అభిమాని బైక్‌ను తన టీ షర్టుతో తుడిచిన మహీ.. ‘దటీజ్‌ ధోనీ’ అంటూ నెటిజన్ల కామెంట్స్‌.!!

భారత్‌లో సినిమా సెలబ్రిటీల తర్వాత అంత క్రేజ్‌ ఉంది ఎవరికీ అంటే క్రికెటర్లకే అని చెప్పొచ్చు. అందుకే వారికి సంబంధించి ఏ చిన్న వార్త అయినా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. టీం ఇండియా మాజీ కెప్టెన్‌, క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీ అంటే అభిమానుల్లో ఓ రకమైన వైబ్రేషన్‌ ఉంటుంది. ధోనీకి బైక్‌లన్నా, కార్లన్నా చాలా ఇష్టం. ఈ క్రమంలో ధోనీకి సంబంధించిన ఓ వీడియో హల్‌చల్‌ చేస్తోంది.

మీరు ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు మీకు నచ్చిన సెలబ్రిటీలు కనబడితే ఆటోగ్రాఫ్‌ కానీ ఫొటో కానీ తీసుకోకుండా ఉండలేరు. ఫ్యాన్స్‌ కాబట్టి వారూ కాదనలేరు. కానీ ఇక్కడ ధోనీ విషయానికొస్తే.. ఇక్కడ మిస్టర్‌ కూల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీరే అంటారు.. సింప్లిసిటీకి మరోసారి అతనే నిదర్శమని ప్రశంసలు కురిపిస్తారు.

MS-Dhoni-Cleans-Fans-Bike

బైక్‌పై ఓ ప్లేస్‌కి వచ్చిన ధోనీ ఫ్యాన్‌.. సడెన్‌గా అక్కడ తన అభిమాన క్రికెటర్‌ను చూసి ఆనందంతో పొంగిపోయాడు. దీంతో మహీ నుంచి ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలని ఫిక్స్‌ అయ్యాడు. ధోనీకి వింటేజ్‌ బైక్‌లు, కొత్త బైక్‌లంటే చాలా ఇష్టమని తెలియని ఫ్యాన్స్‌ ఉండరు. అందుకేనేమో తన బైక్‌పై సంతకం చేయాలని కోరాడు.

దీంతో ధోనీ ఆటోగ్రాఫ్‌ చేయడానికి అంగీకరించాడు. అయితే ఇక్కడే ధోనీ తన సింప్లిసిటీతో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచాడు. మహీ ఆర్మీ అని రాసి ఉన్న టీ షర్టును ధరించాడు. బైక్‌ ముందుభాగంలో సంతకం చేసేటప్పుడు.. మొదటగా దానిని శుభ్రం చేశాడు. అయితే దానిని ఏ క్లాత్‌తోనే తుడిచాడు అనుకుంటే పొరపాటే..

MS-Dhoni-Cleans-Fans-Bike

ధోనీ తాను వేసుకున్న టీ షర్టుతో ఆటోగ్రాఫ్‌ ఇవ్వాల్సిన చోట శుభ్రం చేసి సంతకం చేశాడు. అయితే సరిగా రాకపోవడంతో మళ్లీ ఒకసారి అలాగే తుడిచి సిగ్నేచర్‌ చేశాడు. దీనిని వీడియో తీసిన వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. అయితే కొందరు సెలబ్రిటీలు ఇతర వస్తువులను తాకడానికే ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఫ్యాన్‌ బైక్‌ను ఇలా ధోనీ టీ షర్టుతో తుడవడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

MS-Dhoni-Cleans-Fans-Bike

ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా వ్యూస్‌ను సంపాదించుకుంది. ధోనీ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బైక్‌లంటే మహీకి ఇంత ఇష్టమా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రజలు కొత్త వస్తువులను ఎలా చూసుకుంటారనేది ధోనీకి బాగా తెలుసు అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ఇది కేవలం ధోనీకి మాత్రమే సాధ్యమంటూ మరో నెటిజన్‌ అన్నారు.

ఆటోగ్రాఫ్‌ చేసిన అనంతరం ధోనీ.. బైక్‌ను స్టార్ట్‌ కూడా చేశాడు. ఆ సమయంలో అతని ముఖంలో చిరునవ్వును చూడవచ్చు. మహీకి కార్లు, బైక్‌లంటే ఎంత ఇష్టమో.. రాంచీలో తన నివాసంలోని గ్యారేజ్‌ను చూస్తే తెలుస్తోంది. ఓ షోరూమ్‌లో కూడా ఇన్ని వాహనాలు ఉండవేమో అనేంతలా.. అన్ని కలెక్షన్లను కొనుగోలు చేశాడు. వింటేజ్‌ వాహనాల నుంచి మొదలుకొని ప్రస్తుత మోడళ్ల వరకూ అన్నీ ఖరీదైన వాహనాలు కలిగి ఉన్నాడు.

MS-Dhoni-Cleans-Fans-Bike

కాగా ధోని ఆటోగ్రాఫ్ చేసిన బైక్ మోడల్ ట్రయంఫ్ రాకెట్ 3R(Triumph Rocket 3R). భారత్‌లో విక్రయించబడుతున్న అత్యంత ఖరీదైన బైక్‌ మోడళ్లలో ట్రయంఫ్‌ రాకెట్‌ 3R ఒకటి. ట్రయంఫ్ రాకెట్ 3 నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 21.40 లక్షలు(ఎక్స్-షోరూమ్).

MS-Dhoni-Cleans-Fans-Bike

ట్రయంఫ్‌ 3R బైక్ 2500 సీసీ 3 సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. గరిష్ఠంగా 167 PS శక్తిని, 221 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఖరీదైన, అరుదైన బైక్‌పై ధోనీ ఆటోగ్రాఫ్‌ చేయడం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా షేర్‌ చేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, November 29, 2023, 8:30 [IST]
English summary
Ms dhoni cleaned fans bike with his t shirt and gave autograph on it
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+