ఇవన్నీ దొంగల ఫేవరేట్ స్పేర్ పార్ట్స్.. కారులో వీటిని చిటికెలో మాయం చేసేస్తారు..!

టైర్లు, చక్రాలు.. బ్యాడ్జ్‌లు, ఇంజన్లు.. కావేవీ చోరీకి అనర్హం అని.. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, దొంగలు మాత్రం తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు. కారులో ఎక్కువగా మరియు సులంభంగా దొంగిలించబడే విడిభాగాలు ఏవో మీకు తెలుసా? అవేంటో ఈ కథనంలో చూద్దాం రండి.

ఇవన్నీ దొంగల ఫేవరేట్ స్పేర్ పార్ట్స్.. కారులో వీటిని చిటికెలో మాయం చేసేస్తారు..!

మనం ఎంతో ఇష్టపడి మరియు కష్టపడి కొనుక్కున్న కారుపై చిన్న గీత పడితేనే మనసు నొచ్చుకుంటుంది. అలాంటి కారులోని వస్తువులు/విడిభాగాలు దొంగించలబడే, ఆ బాదను మాటల్లో వర్ణించలేము. మితిమీరిన టెక్నాలజీ కారణంగా ఈరోజుల్లో దొంగలు కూడా చాలా స్మార్ట్ అయిపోయారు. ఏకంగా కారును దొంగిలిస్తే ఎక్కడ దొరికిపోతామో అని, కారులో విలువైన విడిభాగాలను సునాయాసంగా దొంగిలించేస్తున్నారు.

ఇలా దొంగిలించబడినా వాటిలో కొన్నింటికి మాత్రమే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది, మిగిలి వాటి ఖర్చుని సదరు కారు యజమానులే స్వయంగా భరించాల్సి ఉంటుంది. మరి దొంగలు టార్గెట్ చేసే కార్ స్పేర్ పార్ట్స్ ఏవో మీరే చూడండి.

ఇవన్నీ దొంగల ఫేవరేట్ స్పేర్ పార్ట్స్.. కారులో వీటిని చిటికెలో మాయం చేసేస్తారు..!

టైర్లు మరియు చక్రాలు

మీరు మీ కారును బహిరంగ ప్రదేశంలో లేదా నిర్మానుష్యంగా ఉండే ప్రాంతంలో పార్క్ చేస్తే, దొంగ చేతికి తాళాలను అందించినట్లే అవుతుంది. దొంగలు కారులోని చక్రాలు మరియు టైర్లను సులువుగా దొంగిలిస్తారు. వాహన యజమానులు కొత్తగా వీటిని కొనుగోలు చేయాలంటే సుమారు 30 వేల నుండి లక్ష రూపాయాల వరకు ఖర్చు అవుతుంది. చక్రాలు కేవలం నట్ బోల్టులతో బిగించబడి ఉంటాయి కాబట్టి, దొంగలు వాటిని సులువుగా అపహరించేస్తారు. ఇలా దొంగిలించిన వాటిని సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో టైర్‌గా, ట్యూబ్‌గా, అల్లాయ్‌గా విడివిడిగా విక్రయించే అవకాశం ఉంది.

ఇవన్నీ దొంగల ఫేవరేట్ స్పేర్ పార్ట్స్.. కారులో వీటిని చిటికెలో మాయం చేసేస్తారు..!

అయితే, చక్రాలు చోరీకి గురి కాకుండా ఉండేందుకు ఓ చక్కటి ఉపాయం ఉంది. అదేంటంటే, బయటి మార్కెట్లో లభించే వీల్ లాక్ బోల్ట్ (Wheel Lock Bolts) లను ఉపయోగించడం. ఈ వీల్ లాక్ బోల్టులు సాదారణ హెక్స్ బోల్టుల మాదిరిగా కాకుండా, విభిన్నమైన ప్యాటర్న్ ను కలిగి ఉంటాయి. చక్రం నుండి ఈ బోల్టును తొలగించాలంటే, వీటికి ప్రత్యేకమైన స్పానర్ అవసరం అవుతుంది. ఈ బోల్టులను విక్రయించే వారే ఆ స్పానర్ / వ్రెంచ్ ని కూడా అందిస్తారు. ఇవి ఆఫ్టర్ మార్కెట్ కార్ యాక్ససరీ షాపుల్లో లేదా ఆన్‌లైన్ మార్కెట్లో లభిస్తాయి.

