అమెరికాలో ప్రతి 11 నిమిషాలకు ఒక బైక్ చోరీ

అత్యంత భద్రతల మధ్య నడుమ ఉండే అగ్రరాజ్యమైన అమెరికాలోనూ దొంగల బెడద తప్పడం లేదు. తాజా నివేదికల ప్రకారం, అమెరికాలో ప్రతి 11 నిమిషాలకు ఒక బైక్ చోరీకి గురవుతున్నట్లు సమాచారం. అమెరికాలోని నేషనల్ ఇన్సూరెన్స్ క్రైమ్ బ్యూరో (ఎన్ఐసిబి) సమాచారం ప్రకారం, ప్రతి 11 నిమిషాలకు ఒక బైక్ చోరీకి గురవుతున్నట్లు తేలింది. ఇదే సమయంలో 201 సంవత్సరంతో పోల్చుకుంటే 2012 సంవత్సరంలో బైక్ చోరీల సంఖ్య 6 శాతం తగ్గినట్లు ఎన్ఐసిబి పేర్కొంది.

హోండా సూపర్ బైక్

అమెరికాలోని నేషనల్ ఇన్సూరెన్స్ క్రైమ్ బ్యూరో (ఎన్ఐసిబి) సమాచారం ప్రకారం, ప్రతి 11 నిమిషాలకు ఒక బైక్ చోరీకి గురవుతున్నట్లు తేలింది.

యమహా సూపర్ బైక్

ఎన్ఐసిబి గణాంకాల ప్రకారం, 2010లో సుమారు 49,791 బైక్‌లు చోరీకి గురి కాగా 2011లో 46,667 బైక్‌లు చోరీకి గురయ్యాయి.

కవాసకి సూపర్ బైక్

అమెరికాలో అత్యధికంగా చోరీకి గురయ్యే టాప్ 5 దొంగల ఫేవరేట్ బ్రాండ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.

1. హోండా

2. యమహా

3. సుజుకి

4. కవాసకి

5. హ్యార్లీ డేవిడ్‌సన్

సుజుకి సూపర్ బైక్

కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాల్లో బైక్ చోరీలు ఎక్కువగా నమోదయ్యాయి.

హ్యార్లీ డేవిడ్‌సన్ సూపర్ బైక్

జులై, ఆగస్ట్ నెలల్లో ఎక్కువ సంఖ్యలో బైక్ చోరీలు నమోదు కాగా, డిసెంబర్, ఫిబ్రవరి నెలల్లో మాత్రం అతి తక్కువ బైక్ చోరీలు నమోదయ్యాయి.


ఎన్ఐసిబి గణాంకాల ప్రకారం, 2010లో సుమారు 49,791 బైక్‌లు చోరీకి గురి కాగా 2011లో 46,667 బైక్‌లు చోరీకి గురయ్యాయి. బైక్‌‌లో చోరీలు స్వల్పంగా తగ్గుముఖం పడుతుండటంతో అక్కడి మార్కెట్లలో బైక్‌ల కొనుగోళ్లు కూడా జోరందుకున్నాయి. చోరీ చేయడంలో దొంగలకు బ్రాండ్ టేస్ట్ ఉంది. అమెరికాలో అత్యధికంగా చోరీకి గురయ్యే టాప్ 5 దొంగల ఫేవరేట్ బ్రాండ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.

1. హోండా
2. యమహా
3. సుజుకి
4. కవాసకి
5. హ్యార్లీ డేవిడ్‌సన్

ఈ టాప్-5 బ్రాండ్లలో మొదటి నాలుగు బ్రాండ్లు కూడా జపనీస్ బ్రాండ్లు కావటం గమనార్గం. ఏదేమైనప్పటికీ, సెకండ్ హ్యాండ్ మార్కెట్లలో ఈ బ్రాండ్లకు మంచి డిమాండ్ కూడా ఉంటుంది. గడచిన మూడు త్రైమాసికాలుగా చూసుకుంటే దొంగిలించబడిన బైక్‌లలో ఈ ఐదు బ్రాండ్లే అత్యధికంగా ఉన్నట్లు ఎన్ఐసిబి తెలిపింది. కాగా.. కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాల్లో బైక్ చోరీలు ఎక్కువగా నమోదయ్యాయి.

అంతేకాదండోయ్.. అక్కడ బైక్ చోరీలకు కూడా సీజన్ ఉంటుంది. జులై, ఆగస్ట్ నెలల్లో ఎక్కువ సంఖ్యలో బైక్ చోరీలు నమోదు కాగా, డిసెంబర్, ఫిబ్రవరి నెలల్లో మాత్రం అతి తక్కువ బైక్ చోరీలు నమోదయ్యాయి. ఏదేమైనప్పటికీ, ప్రస్తుతం అందుబాటలోకి వచ్చిన జిపిఎస్ సిస్టమ్, సెక్యూరిటీ అలారమ్ వంటి అత్యాధునిక సేఫ్టీ వ్యవస్థల వలన బైక్ చోరీల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు తేలింది. ఈ బైక్ చోరీల సమస్య కేవలం అమెరికా వంటి దేశాల్లోనే కాకుండా మన దేశంలో కూడా గణనీయంగానే ఉంది. కాబట్టి, బైక్‌ల సేఫ్టీ విషయంలో మన జాగ్రత్తలో మనం ఉండక తప్పదు మరి. మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Friday, October 12, 2012, 13:22 [IST]
English summary
The National Insurance Crime Bureau of the US has made an ironical revelation, according to which, one bike is stolen every 11 minutes in the US, at the same time, the report has stated that the bike thefts were 6% less in 2011 when compared to 2010.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+