాకు తరలించాడు. ఇప్పుడు, ఆ డబ్బుతో మరో ఐదు కార్లను కొనుగోలు చేయగలనని చెప్పుకొచ్చాడు.

అత్యంత ఖరీదైన కారు పార్కింగ్ స్పేస్

ఒక్క కారు పార్కింగ్ కోసం కావాల్సిన స్థలం రికార్డు స్థాయిలో అమ్ముడవం ఇదేమీ మొదటి సారి కాదు. హాంగ్‌కాంగ్‌లో ఇలాంటి రికార్డులు ఎన్నో నమోదయ్యాయి. ప్రస్తుతం సగటున ఒక్కో పార్కింగ్ స్పేస్ ధర రూ. 2 కోట్లు ఉంది.

అత్యంత ఖరీదైన కారు పార్కింగ్ స్పేస్

2006 నుండి ఇప్పటి వరకు హాంగ్‌కాంగ్ దేశంలో కారు పార్కింగ్ స్పేస్ ధరలు 6 రెట్లు పెరగగా, అదే కాలంలో ఇళ్ల ధరలు 3.4 రెట్లు పెరిగాయి. గణాంకాల ప్రకారం, హాంగ్‌కాంగ్‌లో సొంత కార్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య ఏకంగా 49 శాతం మేర పెరిగాయి. దీంతోనే పార్కింగ్ ప్రదేశాల ధరలకు రెక్కొలొచ్చాయని చెప్పవచ్చు.

అత్యంత ఖరీదైన కారు పార్కింగ్ స్పేస్

కేవలం హాంగ్‌కాంగ్ మాత్రమే కాదు, లండన్ మరియు న్యూ యార్క్ వంటి నగరాల్లో కూడా పార్కింగ్ సమస్య ఎక్కువైపోతోంది. భారత్‌లో కూడా పలు మెట్రో నగరాల్లో వ్యక్తిగత వాహనాల సంఖ్య అధికమవ్వడంతో పార్కింగ్ సమస్య తీవ్రమవుతోంది.

అత్యంత ఖరీదైన కారు పార్కింగ్ స్పేస్

ఢిల్లీలో పార్కింగ్, ట్రాఫిక్ మరియు వాతావారణ కాలుష్యం వంటి సమస్యలను అరికట్టేందుకు పార్కింగ్ స్పేస్ ఉంటేనే కొత్త కార్ల రిజిస్ట్రేషన్ అనుమతించే రూల్ అమల్లోకి వచ్చిందే. అంతే కాకుండా, కాలుష్యాన్ని అరికట్టేందుకు కొన్నాళ్లపాటు సరి, బేసి విధానం మరియు ఇంకొన్నాళ్లు ఇంజన్ కెపాసిటి 2,000సీసీ కంటే ఎక్కువ ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్ నిలిపివేసారు.

ఏదేమైనప్పటికీ, భవిష్యత్తులో పార్కింగ్ స్పేస్ కొనుగోలు చేసే పరిస్థితులు ఇండియాలో కూడా వచ్చే అవకాశం ఉంది.

Source: Bloomberg

Most Read Articles

English summary
Read In Telugu: Most Expensive Single Parking Space Sold for Record Rs 5.3 Crore in Hong Kong
Story first published: Friday, August 3, 2018, 17:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X