మోటార్‌స్పోర్ట్ ఆడేవారికే కాదు చూసేవారికి ప్రమాదమే..
మోటార్‌స్పోర్ట్స్ అంటేనే ఓ మృత్యుక్రీడ లాంటిది. మోటార్‌స్పోర్ట్ డ్రైవర్లు తమ ప్రాణాలను రిస్కులో పెట్టి ఇందులో పాల్గొంటారు. ఆడేవారికే కాదు, దీన్ని చూసే వారికి కూడా ఇదొక ప్రమాదమైన గేమ్. మోటార్‌స్పోర్ట్స్‌లో విజేతలుగా నిలిచే వారి కన్నా పరాజయం పాలయ్యే వారే ఎక్కువ. వంపు సొంపుల రోడ్లపై కార్లను మెళికలు తిప్పుతూ డ్రైవ్ చేయటం అన్ని సమయాల్లోనూ సాధ్యం కాకపోవచ్చు.
అంతా సజావుగా సాగితే పర్లేదు కానీ, ఏ చిన్న పొరపాటు జరిగినా దాని వలన కలిగే నష్టం మాత్రం అంచనాలకు మించదు. ప్రత్యేకించి మోటార్‌స్పోర్ట్‌ను వీక్షించడానికి వచ్చే ప్రేక్షకలు తమ జాగ్రత్తలో తాము ఉండాలి. లేకపోతే, ఇదిగో ఈ వీడియోలో చూసినట్లుగానే జరుగుతుంది. ఈ వీడియోలో ఓ ప్యూజో కారు అదుపు తప్పి రేస్ ట్రాక్ నుంచి ప్రేక్షకులు నిలుచుకున్న వైపుకు దూసుకువచ్చింది.
కొంతమంది ప్రేక్షకులు రేస్ ట్రాక్‌కు పక్కనే ఉన్న సిమెంటు రాళ్లపై నిల్చుకొని ఉన్నారు. అదుపు తప్పిన కారు నేరుగా ఆ సిమెంట్ రాళ్లను ఢీకొట్టడంతో దానిపై నిలుచుకున్న వారంతా ఎగిరిపడ్డారు. అదృష్టవశాత్తు వారు సిమెంట్ రాళ్లపై నిలుచుకోవటం ప్రమాద తీవ్రత చాలా వరకు తగ్గిందని చెప్పాలి. లేకుంటే, ఆ తర్వాత జరిగే పరిణామాలను అంచనాలకు మించి ఉండేది.. కాబట్టి, మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదర క్రీడలను సందర్శించడానికి వెళ్లినప్పుడు మీ జాగ్రత్తలో మీరు ఉండటం మంచిది.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/p1ck5KCfOOE?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