ఇవన్నీ దొంగల ఫేవరేట్ స్పేర్ పార్ట్స్.. కారులో వీటిని చిటికెలో మాయం చేసేస్తారు..!

బ్రాండ్ బ్యాడ్జ్‌లు

సాధారణంగా కార్ల తయారీదారులు కారుపై తమ బ్రాండ్ లోగో మరియు కారు యొక్క పేరుని, దాని ఫీచర్లను సూచించే బ్యాడ్జ్‌లను అంటిస్తుంటారు. ఇవేమీ చాలా స్థిరమైన ఫిట్టింగ్ కావు, తయారీదారులు వీటిని ధృడమైన డబుల్ సైడ్ టేపుతో కారుపై అంటిస్తారు. అందుకే, దొంగలు వీటిని సులువుగా దొంగిలిస్తారు. పదునైన వస్తువు తీసుకొని, వాటిని చాలా చాకచక్యంగా లేపేస్తారు. మార్కెట్లో ఇలాంటి ఒరిజినల్ బ్యాడ్జలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. బాహ్య మార్కెట్‌లో లభించే బ్యాడ్జ్ లు అంత నాణ్యమైనవి కావు, అందుకే ఇలా దొంగిలించబడిన బ్యాడ్జ్ లకు ఎక్కువ డిమాండ్. దురదష్టవశాత్తు, ఈ బ్యాడ్జ్‌లు దొంగిలించబడకుండా ఉండటానికి మనం ఏమీ చేయలేము.

ఇవన్నీ దొంగల ఫేవరేట్ స్పేర్ పార్ట్స్.. కారులో వీటిని చిటికెలో మాయం చేసేస్తారు..!

ఉత్ప్రేరక (క్యాటలైటిక్) కన్వర్టర్లు

క్యాటలైటిక్ కన్వర్టర్లు అనేవి కారు యొక్క ఎగ్జాస్ట్ (సైలెన్సర్) ప్రాంతంలో అమర్చబడి ఉండి, ఉద్గారాలను నియంత్రించడానికి ఉపయోగించబడే ఓ పరికరం. ఈ ఉత్ప్రేరక కన్వర్టర్‌లో చిన్న మొత్తంలో ప్లాటినం మరియు రోడియం పధార్థాలు ఉంటాయి. ఇవి బంగారం కంటే విలువైన లోహాలు. అందుకే, దొంగలు వీటిని టార్గెట్ చేస్తారు. అయితే, సాధారణ దొంగలు కారు క్రింది భాగంలో ఉండే ఇలాంటి పరికరాన్ని దొంగిలించలేరు. ఆటోమొబైల్స్ గురించి అన్నీ తెలిసిన దొంగలు మాత్రమే ఈ కీలకమైన వస్తువును దొంగిలించగలరు.

ఇవన్నీ దొంగల ఫేవరేట్ స్పేర్ పార్ట్స్.. కారులో వీటిని చిటికెలో మాయం చేసేస్తారు..!

సైడ్ మిర్రర్స్

మ్యాన్యువల్ సైడ్ మిర్రర్స్ అంత ఖరీదైనవేమీ కావు. అయితే, నేటి ఆధునిక కార్లలో కెమెరాతో కూడిన సైడ్ మిర్రర్స్ మరియు టర్న్ ఇండికేటర్లు, ఎలక్ట్రిక్ మోటార్లతో కూడిన సైడ్ మిర్రర్స్ ఉంటున్నాయి. ఇలాంటివి కాస్తంత ఖరీదైనవిగా ఉంటాయి. చాలా వరకూ బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేసిన వాహనాలలో సైడ్ మిర్రర్లు చోరీకి గురవుతుంటాయి. కొందరు వీటిని వినోదం కోసం దొంగిలిస్తే, మరికొందరు ఇతరులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతో వీటిని దొంగిలిస్తారు. ఏదేమైనప్పటికీ, ఇలాంటి ఆధునిక సైడ్ మిర్రర్లను రీప్లేస్ చేసుకోవాలనుకుంటే, వాహన యజమానులకు నాలుగు వేల నుంచి ఇరవై వేల వరకూ ఖర్చు అవుతుంది.

ఇవన్నీ దొంగల ఫేవరేట్ స్పేర్ పార్ట్స్.. కారులో వీటిని చిటికెలో మాయం చేసేస్తారు..!

