నరేంద్ర మోడీ క్యాబినెట్‌లో ఆటో పరిశ్రమకు చెందిన మంత్రులు

By Ravi

భారతదేశపు 15వ ప్రధానమంత్రిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీపై భారత ఆటోమొబైల్ పరిశ్రమ భారీ అంచనాలు పెట్టుకుంది. మోడీ రాకతోనైనా పరిశ్రమలో కొంత నూతన ఉత్సాహం కనిపించే ఆస్కారం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కొత్త సంస్కరణలు చేయటం ద్వారా మందకొడిగా సాగుతున్న పరిశ్రమను చురుకుగా ముందుకు తీసుకువెళ్లేందుకు కొత్త ప్రభుత్వం కృషి చేయాలని భారత ఆటోమొబైల్ పరిశ్రమ కోరుతోంది.
కొత్తగా ఏర్పడి సర్కారులోని మోడీ మంత్రి వర్గంలో ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించిన మంత్రులపై ఈ బాధ్యత ఎంతైనా ఉంది. మరి ఆ మంత్రులు ఎవరో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లలో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

నరేంద్ర మోడీపై కోటి ఆశలు..

భారత ఆటోమొబైల్ రంగానికి సంబంధించి నరేంద్ర మోడీ క్యాబినెట్‌లో ఎన్నికైన మంత్రులను తర్వాతి స్లైడ్‌లలో చూడండి.

ఆర్థిక మంత్రిత్వ శాఖ - అరున్ జైట్లీ

ఆర్థిక మంత్రిత్వ శాఖ - అరున్ జైట్లీ

ఏ రంగమైనా అభివృద్ధి చెందాలంటే, అందులో ఆర్థిక మంత్రి పాత్ర చాలా కీలకమైనది. మోడీ క్యాబినెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను అరున్ జైట్లీకి అప్పగించారు. ఒడిదుడుకుల్లో ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమను గాడిన పెట్టాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.

రోడ్డు రవాణా, హైవే, షిప్పింగ్ - నితిన్ గడ్కరీ

రోడ్డు రవాణా, హైవే, షిప్పింగ్ - నితిన్ గడ్కరీ

ఆటో రంగానికి చెందిన మంత్రిత్వ శాఖలో మరో ముఖ్యమైన శాఖ రోడ్డు రవాణా, జాతీయ రహదారులు మరియు ఎగుమతులు. మోడీ మంత్రివర్గంలో ఈ శాఖకు మంత్రిగా ఎన్నికైంది నితిన్ గడ్కరీ. రోడ్డు నెట్‌వర్కును విస్తరించడం, రవాణా వ్యవస్తను మెరుగుపరచడం ఆటోమొబైల్ రంగానికి ఎంతో అవసరం.

చమురు, సహజ వాయువు - ధర్మేంద్ర ప్రధాన్

చమురు, సహజ వాయువు - ధర్మేంద్ర ప్రధాన్

ఆటో రంగానికి మరో ముఖ్యమైన మంత్రిత్వ శాఖ చమురు మరియు సహజ వాయువు. మోడీ ప్రభుత్వంలో ఈ శాఖ బాధ్యతలను ధర్మేంద్ర ప్రధాన్ నిర్వహించనున్నారు. చమురు ధరల నియంత్రణలో సమర్థవంతమైన పాలన ఇవ్వగలిగితే ఆటో రంగం పుంజుకునే అవకాశం ఉంది.

భారీ పరిశ్రమలు, ప్రజా వ్యవహారాలు - అనంత్ గీతే

భారీ పరిశ్రమలు, ప్రజా వ్యవహారాలు - అనంత్ గీతే

ఆటో పరిశ్రమకు చెందిన మరో ముఖ్యమైన శాఖ భారీ పరిశ్రమలు, ప్రజా వ్యవహారాలు. మోడీ క్యాబినెట్‌‌లో ఈ బాధ్యతలను అనంత్ గీతే నిర్వర్తించనున్నారు. గతంలో ప్రఫుల్ పటేల్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కోసం చేపట్టిన ఆటోమోటివ్ మిషన్ ప్లాన్‌కు అనంత్ ఎలాంటి ఊతమిస్తారో వేచి చూడాలి.

నరేంద్ర మోడీపై కోటి ఆశలు..

ఆటోమొబైల్ రంగానికి చెందిన ఈ అన్ని శాఖలు సమర్థవంతంగా పనిచేసినట్లయితే, ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కుంటున్న భారత ఆటోమొబైల్ పరిశ్రమ, వాటన్నింటినీ అధిమించి భారతదేశపు అభివృద్ధిలో కీలక భూమికను పోషించగలదు.

More from DriveSpark

Article Published On: Thursday, May 29, 2014, 16:27 [IST]
English summary
Indian automobile industry hopes on the new government, led by Narendra Modi, to push reforms such as goods and services tax (GST) and policies that boost infrastructure development on the back of a clear mandate in the polls. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+