MotoGP భారత్ రేసింగ్.. బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో భారీ ఏర్పాట్లు..!
భారత్‌లో తొలిసారిగా జరగనున్న MotoGP భారత్ రేస్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో మూడు సార్లు F1 రేస్‌లను నిర్వహించిన బుద్ద్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ MotoGP అవసరాలకు తగ్గినట్లుగా మార్పులు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు.
గతంలో అంతర్జాతీయ స్థాయి F1 రేస్‌లను నిర్వహించిన అనుభవం ఉన్న కారణంగా ఈ ట్రాక్‌ను MotoGP రేస్ నిర్వహణకు అనువుగా ఉంటుందని నిర్ణయించారు. అయినా కానీ ట్రాక్‌లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నారు. ముందు నుంచి ఉన్న కంచెలను అవసరానికి తగ్గట్లుగా మారుస్తున్నారు. అవసరం అయిన చోట కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారు.

ట్రాక్‌లో కొన్ని ప్రాంతాల్లో సుమారు కిలోమీటర్ పొడవు వరకు రీసర్పేసింగ్ చేశారు. MotoGP రేసింగ్ అవసరాలకు తగ్గట్లుగా, రైడర్‌లకు మెరుగైన రేసింగ్ అనుభవాన్ని అందించే విధంగా మార్పులు చేపట్టారు. మోటోజీపీ భారత్ రేసింగ్ సహా అన్ని మోటార్‌స్పోర్ట్ రేస్‌లలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. రేసింగ్ చూసేందుకు వచ్చిన వారి భద్రత కోసం కొత్తగా బారియర్స్‌ను ఏర్పాటుచేయాలని ఆధికారులు ఆదేశించారు.
బుద్ద్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ప్రస్తుతం ఉన్న బారియర్స్ కంటే కొత్తగా ఏర్పాటు చేయనున్నవి మరింత భద్రతను కల్పిస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బుద్ద్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ ప్రారంభం సమయంలో ఏర్పాటుచేసినవి. భద్రత కోసం కొత్తగా బారియర్స్ ఏర్పాటు చేయడం అవసరం అని అధికారులు భావిస్తున్నారు.

హోమోలోగేషన్ అనేది FIM వంటి సంస్థలు నిర్దేశించిన కొన్ని భద్రతా, నాణ్యత పరిమితులు. బుద్ద్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ FIM అనుమతులు పొందాలంటే వారి నిర్దేశించిన విధంగా అన్ని ఏర్పాట్లు ఉండాలి. తమ ప్రమాణాలకు అనుగుణంగా ట్రాక్ ఉందా లేదా అని తనిఖీ చేసేందుకు FIM ప్రతినిధులు బుద్ద్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌ను అనేక సార్లు సందర్శించారు.
ఒక పక్క ట్రాక్‌ను సిద్ధం చేయడం సహా మోటోజీపీ, మోటో2, మోటో3 రేసింగ్ కోసం బృందాలు, వారికి అవసరమైన అనేక పరికరాలను రవాణా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డోర్నా స్పోర్ట్స్ లాజిస్టిక్ బాధ్యతలను చూస్తోంది. ఈ రేసింగ్‌లో పాల్గొనే వారు తమ అవసరాలను ముందుగానే సంబంధిత అధికారులకు తెలియజేశారు.

ఇటలీ నుంచి భారత్‌కు మోటార్ సైకిళ్లు సహా అవసరమైన అన్ని పరికరాలను రవాణా చేసేందుకు నాలుగు పెద్ద 747 జంబో ఎయిర్‌క్రాఫ్ట్‌లను సిద్ధంగా ఉంచారు. ఈ విమానాలు రేసింగ్ టీంలు ఉపయోగించే ప్రత్యేక పరికరాలు, అత్యంత ఖరీదైన మోటార్‌సైకిళ్లు సహా మొత్తంగా 400 టన్నుల బరువులను తీసుకు వస్తాయి.
ఈ నెల ప్రారంభంలో ప్రత్యేక బారియర్స్, ఇతర బ్రాడ్‌కాస్ట్ పరికరాలు, టైర్లు, ఇంధనం సహా ఇతర అవసరమైన వస్తువులను తీసుకొచ్చేందుకు సుమారు 20 కంటైనర్లు సముద్రమార్గం ద్వారా ఇప్పటికే పంపించారు. రేసింగ్ సిబ్బంది సహా అక్కడికి వచ్చే ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








