ఔరా ఏమిటీ వింత.. రోడ్డుపై గుడిసె కదులుతుందా?.. వీడియో చూడండి
మనిషి తలచుకుంటే ఎన్నెన్నో అద్భుతాలను సృష్టించగలడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ సంఘటనలో రోడ్డుపైన గుడిసెలాంటి ఆకారం కదులుతూ.. చూపరులను ఎంతగానో ఆకర్శించింది. ఇంతకీ దీన్ని ఎవరు తయారు చేశారు? ఎక్కడ తయారు చేశారనే వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.
అసలే మండుతున్న ఎండలు.. రోడ్డుపై అడుగుపెట్టాలంటే ఒకింత భయమేస్తోంది. అయినా తప్పదు కాబట్టి ప్రజలు ఎలాగో ముందుకు సాగిపోతున్నారు. భారీగా పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని ఓ డిజైనర్ల బృందం ఓ కొత్త వాహనాన్ని రూపొందించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటన గుజరాత్‌లోని సూరత్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

సైన్స్ ఫిక్షన్ సినిమా మాదిరిగా కనిపించే ఈ వీడియోలో కదిలే గుడిసె మాదిరిగా ఉండే కారును చూడవచ్చు. రోడ్డుపైన ఈ గుడిసె కదులుతుంటే.. ఇతర వాహనదారులు దీనిని వింతగా చూస్తున్నారు. వీడియోలో కనిపించే వాహనం యొక్క టాప్ స్పీడ్ గంటకు 15 నుంచి 20 కిమీ వేగాన్ని మాత్రమే కలిగి ఉన్నట్లు సమాచారం. ఎండ తాపాన్ని తట్టుకోవడానికి ఇది ఒక వినూత్న ఆలోచన అని ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది.
ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోకు 174000 కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో ఒకరు టార్జాన్ ది వండర్ హోమ్ అని కామెంట్ చేస్తే.. మరొకరు టార్జాన్ ది వండర్ కార్ 2 ట్రైలర్ అని అన్నారు. ఇలా నెటిజన్లు తమదైన ధోరణిలో కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

నిజానికి ఇది ఓ ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉండటం వల్ల రోడ్డుపైన వెళ్లే ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. వీడియోలో గమనించినట్లైయితే.. చిన్న గుడిసె లాంటి నిర్మాణానికి నాలుగు చక్రాలను అమర్చి ఉండటం చూడవచ్చు. బహుశా ఇది ఎలక్ట్రిక్ కారు అయి ఉండొచ్చని భావిస్తున్నాము. అయితే ఇలాంటి వాహనాలు పబ్లిక్ రోడ్డుపైన ఎట్టి పరిస్థితుల్లోనూ సురక్షితం కాదని మాత్రం స్పష్టమవుతోంది.
సూరత్ ప్రాంతాల్లో ప్రత్యేకమైన వాహనాలతో ప్రజలను ఆశ్చర్యానికి గురి చేయడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది జులైలో సూరత్‌కు చెందిన ఒక వ్యక్తి ఒక మోనోసైకిల్ నడుపుతూ చూపరులను ఆశ్చర్యానికి గురి చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో తగ వైరల్ అయింది. నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. ఇలాంటి వాహనాలు కూడా ప్రజా రహదారులపైన సురక్షితం కాదు.
ప్రజా రహదారుల మీద ఇలాంటి వాహనాలు సురక్షితం కాదు
ప్రపంచంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అయితే ఇలాంటి కొత్త వాహనాలు ప్రజా రహదారుపైన సురక్షితం కాదు. మనిషి ఆలోచనలు ప్రసంసనీయమే.. కానీ ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. భద్రత ఎక్కువ వున్నా వాహనాల్లోని ప్రజలే ప్రాణాలు కోల్పోతుంటే.. ఇలాంటి వాహనాల సురక్షితం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








