నేటి వీడియో: చక్కగా చేస్తే చప్పట్లు లేకపోతే ఇక్కట్లు

By Ravi

మోటార్‌సైకిల్ స్టంట్స్ గురించి వాహన ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మనలో చాలా మంది చిన్నతనం నుంచే సైకిల్ పైనో లేక బైక్ పైనో ఏదో మనకు వచ్చిన చిన్నపాటి స్టంట్‌లను చేసి ఆనందపడి ఉంటాం.

అయితే, బైక్ స్టంట్‌లనే వృత్తిగా మార్చుకునే కొందరు ప్రొఫెషనల్ స్టంట్ బైకర్స్ చేసే స్టంట్‌లు ఔరా అని ముక్కుపై వేలేసుకునేలా ఉంటాయి. ఇలాంటి స్టంట్‌లను సదరు స్టంట్ బైకర్లు చక్కగా చేస్తే వీక్షకులు చప్పట్లు కొడతారు. అలాకాకుండా, స్టంట్ బెడిసికొడితే వారు ఇక్కట్లు పడుతారు.

సాధారణంగా మోటార్‌సైకిళ్లపై స్టంట్‌లు చేసే వారు హెల్మెట్ నుంచి బూట్ల వరకు పూర్తిస్థాయి సేఫ్టీ గేర్‌ను ధరించి స్టంట్స్ చేస్తుంటారు. ఎంతో శ్రద్ధగా, ఏకాగ్రతగా చేస్తేనే స్టంట్‌లు సక్సెస్ అవుతాయి. అయితే, కొన్ని సందర్భాల్లో అదృష్టం బాగోలేనప్పుడు స్టంట్‌లు బెడిసి కొట్టి, ప్రమాదాలకు కారణం అవుతుంటాయి.

అలా స్టంట్ చేస్తూ విఫలమైన చప్పట్లకు బదులు ఇక్కట్లను కొని తెచ్చుకున్న కొందర్ని ఈ వీడియోలో వీక్షిద్దాం రండి. కానీ, మీరు మాత్రం ఇలాంటి స్టంట్‌లను ఇంటి దగ్గర ప్రయత్నించకండి. ఇవి చూడటానికి ఎంత సరదాగా ఉంటాయో, అంతే ప్రమాదకరంగా కూడా ఉంటాయి. వీడియో కోసం క్రింది ఫొటోపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Tuesday, January 28, 2014, 10:32 [IST]
English summary
Following is a video compilation of a few bike stunt failed attempts. While some are funny and minor others are more serious and end badly. Not all of these stunts are being performed by experts of course and we have some amateurs failing spectacularly. Take a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+