తల్లి కోరికను తీర్చిన తనయుడు.. వైరల్ అవుతున్న వీడియో: మీరూ చూడండి

సాధారణంగా పిల్లల కోరికలను తల్లిదండ్రులు నెరవేర్చి వారి ఆనందాన్ని చూస్తూ మురిసిపోతారు. అయితే తల్లిదండ్రుల కోరికలను తీర్చి ఆ ఆనందాన్ని పిల్లలు చూస్తే, ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recommended Video

మహీంద్రా ఎక్స్‌యూవీ700 రివ్యూ

ఈ వీడియో ఏంటి, దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. రండి.

తల్లి కోరికను తీర్చిన తనయుడు.. వైరల్ అవుతున్న వీడియో: మీరూ చూడండి

నివేదికల ప్రకారం, ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే విషయం స్పష్టంగా తెలియదు. కానీ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఒక కొడుకు తన తల్లి కోరికను తీర్చి ఆమె ఆనందానికి అవధులు లేకుండా చేసాడు.

తల్లి కోరికను తీర్చిన తనయుడు.. వైరల్ అవుతున్న వీడియో: మీరూ చూడండి

నిజానికి తన తల్లికి కారు నడపాలని ఎప్పటినుంచే కోరిక ఉంది. అయితే అది నిజం చేయడానికి కొడుకు ఎంతగానో శ్రమించి ఆధునిక కారుని కొనుగోలు చేసాడు. ఈ కారులో ఆ తల్లి కూర్చుని ఎంతో ఆనందంగా డ్రైవ్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సాయికిరణ్ కోరే అనే ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేయబడింది. ఇందులో 'నా తల్లి నా XUV700 డ్రైవ్ చేస్తోంది. అంటూ క్యాప్సన్ పెట్టాడు.

సోషల్ మీడియాలో వెల్లడైన ఈ వీడియోకు ఇప్పటివరకు 18 లక్షలకు పైగా లైక్లు, మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఇందులో కనిపించే కారు మహీంద్రా కంపెనీ యొక్క లేటెస్ట్ XUV700 అని తెలుస్తోంది. ఈ వీడియోలో ఆ తల్లి ఎంతో ఆనందంగా డ్రైవ్ చేయడం కూడా చూడవచ్చు. నిజంగానే ఈ వీడియో మనసుకు హత్తుకునేలా ఉంది.

తల్లి కోరికను తీర్చిన తనయుడు.. వైరల్ అవుతున్న వీడియో: మీరూ చూడండి

మహీంద్రా కంపెనీ యొక్క XUV700 అనేది ఆధునిక ఫీచర్స్ మరియు ఆధునిక టెక్నాలజీ కలిగిన కారు. కావున ఈ SUV కి మార్కెట్లో ఎంతో ఆదరణ ఉంది. మహీంద్రా XUV700 అనేది మొత్తం నాలుగు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి MX, AX3, AX5 మరియు AX7. అయితే ఆ తల్లికోసం కొడుకు కొనుగోలు చేసిన వేరియంట్ ఏది అనేది కూడా ఖచ్చితంగా తెలియదు.

తల్లి కోరికను తీర్చిన తనయుడు.. వైరల్ అవుతున్న వీడియో: మీరూ చూడండి

మహీంద్రా XUV700 విషయానికి వస్తే, ఇది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌ అనే రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది.

ఇందులోని 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇందులో జిప్, జాప్, జూమ్ మరియు కస్టమ్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది.

