మరో అరుదైన కారు సొంతం చేసుకున్న MS ధోని.. మీరూ ఓ లుక్కేసుకోండి

ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ 'మహేంద్ర సింగ్ ధోని' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే క్రికెట్ లో తనదైన ముద్ర వేసుకుంటూ ఎంతోమంది అభిమానులను పొందగలిగాడు. అంతే కాకుండా ఇతనికి కార్లు మరియు బైకులంటే కూడా అమితమైన ఇష్టం. ఈ కారణంగానే అతడు వీటి కోసం ఒక గ్యారేజీ ఏర్పాటు చేసుకుని ఇందులో అతని కార్లు మరియు బైకులను నిలిపాడు. అయితే ఇప్పుడు మరో అరుదైన కారుని తన గ్యారేజిలో చేర్చినట్లు తెలిసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మరో అరుదైన కారు సొంతం చేసుకున్న MS ధోని.. మీరూ ఓ లుక్కేసుకోండి

సాధారణంగా ఎంఎస్ దీనికి లగ్జరీ కార్లు మరియు బైకులు మాత్రమే కాకుండా, పాతకాలపు కార్లంటే కూడా చాలా ఇష్టం. ఈ కారణంగా అలాంటి కార్లను కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపుతుంటాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో అరుదైన పాతకాలపు కారుని తన గ్యారేజిలో చేర్చాడు.

మరో అరుదైన కారు సొంతం చేసుకున్న MS ధోని.. మీరూ ఓ లుక్కేసుకోండి

బిగ్ బాయ్ టోయ్స్ ప్రతి ఏడాది పాత, క్లాసిక్ కార్లను వేలం వేస్తూ ఉంటోంది. ఇంతకు ముందు నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో చాలా మంది సెలబ్రిటీలు తమకు ఇష్టమైన వింటేజ్ కార్లను సొంతం చేసుకున్నారు. ఫేమస్ వింటేజ్ కార్లను బిగ్ బాయ్ టోయ్స్ దేశంలో పలు ప్రాంతాల నుంచి సేకరించి వేలం వేస్తుంది.

మరో అరుదైన కారు సొంతం చేసుకున్న MS ధోని.. మీరూ ఓ లుక్కేసుకోండి

అయితే ఈ కంపెనీ తాజాగా క్లాసిక్ 1971 ల్యాండ్ రోవర్ సిరీస్ 3ని వేలం వేసింది. ఇందులో చాలామంది పాల్గొన్నప్పటికీ దీనిని ఎంఎస్ ఈ పాతకాలపు కారుకి సొంతం చేసుకున్నాడు. కంపెనీ ఈ సారి వేలంలో 19 వింటేజ్ కార్లను వేలానికి తీసుకొచ్చింది. వీటిలో రోల్స్ రాయిస్, చెవ్రొలెట్, ల్యాండ్ రోవర్, ఆస్టిన్, మెర్సిడెస్ బెంజ్‌కు చెందిన కార్లున్నాయి. వీటిలో 50 శాతం కార్లు ఈ వేలం సమయంలో విక్రయించబడ్డాయి. ప్రస్తుతం ఈ అరుదైన మరియు అపురూపమైన కారును ధోని సొంతం చేసుకున్నారు.

మరో అరుదైన కారు సొంతం చేసుకున్న MS ధోని.. మీరూ ఓ లుక్కేసుకోండి

ఎంఎస్ ధోని గ్యారేజీలో ఇప్పటికే ఒకటి కంటే ఎక్కువ కార్లు ఉన్నాయి. కొంత కాలం క్రితం ధోని నిస్సాన్ జోంగాను కూడా కొనుగోలు చేశారు. ఇప్పుడు ధోని కొనుగోలు చేసిన ఈ కారు విషయానికి వస్తే, ఇది ఆకర్షణీయమైన ఎల్లో కలర్ లో ఉంది. ఇది 1971 నుండి 1985 వరకు తయారు చేయబడిన 4,40,000 యూనిట్లతో కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్‌లలో ఒకటి, ఇది 2.3 లీటర్, నాలుగు సిలిండర్లు, పెట్రోల్ ఇంజన్‌లో 3.5 లీటర్ V8 ఇంజిన్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే ధోని కొనుగోలు చేసిన కారులో ఏ ఇంజిన్ ఉంది అనే విషయం స్పష్టంగా తెలియదు.

