చలాన్ నుంచి తప్పించుకునేందుకు.. కొడుకుని కాళ్ల మధ్యలో కూర్చోబెట్టుకున్న మహిళ.. వీడియో వైరల్
ప్రజలు కొన్నిసార్లు అనుకోకుండా చేసినా లేదా కావాలని చేసిన కొన్ని పనులు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. కేరళ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై పలువురు ఫన్నీ వీడియోలు చేసి షేర్ చేస్తుండగా.. పలువురు నిజంగానే చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఒకటి వైరల్ అవుతోంది.
కేరళ ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణలను నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసింది.
సేఫ్ కేరళ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద 726 AI Camera అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే కెమెరాలను ఏర్పాటుచేసింది. ఈ వ్యవస్థ ఏప్రిల్ 20 నుంచి అందుబాటులోకి వచ్చింది. మే 20 నుంచి ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి నేరుగా ఆన్‌లైన్‌లోనే చలానాలు వేయనుంది.

ముగ్గురు ఒకే బైక్‌పై కూర్చోని ప్రయాణించిన (త్రిపుల్ రైడింగ్) వారికి కూడా జరిమానా విధించనుంది. అంటే బైక్‌పై చిన్నారులతో తల్లి, తండ్రి వెళ్లినా వారికి సైతం జరిమానా విధించనుంది. దీనిపై పలువురు ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏఐ కెమెరాకు చిక్కకుండా ఉండేందుకు తన ఇద్దరు పిల్లలతో స్కూటీపై వెళ్తున్న ఓ తల్లి చేసిన పని ప్రస్తుతం వైరల్ అవుతోంది. హోండా యాక్టీవా స్కూటర్‌పై వెళ్తున్న ఓ తల్లి.. ఒకరిని స్కూటీ వెనుక సీట్‌లో కూర్చొనిపెట్టి మరొక బాలుడిని స్కూటీ పుట్‌బోర్డు మీద, కాళ్ల మధ్య కూర్చొనిపెట్టిన వీడియోను ప్రముఖ ఛానల్ మనోరమ తన యూట్యూబ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ ద్విచక్రవాహనంపై ఇద్దరికి మించి (వారు చిన్నారులతో వెళ్తున్న తల్లిదండ్రులైనా గానీ) వెళ్తున్నవారికి జరిమానాలు విధించనుందన్న వార్త వచ్చినప్పటి నుంచి పలు ఫన్నీ వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. పలువురు ప్రజలు సైతం ఇలాంటి ఫన్నీ వీడియోలు క్రియేట్ చేసి మరీ తమ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఓ చిన్నారిని జూట్ బ్యాగ్‌లో పెట్టి స్కూటర్ ముందు భాగంలో ఉంచి ప్రయాణిస్తున్న వీడియోలు కూడా ఇటీవలే వైరల్ అయ్యాయి. ఇలా చేస్తే ఏఐ కెమెరాలకు చిక్కకుండా ఉండొచ్చనేది ప్రజల ఆలోచనగా తెలుస్తోంది.
చాలా మంది ప్రజలు ఇలాంటి వీడియోలను చూసి అలానే ప్రయత్నాలు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలో ఆ తల్లి చెప్పినట్లుగా... స్కూటీ ముందుభాగంలో ఇబ్బంది పడుతూ కూర్చొని ఉన్నాడు. అయితే ఈ ఘటన కేరళలోని త్రివేండ్రంలో జరిగినట్లు తెలుస్తోంది.
స్కూటీ ముందుభాగంలో రెండు కాళ్ల మధ్య తన కుమారుడిని ఉంచితే కెమెరాల కంటపడకుండా తప్పించుకోవచ్చన్నది ఆ తల్లి ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఇలాంటి ఘటనలు చూసి కాస్త నవ్వొచ్చినా.. కొన్నిసార్లు ప్రమాదాలకు కారణం కావచ్చు. డ్రైవింగ్ సీట్ల ఉన్న తల్లి, ఆమె వెనుకే కూర్చొని కుమార్తె హెల్మెట్లు ధరించారు. అయితే తల్లిచెప్పినట్లుగా స్కూటీ పుట్‌బోర్డు మీద కూర్చొన్న మరో బాలుడు ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నాడు.
అయితే ద్విచక్రవాహనాలపై చిన్నారులతో వెళ్తున్న తల్లిదండ్రులకు జరిమానాలు విధించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం కుటుంబ సభ్యులు, చిన్నారులతో వెళ్తున్న వారికి జరిమానా విధించకుండా ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజలందరు కూడా కార్లు కొనుగోలు చేసి ప్రయాణించలేరని, మధ్యతరగతి వారు చిన్న చిన్న ప్రయాణాలకు బైక్, స్కూటీలనే వినియోగిస్తారని, ప్రభుత్వం దీన్ని గమనించాలని కోరుతున్నారు.
అయితే ప్రజలు సైతం ఏఐ కెమెరాల నుంచి తప్పించుకొనేందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ఉండాలి. పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే, స్కూటీ ముందు భాగంలో కూర్చొన్న బాలుడు తీవ్ర గాయాలయ్యే అవకాశం ఉంటుంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications








