సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం ఏంటి?

By Ravi

'సిగరెట్ తాగకండి బాబు, తాగితే క్యాన్సర్ వచ్చి పోతారు' అని ఇప్పుడు సిగరెట్ కంపెనీలు సైతం నెత్తినోరు బాదుకొని చెబుతుండటాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే, ఒకప్పుడు సిగరెట్ ప్రచారం ముమ్మరంగా సాగేది. తమ సిగరెట్ బ్రాండ్‌లను ప్రచారం చేసుకునేందుకు సదరు సిగరెట్ కంపెనీలు భారీగానే ఖర్చు చేసేవి. వివిధ ప్రసార మాధ్యమాల్లో వీటి ప్రచారాన్ని నిషేధించటంతో సిగరెట్ కంపెనీలు తమ బ్రాండ్‌లను ప్రచారం చేసుకునే వేరే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి.

అలాంటి ప్రత్యామ్నాయ మార్గాల్లో మోటార్‌స్పోర్ట్స్ కూడా ఒకటి. ఫార్మాలా వన్ మోటార్‌స్పోర్ట్స్‌ను స్పాన్సర్ చేసే కంపెనీలలో టొబాకో కంపెనీలు ప్రధానమైనవి. అప్పట్లో అన్ని ప్రధానమైన రేసింగ్ కార్లపై, రేస్ టీమ్‌లు, రేస్ డ్రైవర్ల దుస్తువులు, వారు ఉపయోగించే వస్తువులపై సిగరెట్ బ్రాండ్‌లు తమ లోగోలతో ప్రచారాన్ని పొందేవి. సిగరెట్ బ్రాండ్స్‌తో అసోషియేషన్ పెట్టుకున్న ప్రముఖ ఫార్ములా వన్ జట్లలో ఫెరారీ (మాల్‌బోరో సిగరెట్ బ్రాండ్), లోటస్ (గోల్డ్ లీఫ్ సిగరెట్ బ్రాండ్), మెక్‌లారెన్ (వెస్ట్ సిగరెట్ బ్రాండ్), హోండా (బ్రిటీష్ అమెరికన్ టొబాకో), విలియమ్స్ ఎఫ్1 (క్యామెల్, రోత్‌మ్యాన్స్) వంటి జట్లు ప్రధానంగా చెప్పుకోదగినవి.

సిగరెట్ బ్రాండ్‌లు కేవలం మోటార్‌స్పోర్ట్‌లను స్పాన్సర్ చేయటమే కాకుండా, టొబారో పరిశ్రమకు చెందిన అనేక బ్రాండ్‌లు కూడా ఇందులో పాల్గొనేవి. మోటార్‌సైకిలింగ్, వరల్డ్ ర్యాలీ ఛాంపియన్‌షిప్ వంటి అనేక కార్యక్రమాల్లో సిగరెట్ బ్రాండ్‌లు భాగం పంచుకుంటున్నాయి. అయితే, ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం, మోటార్‌స్పోర్ట్ ఈవెంట్లలో సిగరెట్ బ్రాండ్‌లను ప్రచారం చేయటాన్ని నిషేధించటం జరిగింది. మరి అప్పట్లో సిగరెట్ బ్రాండ్‌లు స్పాన్సర్ చేసిన మేజర్ రేసింగ్ టీమ్‌లను, సిగరెట్‌కు మోటార్‌స్పోర్ట్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

1960వ దశకంలో మోటార్‌స్పోర్ట్‌లను స్పాన్సర్ చేసే బ్రాండ్‌లలో సిగరెట్, టొబాకో బ్రాండ్‌లే అధికంగా ఉండేవి.

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

టొబాకో బ్రాండ్‌లు కేవలం మోటార్‌స్పోర్ట్‌లను స్పాన్సర్ చేయడమే కాకుండా, అందులో భాగం కూడా పంచుకునేవి. మోటార్‌సైకిలింగ్, వరల్డ్ ర్యాలీ ఛాంపియన్‌షిప్ వంటి అనేక కార్యక్రమాల్లో సిగరెట్ బ్రాండ్‌లు భాగం పంచుకుంటున్నాయి.

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

సిగరెట్ బ్రాండ్స్‌తో అసోషియేషన్ పెట్టుకున్న ప్రముఖ ఫార్ములా వన్ జట్లలో ఫెరారీ (మాల్‌బోరో సిగరెట్ బ్రాండ్), లోటస్ (గోల్డ్ లీఫ్ సిగరెట్ బ్రాండ్), మెక్‌లారెన్ (వెస్ట్ సిగరెట్ బ్రాండ్), హోండా (బ్రిటీష్ అమెరికన్ టొబాకో), విలియమ్స్ ఎఫ్1 (క్యామెల్, రోత్‌మ్యాన్స్) వంటి జట్లు ప్రధానంగా చెప్పుకోదగినవి.

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

ప్రస్తుత నిబంధనల ప్రకారం, మోటార్‌స్పోర్ట్‌లలో సిగరెట్, టొబాకో బ్రాండ్‌లను ప్రచారం చేయటాన్ని అనేక దేశాల ప్రభుత్వాలు నిషేధించాయి.

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

రోత్‌మ్యాన్స్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న హోండా టీమ్

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

వరల్డ్ కార్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌ను స్పాన్సర్ చేస్తున్న మాల్‌బోరో సిగరెట్ బ్రాండ్.

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

ప్రస్తుతం పానసోనిక్ (టొయోటా ఎఫ్12), కాంపాక్ మరియు హెచ్‌పి (విలియమ్స్ ఎఫ్1), వొడాఫోన్ (మెక్‌లారెన్) వంటి టెక్నాలజీ బ్రాండ్‌లు మోటార్‌స్పోర్ట్ లను స్పాన్సర్ చేస్తున్నాయి.

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

కేవలం టెక్నాలజీ బ్రాండ్‌లే కాకుండా మోన్‌స్టర్ ఎనర్జీ డ్రింక్, రెడ్‌బుల్ ఎనర్జీ డ్రింక్ వంటి బెవరేజెస్ బ్రాండ్‌లు కూడా ఈ మోటార్‌స్పోర్ట్ లను స్పాన్సర్ చేసేందుకు ముందుకు వస్తున్నాయి.

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

ప్రముఖ బెవరేజ్ బ్రాండ్ రెడ్‌బుల్‌ ఓ ఫార్ములా రేస్ టీమ్ కూడా కలిగి ఉంది. ఈ జట్టు 2012 ఫార్ములా వన్ కన్‌స్ట్రక్టర్ ఛాంపియన్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. గడచిన సంవత్సరం వరల్డ్ ఫార్ములా వన్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన సెబాస్టియన్ వెటెల్ కూడా రెడ్‌బుల్ రేస్ టీమ్‌కు చెందిన రేస్ డ్రైవరే.

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

లక్కీ స్ట్రైక్ సిగరెట్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న సుజుకి రేసింగ్ టీమ్

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

ఇప్పటి ఫార్ములా వన్ టీమ్‌లపై చూద్దామన్నా సిగరెట్, టొబాకో బ్రాండ్‌లు కనిపించడం లేదు.

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

సిగరెట్‌తో మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం

లక్కీ స్ట్రైక్ సిగరెట్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న హాట్ రేసింగ్ మోడల్

More from DriveSpark

Article Published On: Tuesday, February 5, 2013, 11:04 [IST]
English summary
Motorsports and sponsorship will definitely take you to one topic - Cigarettes. The Tobacco industry was one of the major sponsor of Formula 1 racing starting from the late 1960s. Cigarette brands found their names and logos on some of the most prominent racing cars, drivers and teams.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+