మరో అరుదైన కారు సొంతం చేసుకున్న MS ధోని.. మీరూ ఓ లుక్కేసుకోండి

ప్రస్తుతం వేలం వేయబడిన కార్లను బిగ్ బాయ్ టాయ్స్ యొక్క గురుగ్రామ్ షోరూమ్‌లో చూడవచ్చు, వీటిని కంపెనీ దేశవ్యాప్తంగా సేకరించారు. బీటిల్ కారు వేలం రూ.1 నుంచి ప్రారంభమై ఏకంగా రూ.25 లక్షలకు చేరుకుంది. మిగిలిన పాతకాలపు కార్లను ఎవరు కొనుగోలు చేశారనేది ఇంకా తెలియదు.

మరో అరుదైన కారు సొంతం చేసుకున్న MS ధోని.. మీరూ ఓ లుక్కేసుకోండి

ఇదిలా ఉండగా ధోని ఇంతకు ముందు కూడా ఒక అరుదైన కారుని కొనుగోలు చేశారు. ఇది పోంటియాక్ ఫైర్‌బర్డ్ కార్టన్ అనే అరుదైన పాతకాలపు కారు. భారతీయ రోడ్లపై ఈ కారు చూడటం చాలా అరుదు. ధోని ఏ వాహనాలను కొనుగోలు చేసినా సాధారణంగా బహిరంగ రహదారులపై నడుపుతారు. కానీ ఈ కారును పబ్లిక్ రోడ్లపై నడపడం అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే కారుకు ఎడమ వైపు డ్రైవ్ సిస్టమ్ ఉంది. ఈ రెండు-డోర్ల కారు 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన వి8 బిగ్ బ్లాక్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

మరో అరుదైన కారు సొంతం చేసుకున్న MS ధోని.. మీరూ ఓ లుక్కేసుకోండి

రైట్ సైడ్ డ్రైవ్ సిస్టమ్ ఉన్న వాహనాలు మాత్రమే భారతదేశంలో అమ్ముడవుతున్నాయి. ఈ అరుదైన కారు ధర గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. అయితే ఈ కారు ధర రూ. 68.3 లక్షలు ఉంటుందని అంచనా. ఇదే ధర కోసం 2019 నవంబర్‌లో ఇదే కారును వేలం వేశారు.

మరో అరుదైన కారు సొంతం చేసుకున్న MS ధోని.. మీరూ ఓ లుక్కేసుకోండి

హమ్మర్ హెచ్ 2, రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో సిరీస్ 1, మిత్సుబిషి పజెరో ఎస్ఎఫ్ఎక్స్, ఆడి క్యూ 7, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్ 2 మరియు ఫెరారీ 599 జిటిఓ వంటి అరుదైనకార్లను ధోని కలిగి ఉన్నాడు. అంతే కాకుండా ధోని గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్, మెర్సిడెస్ బెంజ్ ఎఫ్‌ఎల్‌ఇ మరియు నిస్సాన్ 4 డబ్ల్యు 73 లను కూడా కలిగి ఉన్నాడు.

మరో అరుదైన కారు సొంతం చేసుకున్న MS ధోని.. మీరూ ఓ లుక్కేసుకోండి

ధోనిని కార్లు మాత్రానే కాకుండా బైక్‌లంటే కూడా చాలా ఇష్టం. కావున యితడు తన గ్యారేజిలో హెల్‌క్యాట్ X132, యమహా RD350, హార్లే-డేవిడ్‌సన్ ఫ్యాట్ బాయ్, BSA గోల్డ్‌స్టార్, కవాసకి నింజా ZX14R, యమహా FZ-1, కవాసకి నింజా H2 మొదలైన ఆధునిక బైకులను కలిగి ఉన్నాడు.

మరో అరుదైన కారు సొంతం చేసుకున్న MS ధోని.. మీరూ ఓ లుక్కేసుకోండి

ధోనీ తన గ్యారేజీకి నిరంతరం పాతకాలపు కార్లను జోడిస్తున్నాడు, దీన్ని బట్టి చూస్తే అతనికి కార్లు మరియు బైక్‌లంటే ఎంత ఇష్టమో మనకు తెలుస్తుంది. ధోని ఈ వాహనాలకోసం ప్రత్యేకంగా ఒక గ్యారేజ్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Ms dhoni buys vintage car 1971 land rover series 3 in online auction details
Story first published: Wednesday, January 19, 2022, 8:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X