కారు ప్రమాదంలో లక్కీగా బయటపడిన 'మిస్టర్ బీన్'

Mr Bean Car
కేవలం హావభావాలతో హస్యాన్ని పలికించే హాలీవుడ్ హాస్యనడుడు, 'మిస్టర్ బీన్' కామిక్ పాత్ర పోషించే 'రోవన్ అట్కిన్సన్'కు పెను ప్రమాదం తప్పింది. పాలు తాగే పసికందు నుంచి కాటికి కాళ్లు చాపిన పండుముసలి వాళ్లను సైతం నవ్వించగలిగే రోవన్ అట్కిన్సన్ కారు ప్రమాదానికి గురయ్యాడు. బీన్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌కారు, (మెక్‌లారెన్ ఎఫ్1) ను డ్రైవ్ చేస్తూ, అదుపుతప్పి ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనే ఉన్న చెట్టును, విద్యుత్ దీపపు స్థంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఈ రేస్ కారు నుజ్జు అయిపోయింది. అదృష్టవశాత్తూ రోవన్ అట్కిన్సన్ (మిస్టర్ బీన్) స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బీన్ స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా ఉత్తర ఇంగ్లండ్ ప్రాంతంలోని కేంబ్రిడ్జ్‌షైర్ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది.

కామిక్ సినిమాల్లో 'మిని' కారును హాస్యాస్పదంగా డ్రైవ్ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే బీన్, వాస్తవానికి కార్లంటే మహా సరదా, అదీ సూపర్‌కార్స్ డ్రైవింగ్ చాలా ఇష్టం. రోల్స్ రాయిస్ వింటేజ్ కార్ సహా ఆయన వద్ద భారీ సంఖ్యలో కార్లున్నాయి. అందులో రేసింగ్ కార్లే ఎక్కువ. ప్రమాదానికి గురైన కారు మెక్‌లారెన్ ఎఫ్1. ఇది విడుదలైనప్పుడు ప్రపంచంలోనే ఇది అత్యంత వేగవంతమైన కారు. ఈ కారు గరిష్ట వేగం గంటకు 370 కిలోమీటర్లు. ఈ కారు ధర 6.5 లక్షల పౌండ్లు. మన కరెన్సీలో దీని విలువ రూ.4.75 కోట్లు. కాగా.. సినీఫక్కీలో జరిగిన ఈ కారు ప్రమాదంలో, కారు పలుమార్లు చక్కర్లు కొట్టి, రోడ్డు పక్కనున్న ఒక చెట్టును ఢీకొని నుజ్జునుజ్జయి అయింది. ఈ ప్రమాదంలో రోవన్ భుజం ఎముక విరగినట్లు సమాచారం.

More from DriveSpark

Article Published On: Sunday, August 7, 2011, 16:19 [IST]
English summary
Rowan Atkinson, known more as Mr Bean in India has suffered a rather costly car crash in the UK. Mr Atkinson a known petrol head and car lover is the owner several cars. He crashed his McLaren F1 super car in to a lamp post near Peterborough. The actor is presently in a hospital and is expected to released today.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+