వీడియో: మోటార్‌సైకిల్ జిమ్ఖానా వచ్చేసిందోచ్..
జిమ్ఖానా అనేది ఓ విభిన్నమైన కార్ డ్రిఫ్టింగ్. సాధారణంగా డ్రిఫ్ట్ జిమ్ఖానా లేదా వేరే ఏదైనా జిమ్ఖానా గురించి మాట్లాడుకుంటే, ముందుగా కెన్ బ్లాక్‌తో పలువురు ప్రముఖ కార్ డ్రిఫ్టర్లు గుర్తుకొస్తారు. ఇప్పటి వరకు కార్లకు మాత్రమే పరిమితమైన జిమ్ఖానా స్టైల్ డ్రిఫ్టింగ్ ఇప్పుడు మోటార్‌సైకిళ్లకు కూడా వర్తింపజేశారు. నిపుణులు మోటార్‌సైకిళ్లతో జిమ్ఖానా డ్రిఫ్టింగ్ చేస్తుంటే, చూడటానికి రెండు కళ్లు సరిపోవు.
ఇది కూడా చూడండి: కెన్ బ్లాక్ జిమ్ఖానా సిక్స్ 'అమేజింగ్ కార్ డ్రిఫ్ట్'
జిమ్ఖానా స్టైల్ డ్రిఫ్టింగ్‌లో ఓ స్పెషల్ ట్రాక్‌ను ఏర్పాటు చేసి, ఆ ట్రాక్‌పై పలు ఆటంకాలు (అబ్‌స్టాకల్స్) ఉంచుతారు. డ్రిఫ్టింగ్ చేసే డ్రైవర్లు ఈ ఆటంకాలను దాటుకుంటూ తమ మోటార్‌సైకిళ్ల అనేక రకాల విన్యాసాలు చేస్తుంటారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ జిమ్ఖానా స్టైల్ డ్రిఫ్టింగ్‌కు మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఈనాటి మన వీడియోలో జిమ్ఖానా స్టైల్ మోటార్‌సైకిల్ డ్రిఫ్టింగ్‌ను చూద్దాం రండి.
ఈ జిమ్ఖానా స్టైల్ డ్రిఫ్టింగ్ బాగా నైపుణ్యం కలిగిన రైడర్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్‌లపై మాత్రమే చేస్తారు. ఈ స్టంట్‌లు చేసేటప్పుడు వారు ముఖం నుంచి పాదాల వరకు పూర్తి రక్షణ ఉండేలా రైడ్ గేర్ (దుస్తులు, సేఫ్టీ యాక్ససరీలు) ధరిస్తారు. ఈ వీడియోని కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే పోస్ట్ చేయడమైనది, దీనిని చూసి ఏవరూ ఇలా ప్రయత్నించవద్దని మనవి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/PonKeBVyABI?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