కారు బ్యాటరీ

ఏదైనా కారు చాలా కాలంగా ఒకే ప్రాంతంలో పార్క్ చేయబడి ఉందని దొంగలు గమనిస్తే, ఆ కారులో వీలైనన్ని విడిభాగాలను దొంగిలించేందుకు వారు ప్రయత్నిస్తారు. కారులో ఎక్కువగా చోరీకి గురయ్యే భాగాలలో బ్యాటరీ కూడా ఒకటి. కారుని తెలివిగా అన్‌లాక్ చేయగలిగే దొంగలు, బానెట్ ను ఓపెన్ చేసి, రెండు బోల్టులను తొలగించడం ద్వారా బ్యాటరీని అపహరించేస్తారు. కారు బ్యాటరీలు కూడా రకాన్ని బట్టి 3 వేల నుండి 10 వేల వరకూ ఉంటాయి. కారులో సేఫ్టీ అలారంని అమర్చుకోవడం ద్వారా ఇలాంటి దొంగతనాలకు చెక్ పెట్టవచ్చు.

ఇవన్నీ దొంగల ఫేవరేట్ స్పేర్ పార్ట్స్.. కారులో వీటిని చిటికెలో మాయం చేసేస్తారు..!

వీల్ క్యాప్స్

చాలా మంది వాహన వినియోగదారులు తమ స్టీల్ వీల్స్ ని కవర్ చేసుకునేందుకు వీల్ క్యాప్స్ ని ఉపయోగిస్తుంటారు. ఇవి తక్కువ ఖరీదైనవే అయినప్పటికీ, దొంగలు వీటిని సులువుగా అపహరించి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో విక్రయించేస్తుంటారు. సాధారణంగా, వీల్ క్యాప్స్ ని అమర్చడం లేదా తొలగించడం చాలా సులభం. ఇవి సింపుల్ క్లిక్ మెకానిజం ను కలిగి ఉంటాయి. వాటిని రిమ్ పై బలంగా నొక్కడం ద్వారా చక్రంపై అమర్చుకోవచ్చు మరియు అదే విధంగా బలంగా లాగడం ద్వారా తొలగించుకోవచ్చు. మార్కెట్లో వీల్ క్యాప్స్ 4 వేల నుండి 8 వేల వరకూ ధర పలుకుతాయి.

ఇవన్నీ దొంగల ఫేవరేట్ స్పేర్ పార్ట్స్.. కారులో వీటిని చిటికెలో మాయం చేసేస్తారు..!

మ్యూజిక్ / ఆడియో సిస్టమ్

కార్లలో ఖరీదైన వస్తువులలో దాని మ్యూజిక్ సిస్టమ్ కూడా ఒకటి. ఒకవేళ మీ కారులో కంపెనీ ఫిట్ చేసిన ఆడియో సిస్టమ్ ఉంటే, దానిని తిరిగి రీప్లేస్ చేసుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది. ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న ఆధునిక కార్లలో చాలా వరకూ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. దీని ఖరీదు 10 వేల నుంచి 50 వేల రూపాయల వరకూ ఉంటోంది. డ్యాష్‌బోర్డులో ఇవి క్లిప్‌లు మరియు కొన్ని స్క్రూలతో అమర్చబడి ఉంటాయి. కాబట్టి, దొంగలు వీటిని సులువుగా అపహరిస్తారు.

ఇవన్నీ దొంగల ఫేవరేట్ స్పేర్ పార్ట్స్.. కారులో వీటిని చిటికెలో మాయం చేసేస్తారు..!

కారు ఇంజన్

దొంగలు కారుని దొంగిలిస్తే, దాని రిజిస్ట్రేషన్ నెంబర్, చాస్సిస్ నెంబర్ మరియు ఇంజన్ నెంబర్ ఆధారంగా సదరు కారును సులువుగా గుర్తించవచ్చు. అందుకే, దొంగలు కేవలం ఇంజన్‌ను మాత్రమే అపహరించేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రత్యేకించి పాత వాహనాల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుంటుంది. ఇలా అపహరించిన ఇంజన్‌ను విడిభాగాలు మార్కెట్లో విక్రయించేస్తారు.

More from DriveSpark

Article Published On: Saturday, July 30, 2022, 8:00 [IST]
English summary
Most stolen car parts by thieves without big risk
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+