రూ.4 కోట్ల బెంజ్ కారుతో కెప్టెన్లకే బాద్‌షా.. కూల్‌ డ్రైవింగ్ చేసిన మిస్టర్ కూల్.. వైరల్ అవుతున్న వీడియో

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి అందరికీ తెలిసిందే. మిస్టర్ కూల్ కెప్టెన్ అని ఆయన ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. క్రికెట్ ప్రేమికుడిగా మాత్రమే కాకుండా ఆయనకు కార్లు, బైకులంటే చాలా ఇష్టం. గతంలో చాలా సార్లు ధోనికి సంబంధించిన గ్యారేజీ ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో కనిపించాయి. అందులో పాత కాలం నాటి వాహనాల నుంచి మొదలుకుని, అదిరిపోయే లేటెస్ట్ మోడళ్ల వరకు అన్ని ఉన్నాయి. ధోనీ మొదటి బైక్‌ ఆర్‌ఎక్స్-135 నుంచి మొదలుకుని ఖరీదైన సూపర్ బైకులు గ్యారేజీలో దర్శనమిస్తాయి. అలాగే పాత కాలం నాటి కార్ల నుంచి ఇప్పటి వరకు విడుదలైన టాప్ బ్రాండ్‌లకు చెందిన అత్యంత ఖరీదు కలిగిన కార్లు కూడా ధోని వద్ద ఉన్నాయి. మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడల్ విడుదల అయిందంటే చాలు దాని గురించి అన్ని వివరాలు తెలుసుకుని గ్యారేజీలో పెట్టుకోవాలని చూస్తారు.

ఇదిలా ఉంటే, మహేంద్ర సింగ్ ధోని తాజాగా మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎమ్‌జీ లేదా జీ వాగన్ ( Mercedes Benz G-Wagen or G63 AMG) కారుతో కనిపించారు. ఆయనే స్వయంగా ఈ లగ్జరీ కారును డ్రైవింగ్ చేసారు. దీనికి సంబంధించిన వీడియోను య్యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా, ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ఈ వీడియోను ఆయన నివాసం వద్ద తీశారు.

Ms Dhoni Mercedes Benz G wagen

ఇది కొన్ని సెకన్ల పాటు రికార్డు చేసిన చిన్న క్లిప్. ఈ వీడియోను చూసినట్లయితే జార్ఖండ్‌లోని రాంచీలో ధోని ఇంటి బయట కారులో ఆయన ఉన్నట్లు కనిపిస్తుండగా, అక్కడ అభిమానులు కూడా ఉన్నారు. మెయిన్ గేట్ వద్ద ఆయన అభిమానుల్లో ఒకరు ధోని రాకను వీడియో తీసి షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను చాలా మంది చూశారు. చాలా మంది ధోని కారు గురించి చర్చించుకుంటున్నారు.

కార్లు, బైకులు అంటే ఎంతో ఇష్టం ఉన్న ధోని కొత్తగా మరో కారు కొనుగోలు చేశారా.. అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ Mercedes-Benz G63 AMGని ఇటీవల కాలంలో కొనుగోలు చేశారు. ఇది ఒక ఎస్‌యూవీ (SUV) మోడల్. ఆయన ఈ కారును ఒంటరిగా డ్రైవింగ్ చేస్తూ కనిపించారు. మెయిన్ వద్ద ఉన్నటువంటి ఫ్యాన్స్‌తో ఎలాంటి ఫోటోలు దిగకుండానే ఆయన లోపలికి వెళ్లిపోయారు.

Ms Dhoni Driving Mercedes Benz

మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్వయంగా డ్రైవింగ్ చేస్తూ కనిపించిన లగ్జరీ బెంజ్ కారును గత ఏడాది నవంబర్‌లో కొనుగోలు చేశారు. ఇది మాగ్నో నైట్ బ్లాక్‌గా కనిపిస్తుంది. ఈ ఎస్‌యూవీ కోసం ఆయన ప్రత్యేకంగా "0007" అనే తనకు బాగా ఇష్టమైన నెంబర్‌ను ఎంచుకున్నారు. ఈ ప్రత్యేక నెంబర్ ధోనీ జెర్సీ నంబర్. అందుకే ఇది చాలా స్పెషల్ అని అంటారు. ఈ కారు చాలా అధునాతనమైనది.

ఈ కారు 4.0-లీటర్ బై-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఈ ఇంజిన్ శక్తివంతమైనది. ఇది 585 Bhp పవర్‌ను, 850 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ధర దాదాపు రూ.4 కోట్ల(ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. ధోని గ్యారేజీ గురించి మాట్లాడుకుంటే, 100 కంటే ఎక్కువ మోటార్ సైకిళ్లు ఉన్నాయి. హార్లే డేవిడ్‌సన్ ఫ్యాట్‌బాయ్, డుకాటీ 1098,కవాసకి నింజా H2 వంటి ఖరీదైన బైకులు ఉన్నాయి.

Ms Dhoni Driving Benz

అలాగే, నార్టన్ జూబ్లీ 250, జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్ హాక్, కియా ఈవీ6, నిస్సాన్ జోంగా, ల్యాండ్ రోవర్స్, రోల్స్ రాయిస్, పాత మినీ కూపర్ కార్లు , ఇంకా మరిన్ని అధునాతన లగ్జరీ కార్లు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గ్యారేజీలో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, December 21, 2024, 8:30 [IST]
English summary
Ms dhoni driving mercedes benz car here the video
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+