హైదరాబాద్‌లో ఘనంగా మోటోజీపీ భారత్‌ కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. 400 మంది రైడర్లతో సందడిగా మారిన భాగ్యనగరం

భారత్‌లో మొట్టమొదటిసారిగా నిర్వహించనున్న మోటోజీపీ(MotoGP Bharat) భారత్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోటోజీపీ భారత్‌పై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో యువ, ఔత్సాహిక రైడర్లతో రేస్‌ ఈవెంట్‌ నిర్వహించారు. హైదరాబాద్‌లో మొదటగా టూర్‌ రేస్‌ ఈవెంట్‌తో కౌంట్‌ డౌన్ ప్రారంభించారు.

మోటోజీపీ భారత్‌ కౌంట్‌డౌన్‌ హైదరాబాద్‌ కేంద్రంగా ఆధివారం ఘనంగా ప్రారంభమైంది. హైటెక్‌ సిటీ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని ధృవ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజీ నుంచి ఈ రేసు ప్రారంభమైంది. మోటోజీపీపై అవగాహన, ఔత్సాహిక రైడర్లను ఏకతాటికిపైకి తీసుకురావటమే లక్ష్యంగా సాగిన హైదరాబాద్‌ రేసులో సుమారు 400 మంది రైడర్లు పోటీపడ్డారు. ఈ టూర్‌ రేసుకు విశేష స్పందన లభించింది.

MotoGP-Bharat

ఈ సందర్భంగా రేసు ట్రాక్‌ ప్రాంతంలో మెగా డీజే షోలు, బైక్‌ స్టంట్లు, ఫుడ్‌ స్టాల్స్‌, సెల్ఫీ బూత్‌లు, 360 వీఆర్‌, గేమింగ్‌ బూత్‌లు అభిమానులను ఆకట్టుకున్నాయి. యువ, ఔత్సాహిక రైడర్లను ప్రోత్సహిస్తూ ఈ ఈవెంట్, ఇతర ఈవెంట్ల మాదిరిగానే "రోడ్లు రైడింగ్ కోసం" మరియు "ట్రాక్‌లు రేసింగ్ కోసం" అనే నినాదాన్ని ప్రచారం చేశాయి.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ టూర్‌ రేసుపై ఫెయిర్‌ స్ట్రీట్‌ స్పోర్ట్స్‌ ఎండీ సుశాంత్‌ మాట్లాడారు. హైదరాబాద్‌ రేసులో మహిళా రైడర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. రేసింగ్‌ కమ్యూనిటీలో మహిళల సంఖ్య విశేషంగా పెరిగిందనడానికి ఇదొక సంకేతమని తెలిపారు. హైదరాబాద్‌ టూర్‌ రేసు విజయవంతమైన ఉత్సాహంలో తదుపరి రేసును ఈ నెల 23న అహ్మదాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

MotoGP-Bharat

మోటోజీపీ భారత్‌ ఈవెంట్‌లో భాగంగా నిర్వహించిన హైదరాబాద్‌ సిటీ టూర్‌ కొత్త జోష్‌నిచ్చిందని సుశాంత్‌ హర్షం వ్యక్తం చేశారు. నగర వీధుల గుండా రైడ్ చేస్తూ రైడర్లు గొప్ప థ్రిల్‌ను ఆస్వాదించినట్లు చెప్పారు. ఈ ఈవెంట్ ఒక ఉత్తేజకరమైన అధ్యాయానికి నాంది పలకడంతో పాటు దేశంలోని ఇతర నగరాలకు విస్తరింపజేసేందుకు దోహదపడుతుందని సుశాంత్‌ అన్నారు.

సెప్టెంబర్‌ 22 నుంచి 24 వరకు గ్రేటర్‌ నోయిడాలోని బుద్ధ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌లో మోటోజీపీ భారత్‌ జరగనుంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈవెంట్ ప్రారంభం కావడానికి దాదాపు 2 నెలల సమయం ఉండటంతో ఏ పొరపాట్లు జరగకుండా అన్నీ సవ్యంగా ఉండేలా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

MotoGP-Bharat

భారత్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్.. అభిమానులకే కాకుండా దేశంలోని మోటార్ స్పోర్ట్స్ పరిశ్రమకు కూడా చాలా కీలకం కానుంది. దీంతో ఈ పోటీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హోండా, అప్రిలియా, కేటిఎమ్, యమహా మరియు డుకాటి వంటి కంపెనీలు ఈ పోటీలో పాల్గొంటున్నాయి. యూరప్‌లో కాకుండా విదేశాల్లో ఈ ఫార్మాట్‌లో టోర్నీ జరగడం ఇదే తొలిసారి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

MotoGP-Bharat

More from DriveSpark

Article Published On: Monday, July 17, 2023, 16:09 [IST]
English summary
Moto gp bharat conducts city tour with 400 bikers in hyderabad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+