తల్లి కోరికను తీర్చిన తనయుడు.. వైరల్ అవుతున్న వీడియో: మీరూ చూడండి

మహీంద్రా ఎక్స్‌యూవీ700 అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. దీని ముందుభాగంలో కొత్త డ్యూయల్ టోన్ బ్లాక్ మరియు క్రోమ్ ఫినిష్‌ కలిగిన వర్టికల్ స్లాట్‌లతో సరికొత్త గ్రిల్ కలిగి ఉంది. ఈ బ్రాండ్ ప్రత్యేకంగా రిజర్వ్ చేయబడిన కొత్త లోగోను కూడా ఈ గ్రిల్ లో చూడవచ్చు. ఫ్రంట్ బంపర్ యొక్క దిగువ భాగంలో ఫాగ్ ల్యాంప్స్ మరియు రేడియేటర్ గ్రిల్ ఉన్నాయి. అంతే కాకుండా వీటికి దిగువన సిల్వర్ ఫినిష్డ్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ఉంది. ఫ్రంట్ ఫాసియాలో సి-షేప్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో విలీనం చేయబడిన కొత్త ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్ యూనిట్‌లు ఉన్నాయి.

తల్లి కోరికను తీర్చిన తనయుడు.. వైరల్ అవుతున్న వీడియో: మీరూ చూడండి

సైడ్ ప్రొఫైల్ లో కొత్త డ్యూయల్-టోన్ మల్టీ-స్పోక్ 18 ఇంచెస్ అల్లాయ్ వీల్ ఉంటుంది. వెనుక భాగంలో పెద్ద టెయిల్ లైట్లు, ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, రిఫ్లెక్టర్లు కనిపిస్తాయి. ఇది కాకుండా, రూప్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఫ్లష్ స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ బయటివైపే ఉంటాయి. ఇవన్నీ కూడా XUV700 ని చాలా ఆధునికంగా చూపించడంలో సహాయపడతాయి.

తల్లి కోరికను తీర్చిన తనయుడు.. వైరల్ అవుతున్న వీడియో: మీరూ చూడండి

ఇక ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 'స్కైరూఫ్' అని పిలువబడే పెద్ద సన్‌రూఫ్ ఇవ్వబడింది. ఈ ఎస్‌యూవీలోని డ్యాష్‌బోర్డ్‌లో ఒకే స్లాబ్ గ్లాస్‌తో వస్తుంది, ఇది 10.25 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేలను అనుసంధానిస్తుంది. ఇందులో సౌండ్ కోసం సోనీ సౌండ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయబడింది.

తల్లి కోరికను తీర్చిన తనయుడు.. వైరల్ అవుతున్న వీడియో: మీరూ చూడండి

కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 లో ఆండ్రాయిడ్ ఆటో & యాపిల్ కార్ప్లే, అమెజాన్ అలెక్సా ఎనేబుల్, 60 కి పైగా కనెక్ట్ ఫీచర్లు, ఇ-సిమ్ బేస్డ్ కనెక్ట్ టెక్నాలజీ, వాయిస్ అసిస్టెంట్, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 2 వ మరియు 3 వ వరుస ఎసి వెంట్‌లు, మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

తల్లి కోరికను తీర్చిన తనయుడు.. వైరల్ అవుతున్న వీడియో: మీరూ చూడండి

చివరిగా సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7-ఎయిర్‌బ్యాగులు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో హెడ్‌ల్యాంప్ బూస్టర్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, లేన్-కీప్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి అందుబాటులో ఉన్నాయి.

తల్లి కోరికను తీర్చిన తనయుడు.. వైరల్ అవుతున్న వీడియో: మీరూ చూడండి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

తల్లిదండ్రుల కోరికలను పిల్లలు తీర్చడం చాలా అరుదు. అయితే గతంలో కూడా ఇలాంటి సంఘటనల గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మరొక ఇలాంటి సంఘటన వెలువడింది. నిజంగానే ఇలాంటి సంఘటనల గురించి తెలుసుకున్నప్పుడు మనసు తప్పకుండా పులకిస్తుంది. అయితే వీలైంతవరకు మనం కూడా తల్లిదండ్రుల కోరికలను తీర్చడానికి ప్రయత్నించాలి.

Most Read Articles

English summary
Mothers desire to drive a car a young man shared his joy by making his dream come true details
Story first published: Wednesday, September 21, 2022, 13:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X