అభిమాని బీఎండబ్ల్యూ 740i కారుపై ధోనీ ఆటోగ్రాఫ్‌.. వీడియోపై నెటిజన్ల కామెంట్స్‌ వైరల్‌.!!

టీమిండియా మాజీ క్రికెటర్ మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనీ తన అభిమాని కోరిక మేరకు BMW 740i సిరీస్‌ కారుపై ఆటోగ్రాఫ్‌ చేశారు. దీంతో సదరు అభిమాని ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. ధోనీ సంతకంతో ఆ కారు విలువ కూడా పెరిగిపోయిందని ఫ్యాన్స్‌ కాంప్లిమెంట్స్‌ ఇస్తున్నారు. పూర్తి సమాచారం ఈ కథనంలో..

వింటేజ్‌ కార్ల నుంచి మొదలకుని నేటి తరం లగ్జరీ కార్ల వరకూ ప్రతి మోడల్‌ను ధోనీ(MS Dhoni Cars Collection) గ్యారేజ్‌లో చూడవచ్చు. ఈ నేపథ్యంలో ధోని తన అభిమాని బీఎమ్‌డబ్ల్యూ 740ఐ సిరీస్ కారుపై ఆటోగ్రాఫ్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

Dhoni-Autograph-On-BMW-740i

మహీంద్రసింగ్‌ ధోనీ స్వస్థలం రాంచీ. అదే ప్రాంతంలో నివసించే అభిషేక్ అనే వ్యక్తి ధోనీకి వీరాభిమాని. ఈ క్రమంలో అభిషేక్ BMW 740i సిరీస్ కారును కొనుగోలు చేశాడు. కోట్ల ఖరీదు చేసే ఈ కారు తన జీవితంలో అత్యంత స్పెషల్‌గా ఉండాలనుకున్నాడమే.. ఆ కారుపై ధోనీ ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలని నిశ్చయించుకున్నాడు.

ఈ క్రమంలో ధోనీని కలుసుకుని విషయం చెప్పగా.. దానికి మిస్టర్‌ కూల్‌ అంగీకరించారు. అభిమాని కోరిక మేరకు ధోనీ.. అతని BMW 740i లగ్జరీ కారుపై తన ఆటోగ్రాఫ్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ వీడియోలో, ధోని కారు వెనుక సీటులో కూర్చోవడం చూడవచ్చు.

Dhoni-Autograph-On-BMW-740i

బీఎండబ్ల్యూ కారులో వెనుక సీట్‌లో ఆర్మ్‌రెస్ట్ వెనుక ఉన్న ప్రాంతంలో ఒక లెదర్ షీట్‌పై ఆటోగ్రాఫ్‌ చేసిన అనంతరం అభిమానిని కంగ్రాచ్యులేట్‌ చేస్తూ కారు దిగాడు. ఈ వీడియోను అభిషేక్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. అభిమానుల పట్ల ధోనీ ప్రేమకు, సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ధోనీ ఆటోగ్రాఫ్‌ వల్ల ఈ కారు ధర పెరిగిందని కామెంట్స్‌ చేస్తున్నారు.

కాగా బీఎండబ్ల్యూ 740i దేశీయ మార్కెట్లో రూ.1.7 కోట్ల ధరలో అందుబాటులో ఉంది. ఈ కారు లీటరుకు 12.61 కి.మీ మైలేజీని ఇస్తుంది. కాగా ఇది మొత్తం 7 కలర్స్‌లో అందుబాటులో ఉంది. అయితే ధోని సంతకం చేసిన ఈ కారు బ్లాక్ సఫైర్ మెటాలిక్ రంగులో ఆకర్షణీయంగా ఉంది.

Dhoni-Autograph-On-BMW-740i

బీఎండబ్ల్యూ 740i ఇంజిన్ విషయానికి వస్తే ఈ కారు 2998 cc 6 సిలిండర్ ఇన్‌లైన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 375 bhp శక్తిని, 520 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాగా ఇది B56 టర్బో ఛార్జ్డ్ ఇంజిన్.

బీఎండబ్ల్యూ 740i కారు కేవలం 5.4 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఈ లగ్జరీ కారులో ఓవర్ స్పీడ్ వార్నింగ్, ల్యాండ్ డిపార్చర్ వార్నింగ్, ఎమర్జెన్సీ బ్రేక్ లైట్ ఫ్లాషింగ్, పంక్చర్ కిట్, ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, హై బీమ్ అసిస్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Dhoni-Autograph-On-BMW-740i

ఇదిలా ఉండగా ధోనీ వద్ద క్రికెటర్ ధోనీ వద్ద అనేక కంపెనీల మోడళ్ల కార్లు చాలా ఉన్నాయి. ఫెరారీ 599 GTO, ఆడి క్యూ7, మిత్సుబిషి పజెరో SFX, రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో 2, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 మొదలైన కార్లు ఉన్నాయి. ధోనీ తరచూ ఓ వింటేజ్ కారులో బయటకు రావడం సోషల్‌ మీడియాలో చూస్తూ ఉన్నాం.

ఇక ధోనీ వద్ద ఖరీదైన బైక్‌లు కూడా ఉన్నాయి. కవాసకి నింజా H2, సుజుకి హయాబుసా, యమహా RT 350, హార్లే డేవిడ్‌సన్ ఫ్యాట్ బాయ్‌లను రాంచీలో ధోనీ నివాసంలోని గ్యారేజ్‌లో చూడవచ్చు. కాగా ఇటీవల మిస్టర్‌ కూల్‌ రూ.2.25 లక్షల ఖరీదైన జావా 42 బాబర్ బైక్‌ను కూడా కొనుగోలు చేశాడు.

Article Published On: Monday, November 13, 2023, 14:16 [IST]
English summary
Ms dhoni autograph on bmw 740i series luxury suv video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+