మరో క్లాసిక్‌ మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసిన MS ధోనీ.. ఈ బైక్‌ అంటే అంత ఇష్టమా?

మహీంద్రా సింగ్ ధోనీ (MS Dhoni) .. ప్రపంచవ్యాప్తంగా పరిచయం లేని పేరు. ధోనీకి కార్లు, బైక్‌లు అంటే ఎంతో ఇష్టం. రాంచీలోని తన ఇంట్లో పెద్ద గ్యారేజీని కలిగి ఉన్నారు. ఆ గ్యారేజీలో సుమారు 50 వాహనాలు ఉంటాయని ఓ ఇంటర్య్వూ సందర్భంగా ధోనీ వెల్లడించారు.

తాజాగా ఎంఎస్ ధోనీ మరో వాహనాన్ని కొనుగోలు చేశారు. యమహా RD350 బైక్‌ను ( Yamaha RD350 ) కొనుగోలు చేశాడు. ఇప్పటికే ఒక యమహా RD350 మోటార్‌ సైకిల్‌ ధోనీ వద్ద ఉంది. ఈ బైక్‌కు భారీ సంఖ్యలో అభిమానులున్నారు.

MS Dhoni buys yamaha RD350

ధోనీకి కూడా ఈ బైక్‌ అంటే ఎంతో ఇష్టం అని తెలుస్తోంది. గతంలోనూ చాలాసార్లు ఈ బైక్‌ను రైడింగ్ చేస్తూ కనిపించారు. తాజాగా కొనుగోలు చేసిన బైక్‌ను బ్లూ స్మోక్‌ కస్టమ్స్‌ కంపెనీ ధోనికి డెలివరీ చేసింది. ఆకుపచ్చ రంగులో ఈ బైక్‌ ఉంది.

బ్లూ స్మోక్‌ కస్టమ్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో యమహా RD350 బైక్‌కు సంబంధించిన వీడియోను అప్‌లోడ్‌ చేయబడ్డాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ బైక్‌ 350 cc 2-స్ట్రోక్‌ ఎయిర్‌ కూల్డ్‌ ట్విన్‌ ఇంజిన్‌లను కలిగి ఉంటుంది. ఈ బైక్ మెరుగైన పనితీరుగా ప్రసిద్ధిగాంచింది.

MS Dhoni received yamaha RD350

ఈ యమహా RD350 ఇంధన ట్యాంక్‌ పైభాగంలో 7 నంబర్‌ను గమనించవచ్చు. ఇది ధోనీ యొక్క జెర్సీ నంబర్‌ను సూచిస్తుంది. చంఢీగడ్‌ వేదికగా కార్యకలాపాలను సాగిస్తున్న బ్లూ స్మోక్‌ కస్టమ్స్‌ ఈ బైక్‌ను రాంచీలోని ధోనికి ఇంటికి డెలివరీ చేసినట్లు తెలుస్తోంది.

యమహా ఈ RD350 బైక్‌ను భారత్‌లో అధికారికంగా విడుదల చేయలేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా 1980 నుంచి 1983 వరకు విక్రయించారు. ఈ మోటార్‌సైకిల్ లిక్విడ్‌ కూల్డ్‌, 2- స్ట్రోక్ పేర్లల్‌ ట్విన్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ గరిష్ఠంగా 49bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

MS Dhoni latest news

మిస్టర్‌ కూల్‌ MS ధోనీ సుమారు 50 బైక్‌లను కలిగి ఉన్నారు. ఇందులో హార్లే డివిడ్‌సన్‌ ఫ్యాట్‌బాయ్‌, కవాసకి Ninja H2, డుకాటీ 1098, యమహా RD 350 మరియు సుజుకి హయబుసా సహా మరెన్నో అద్భుతమైన బైక్‌లు ధోనీ గ్యారేజీలో ఉన్నాయి. అయితే ఓ పాత ఇంటర్వ్యూలో తన వద్ద 50 కంటే ఎక్కువ బైక్‌లు ఉన్నాయని ధోని చెప్పాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీ 2004 నుంచి 2019 వరకు 90 టెస్టులు, 350 వన్డేలు, 98 T20 ఆడాడు. తన అంతర్జాతీయ కెరీల్లో ధోనీ మొత్తం 16 సెంచరీలు, 108 హాఫ్‌ సెంచరీలు చేశాడు. అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ధోనీ ప్రస్తుతం IPLలో మాత్రమే కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, December 2, 2023, 17:10 [IST]
English summary
Ms dhoni buys another yamaha rd350 motorcycle
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+