MotoGP Bharat మోటోజీపీ భారత్‌ రేసింగ్‌కు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. ఈవెంట్‌లో వీటికి నో ఎంట్రీ.!!

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బైక్‌ రేసుల్లో MotoGP ఒకటి. మొట్టమొదటిసారిగా ఈ గ్రాండ్‌ రేసింగ్‌ ఈవెంట్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వబోతోంది. సెప్టెంబర్‌ 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిగే MotoGP Bharat అద్భుత క్షణాలకి భారత్‌ సాక్ష్యంగా ఉండబోతోంది. ఇప్పటికే ఈవెంట్‌ సన్నాహాలు పూర్తి కాగా, రేసింగ్‌ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో గ్రేటర్‌ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఈ రేసు గ్రాండ్‌గా జరగబోతోంది. గతంలో ఫార్ములా 1 రేస్ 2011 మరియు 2013 మధ్య ఇక్కడే నిర్వహించారు. ఈ ఏడాది MotoGP Bharat బైక్‌ రేస్‌ జరుగుతున్నందున దానికి అనుగుణంగా నిర్వాహకులు ట్రాక్‌ను సిద్ధం చేశారు. రైడర్‌ల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ.. పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

MotoGP-Bharat-Race

మోటోజీపీ చరిత్రలో భారత్‌లో ఈ బైక్‌ రేస్ జరగడం ఇదే తొలిసారి. దీంతో MotoGP Bharat Grand Prix పేరిట జరగనున్న ఈ ఈవెంట్ కు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో ప్రపంచంలోని ప్రముఖ బైక్ రేసర్లు పాల్గొనబోతున్నారు. దేశంలో బైక్ ఔత్సాహికులకు మించి, సాధారణ ప్రజలు కూడా రేసింగ్‌ పోటీని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.

గతంలో Buddh International Circuit లో ఫార్ములా 1 రేస్ జరిగినప్పుడు, ఇక్కడి ట్రాక్ 16 టర్నింగ్‌లను కలిగి ఉంది. కాగా MotoGP బైక్‌ రేస్ కావడంతో.. ట్రాక్‌ను కొద్దిగా సవరించి చివరికి 13 మలుపులను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ రేసర్లు కళ్లు చెదిరే వేగం అంటే గంటకు 370 కిలోమీటర్ల వేగంతో బైక్‌ను నడపగలరు.

Buddh-International-Circuit

అయితే 3 కేటగిరీల్లో ఈ రేసు నిర్వహిస్తారు. MotoGP Bharat 2023 రేసులో 11 జట్ల నుంచి 22 మంది రైడర్లు మోటోజీపీ టైటిల్ కోసం పోటీపడతారు. మోటో 2, మోటో 3 రేసులు కూడా నిర్వహించనున్నారు. మొత్తంగా 40 కంటే ఎక్కువ జట్ల నుంచి 80 మంది రైడర్లు పాల్గొంటారని ఆర్గనైజర్స్‌ తెలిపారు. డుకాటి, కేటిఎం, ఎప్రిలియా, యమహా వంటి ప్రధాన ఈవెంట్ టీమ్‌లు ఈ ఈవెంట్‌లో పాల్గొననున్నాయి.

మోటోజీపీ భారత్‌ రేసింగ్‌ కోసం ఔత్సాహికులు ఎంతగా ఎదురుచూస్తున్నారనేదానికి ఓ ఉదాహరణ ఏంటంటే.. నిర్వాహకులు MotoGP Race టిక్కెట్లు అమ్మడం ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే అన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయి. టిక్కెట్ ధరలు రూ.800 నుంచి రూ.40,000 వరకు ఉన్నాయి. అయితే టికెట్‌ దొరకని వారు మోటో జీపీ రేస్‌ను Jio సినిమా, Sports18లో వీక్షించే అవకాశం ఉంది.

Buddh-International-Circuit

MotoGP Bharat Racing పై యూత్‌ ఎంత ఆసక్తిగా ఉన్నారో దీన్ని బట్టే అర్థమవుతోంది. గ్రేటర్‌ నోయిడాలోని బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా రేస్‌కు కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. కాగా గత జూలైలో మోటోజీపీ రేస్ నిర్వాహకులు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(Sports Minister Anurag Thakur) కు హెల్మెట్‌ గిఫ్ట్‌గా ఇచ్చి ఈవెంట్‌కు ఆహ్వానించారు.

అయితే మోటోజీపీ భారత్‌ రేస్‌(Ban Items In MotoGP Race)ను వీక్షించేందుకు వచ్చే ఆడియన్స్‌కు నిర్వాహకులు కొన్ని కండిషన్స్‌ విధించారు. పవర్‌ బ్యాంక్స్‌, ల్యాప్‌టాప్స్‌, బైనాక్యులర్స్‌, ప్రొఫెషనల్ కెమెరా ఇలా కొన్ని ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ తీసుకురావడాన్ని అధికారులు నిషేధించారు.

MotoGP-Bharat-Race

ఇంకా బ్యాగులు, రేడియోలు, కుర్చీలు, టేబుల్స్‌, పెద్ద హ్యాండ్‌బ్యాగ్స్‌, గొడుగులు, బెలూన్స్‌, నాణేలు, సీసాలు, పేలుడు పదార్థాలు, లైటర్స్‌/అగ్గిపుల్లలు, గాజు సామాను, పరిమళ ద్రవ్యాలు, డ్రోన్‌లు, మద్యం, డబ్బాలు, మత్తు పదార్థాలను గ్రౌండ్‌కి అనుమతించరు. పెంపుడు జంతువులు, లేజర్ లైట్లు, పెన్/పెన్సిల్, స్కేట్‌బోర్డ్‌లు, ప్లేట్లు మొదలైనవి దొరికితే టోర్నమెంట్ అధికారులు జప్తు చేస్తారు.

ముఖ్యంగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు, పదునైన వస్తువులు, సూదులు మరియు స్ప్రేలకు ఖచ్చితంగా నిషేధం ఉంది. అయితే వేటికి అనుమతి ఉంది అనేది కూడా నిర్వాహకులు తెలిపారు. టోపీ, ఇయర్ ప్లగ్స్, సన్‌స్క్రీన్, మ్యాట్/పిక్నిక్ క్లాత్, సన్ గ్లాసెస్, బేబీ ఫుడ్ అండ్ పిల్, మెడిసిన్స్‌ ఇలా కొన్నిటికి అనుమతి ఉంది. అయితే హోం ఫుడ్‌కు ఎంట్రీ లేదు. కావాలంటో రేస్‌కోర్సు ఆవరణలో విక్రయించే ఆహారాన్ని తీసుకెళ్లవచ్చని చెప్పారు.

Buddh-International-Circuit

ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన బైక్ రేస్‌(Bike Race MotoGP)ను భారత్‌లో నిర్వహిస్తుండటంతో.. ప్రభుత్వం, నిర్వాహకులు భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా, కొన్ని వస్తువులకు అనుమతి నిషేధించారు. ఏదేమైనా ఎలాంటి డిస్టర్బెన్స్‌ లేకుండా రేసింగ్‌ను అనుభూతిని చెందుతూ వీక్షించడంలో మంచి థ్రిల్‌ ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 20, 2023, 20:04 [IST]
English summary
Motogp bharat 2023 in noida from september 22nd to 24th countdown starts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+