రేసింగ్‌ బైక్‌ నడిపిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.. మోటో జీపీ భారత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

బైక్‌ రేసింగ్‌ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్‌ మోటో జీపీ రేసింగ్‌ ఇండియాలో అత్యంత గ్రాండ్‌గా సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. భారత్‌లో మొట్టమొదటిసారి ఈ ఈవెంట్‌ జరగనుంది. కాగా ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ఈ ఈవెంట్‌కి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

తొలిసారి భారత్‌లో సెప్టెంబర్‌ 22 నుంచి 24 వరకు రెండు రోజులపాటు రేస్‌ జరగనుంది. గ్రేటర్‌ నోయిడాలోని బుద్ధ్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌లో ఈ రేసులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాకాలం ప్రారంభం కావడంతో దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Anurag-Thakur-on-MotoGP-Bharat

అయితే భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఈ ఈవెంట్‌కి గౌరవ అతిథిగా ఆహ్వానించడానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ నివాసానికి మోటో జీపీ(MotoGP) బృందం చేరుకోవడంతో ఈ ఈవెంట్‌పై ఇంకా ఆసక్తి పెరిగింది. రేసింగ్‌ ప్రియులు ఈ ఈవెంట్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భారత్‌ మోటో జీపీ రేసింగ్‌ కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ మాట్లాడుతూ 'నా చేతిలోని హెల్మెట్‌ చాలా చెబుతోంది. మోటో జీపీ భారత్‌లో మొట్టమొదటిసారి జరుగుతోంది. ఇది దేశంలోనే అతిపెద్ద మోటారు స్పోర్ట్స్‌ ఈవెంట్‌లలో ఒకటి. తొలిసారిగా ఒక భారతీయ రేసర్‌ కూడా ఇందులో పాల్గొనడం ఆసక్తి రేపుతోంది. ఈ ఈవెంట్‌ ఆటోమొబైల్‌ పరిశ్రమకు ఇది జోష్‌ తీసుకువస్తుంది.

రేసింగ్‌ కమ్యూనిటీకి ఇది ఆరంభం మాత్రమే. రేసింగ్‌ను కొనసాగించాలనుకునే అనేకమంది రేసర్లు మరియు యువ బైక్‌ ఔత్సాహికులు దేశంలో ఈ రేసింగ్‌ ఈవెంట్‌ను వీక్షించడం ద్వారా దీని గురించి చాలా విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఇతర క్రీడల మాదిరిగానే భవిష్యత్తులో రేసింగ్‌ కూడా ఓ పెద్ద స్పోర్ట్‌ ఈవెంట్‌గా మారి మైలురాయిని చేరుతుందని, రేసింగ్‌లో భారత్‌ దూసుకుపోతుందని ఆశిస్తున్నాను.' అని అన్నారు.

భారీ వర్షం కురుస్తున్నప్పటికీ మోటో జీపీ భారత్‌ ఈవెంట్‌ కోసం మంత్రిని గౌరవ అతిథిగా ఆహ్వానించడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు ఫెయిర్‌స్ట్రీట్‌ స్పోర్ట్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ పుష్కర్‌నాథ్‌ శ్రీ వాస్తవ. మోటో జీపీ భారత్‌ ఈవెంట్‌తో మరపురాని రేసింగ్‌ అనుభవాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ కేంద్ర మంత్రి అనురాగ్‌ బైకర్లతో కలిసి రైడ్‌ చేయడం మోటో జీపీ ఫీవర్‌ను తెలియజేస్తుందన్నారు.

కాగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భారీ వర్షంలోనూ ఢిల్లీలో బైక్‌ రైడర్స్ తో కలిసి బైక్ నడిపారు. ఈ ఈవెంట్‌ని ప్రమోట్ చేయడంలో భాగంగా ఇలా సందడి చేశారు అనురాగ్ ఠాకూర్. మోటోజీపీ రేస్‌ని నిర్వహిస్తున్న 31వ దేశంగా భారత్‌ రికార్డు సృష్టించనుంది.

అనంతరం హెల్మెట్‌పై సంతకం చేసి బైక్‌ రైడర్లకు ధన్యవాదాలు తెలిపారు అనురాగ్‌ ఠాకూర్‌. మోటో జీపీ భారత్‌ ఫెయిర్‌స్ట్రీట్‌ స్పోర్ట్స్‌, డోర్నా స్పోర్ట్స్‌ సహకారంతో సెప్టెంబర్‌ 22 నుంచి 24 వరకు గ్రేటర్‌ నోయిడాలోని బుద్ధ్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌లో నిర్వహించనుంది. చారిత్రాత్మక మోటో జీపీ భారత్‌లో కొనసాగుతున్న మోటో జీపీ 2023 సీజన్‌లో 13 వ రేసు.

More from DriveSpark

Article Published On: Monday, July 10, 2023, 12:15 [IST]
English summary
Motogp bharat committe invited union sports minister anurag thakur as guest of honour
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+