MotoGP మోటోజీపీ భారత్‌ నిర్వహణపై అధికారుల సమావేశం.. భద్రత, ట్రాఫిక్‌ అంశాలపై చర్చ

భారత్‌లో తొలిసారిగా నిర్వహించనున్న మోటోజీపీ(MotoGP) రేసు కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు అత్యంత ఉన్నత స్థాయి భద్రతను కల్పించేందుకు యత్నిస్తున్నారు. సోమవారం గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం, MotoGP అధికారులు మరియు జేపీ గ్రూప్ మధ్య సమావేశం జరిగింది. అందులో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.

MotoGP రేసులు భారత్‌లో సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు జరుగుతాయి. మొట్టమొదటి సారిగా భారత్‌లో MotoGP రేస్ ఉత్తరప్రదేశ్‌ నోయిడాలోని బుద్ధ్‌ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరగనుంది. దీనికి సంబంధించిన టిక్కెట్ల బుకింగ్ గత వారం ప్రారంభం కాగా, కొద్ది రోజుల్లోనే అన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయి.

MotoGP-Bharat

ఈ నేపథ్యంలో సోమవారం(జూలై 10న) మోటోజీపీ రేసింగ్ టీమ్‌లకు, ప్రేక్షకులకు ఎలాంటి భద్రత కల్పించాలనే అంశంపై త్రైపాక్షిక చర్చ జరిగింది. ఈ చర్చకు బుద్ధ్‌ ఇంటర్నేషనల్ రేస్‌వే ఉన్న గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు, మోటోజీపీ భారత్ టీమ్ అధికారులు, స్పాన్సర్‌లు, ప్రమోటర్లు హాజరయ్యారు.

ఈ సమావేశానికి గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. జేపీ గ్రూప్.. బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌ను నిర్వహిస్తుండటంతో వారి బృందం నుంచి అధికారులు హాజరయ్యారు. వారితో పాటు ఫెయిర్‌స్ట్రీట్ స్పోర్ట్స్ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. భద్రతా, ట్రాఫిక్‌ ఆంక్షలు తదితర అంశాలపై చర్చించారు.

MotoGP-Bharat

ఈవెంట్‌ను గ్రాండ్‌గా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించడానికి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఫెయిర్‌స్ట్రీట్ స్పోర్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పుష్కర్ నాథ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ' సమావేశం విజయవంతంగా జరిగింది. భారతదేశానికి మోటోజీపీ భారత్ ప్రాముఖ్యతను స్థానిక పోలీసులు అర్థం చేసుకున్నారు. అన్ని విధాలుగా తమ పూర్తి సహకారం అందిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.' అని అన్నారు.

MotoGP భారత్ కోసం భద్రతా ఏర్పాట్ల గురించి చర్చ జరిగినప్పుడు, రేస్ జరిగే రోజుల్లో ట్రాఫిక్ ఆంశక్షలు మరియు VIPలకు హెలిప్యాడ్ యాక్సెస్ అందుబాటులో ఉంటుందా లేదా అనే దానిపై చర్చ జరిగింది. అలాగే, వీఐపీ రాకపోకలను అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

సరైన నిర్వహణ ద్వారా మోటోజీపీ రేసింగ్‌తో ప్రేక్షకులకు సాధ్యమైనంత ఉత్తమమైన అనుభవాన్ని ఎలా అందించాలో అర్థం చేసుకోవడానికి సమావేశానికి హాజరైన అధికారులు ఈవెంట్‌ జరిగే ప్రాంతంలో ట్రాక్ చుట్టూ తిరిగారు. అలాగే, బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ పరిసరాల్లో ట్రాఫిక్‌ను ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికలు రూపొందించారు.

ఈవెంట్‌కు సంబంధించి భద్రత నుంచి ట్రాక్ తనిఖీల వరకు దాదాపు అన్ని సన్నాహాలతో జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది. దీని ద్వారా నిర్వాహకులు మరియు MotoGP అధికారులు ఈ ఈవెంట్‌కు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాయో అర్థమవుతోంది. ఈవెంట్ ప్రారంభం కావడానికి దాదాపు 2 నెలల సమయం ఉండటంతో ఏ పొరపాట్లు జరగకుండా అన్నీ సవ్యంగా ఉండేలా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 11, 2023, 12:19 [IST]
English summary
Motogp bharat team and police officials meeting for security measures and traffic plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+