MS Dhoni ధోని కార్లు, బైక్స్..లగ్జరీ బైక్స్‌ అంటే ధోనికి ఎందుకు అంత ఇష్టం?

మహేంద్ర సింగ్ ధోనీ పరిచయం అక్కర్లేని పేరు. దేశంలో ఈ కెప్టెన్ కూల్‌కి ఉన్న ఆధారణ మరే క్రీడాకారుడికి లేదంటే అతిశయోక్తి కాదు. మైదానంలో తన మిస్టర్ కూల్‌ ఫర్ఫామెన్స్‌తో ఫాన్స్‌కి కొత్త జోష్ తీసుకువస్తాడు. ధోని అంటే ఒక బ్రాండ్ అనే విధంగా తనదైన శైలిలో క్రికెట్‌లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు మహీ.

ప్రపంచ క్రికెటర్లలో అత్యుత్తమ కెప్టెన్ల జాబితాలో ధోనీ అగ్రస్థానంలో ఉంటారు. ఐపీఎల్‌లో ధోని క్రీజ్‌లో ఉండగా జియో సినిమాలో 2కోట్ల మంది లైవ్ వీక్షించారు. ఈ ఒక్కటి చాలు ధోని ఎంత ఫేమసో అని చెప్పడానికి. నేడు 42వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మహేంద్ర సింగ్ ధోనీకి చెందిన కారు, బైక్ కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం.

Dhoni-luxury-cars

నార్టన్ జూబ్లీ 250: మహేంద్ర సింగ్ ధోని యొక్క లెజెండరీ బైక్ నార్టన్ జూబ్లీ 250 క్లాసిక్ కలెక్షన్ లో అగ్రస్థానంలో ఉంది. అతని వింటేజ్ కలెక్షన్ లో ఇది చాలా ముఖ్యమైన బైక్ లలో ఒకటి. ఈ ఫోటోను ధోనీ స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో షేర్ చేశాడు.

కవాసాకి నింజా H2: కవాసాకి నింజా H2 ధోని గ్యారేజీలో అత్యంత ఖరీదైన బైక్ కలెక్షన్లలో ఒకటి. దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.33.30 లక్షలుగా ఉంటుంది. ధోనీ వద్ద ఉన్న కవాసాకి నింజా H2 మోడల్ 2017కి చెందినట్లు సమాచారం.

Dhoni-Grand-Cherokee-Trackhawk

జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్ హాక్: మహేంద్ర సింగ్ ధోనీ ఎరుపు జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్ హాక్ నడుపుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాలుగు రంగుల్లో లభించే ఈ కారు కేవలం ఒక వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ధోని దగ్గర ఉండటం గమనార్హం.

కియా ఈవీ6: ఇప్పుడు ధోనీ కార్ కలెక్షన్‌లో సరికొత్త ఎలక్ట్రిక్ కారు కియా ఈవీ6 కూడా చేరింది. ఇది పూర్తి ఛార్జ్‌తో 700 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ధోనీతో పాటు పలువురు సెలబ్రిటీల గ్యారేజీలో ఈ కారు కనిపించింది. ప్రస్తుతం ఈ కార్లను బుకింగ్ మీద సంస్థ అందిస్తోంది.

Dhoni-Kia Ev6

మహీంద్రా స్కార్పియో: భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా స్కార్పియో కూడా ధోని గ్యారేజీలో ఉంది. ఈ కారును మహేంద్ర సింగ్ ధోనీ చాలా ఆకర్షణీయంగా కనిపించేలా కస్టమైజ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కొన్ని సార్లు రోడ్లపై దర్శనమిచ్చారు. ఇప్పటికి ఇది కూడా తన ఫేవరెట్ కార్లలో ఒకటని ధోని చెప్తుంటారు.

కాన్ఫెడరేట్ ఎక్స్ 132 హెల్‌క్యాట్: కాన్ఫెడరేట్ ఎక్స్ 32 హెల్‌క్యాట్ ప్రపంచంలోనే అరుదైన బైక్. దీనికి కారణం కంపెనీ ఈ కాన్ఫెడరేట్ ఎక్స్ 32 హెల్‌క్యాట్ బైక్ యొక్క 150 యూనిట్లను మాత్రమే తయారు చేసింది. అందులో ధోనీకి కూడా ఒకటి ఉంది.

నిస్సాన్ జోంగా: నిస్సాన్ జోంగా ఈ రోజుల్లో అతనికి ఇష్టమైన వాహనం. ఇది భారత సాయుధ బలగాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినందున ఇది కూడా ప్రత్యేకమైనది. సాయుధ దళాల పట్ల గౌరవం కోసం అతను 2019లో కొనుగోలు చేశారు. నిస్సాన్ 4W73 అని కూడా పిలువబడే జోంగా, డాడ్జ్ M37 వెపన్ క్యారియర్ ఆధారంగా రూపొందించారు. ఇందులోని 4-లీటర్ ఇంజన్ ఇంజన్ 128bhp వద్ద 279Nm టార్క్‌ను అందిస్తుంది.

Dhoni-Jiva-Jonga

వీటితో పాటు ధోనీకి అనేక అధునాతన లగ్జరీ కార్లు, ల్యాండ్ రోవర్స్, రోల్స్ రాయిస్, పాంటియాక్ ఫైర్‌బర్డ్ వంటి మరెన్నో కార్లు ఉన్నాయి. బైక్ కలెక్షన్లు కూడా ఉన్నాయి. ఇందులో పాత మినీ కూపర్ కార్లు కూడా ఉన్నాయి. హర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాయ్, బీఎస్‌ఎ గోల్డ్ స్టార్, యమహా బైక్స్, టీవీఎస్ రోనిన్ బైక్స్ ఉన్నాయి.

ధోనీ తనతో కలిసి ఉన్న కార్లు, బైక్ ల ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. తన వ్యవసాయ క్షేత్రంలోని ట్రాక్టర్ ని సరదాగా నడుపుతూ కనిపించారు. ఇలా ధోని కొత్తగా ఏది చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది. దానికి ఉదాహరణే క్యాండీ క్రష్ గేమ్ అని కూడా చెప్పవచ్చు. ధోని దీనిని ఆడటం చూసిన జనాలు గంటలనే 30 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, July 7, 2023, 15:37 [IST]
English summary
Ms dhoni cars and bikes collection details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+