సాక్షికి పెళ్లిరోజు గిఫ్ట్‌గా ఇష్టమైన వింటేజ్ కారు అందించిన ధోని

'మహేంద్ర సింగ్ ధోని' ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపు 16 ఏళ్లు టీమిండియాకు విశేష సేవలందించిన ధోనీ, గతేడాది క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ధోని భారత క్రికెట్ టీమ్ కి సారథ్యం వహించి గొప్ప ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు.

సాక్షికి పెళ్లిరోజు గిఫ్ట్‌గా ఇష్టమైన వింటేజ్ కారు అందించిన ధోని; వివరాలు

మహేంద్ర సింగ్ ధోనికి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో, కార్లు మరియు బైకులంటే కూడా చాలా ఇష్టం. ఈ ఇష్టంతోనే ధోనికి ఒక గ్యారేజ్ కూడా ఉంది. ధోని గ్యారేజ్ గురించిన సమాచారం మనం ఇదివరకటి కథనాల్లోనే తెలుసుకున్నాం, ఇందులో అతనికి ఎంతగానో ఇష్టమైన కార్లు, బైకులు ఉన్నాయి.

సాక్షికి పెళ్లిరోజు గిఫ్ట్‌గా ఇష్టమైన వింటేజ్ కారు అందించిన ధోని; వివరాలు

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరియు సాక్షి సింగ్ యొక్క వెడ్డింగ్ యానివెర్సరీ జులై 04 న జరుపుకున్నారు. ఈ సందర్భంగా ధోని సాక్షికి ఒక అపురూపమైన గిఫ్ట్ అందించాడు. ప్రేమించి పెళ్లితో ఒక్కటైన ఈ జంట వివాహ బంధానికి పదేళ్లు పూర్తయింది. ప్రస్తుతం ఈ జంట హిమాచల్‌ ప్రదేశ్‌లో తమ పెళ్లి రోజును జరుపుకున్నారు.

సాక్షికి పెళ్లిరోజు గిఫ్ట్‌గా ఇష్టమైన వింటేజ్ కారు అందించిన ధోని; వివరాలు

ధోని తన భార్య సాక్షికి పెళ్లి రోజు గిఫ్ట్ గా ఎంతో ఇష్టమైన వింటేజ్‌ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. ధోని ఇచ్చిన ఈ వింటేజ్ కారుని మీరు ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. లైట్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న ఈ కారు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

సాక్షికి పెళ్లిరోజు గిఫ్ట్‌గా ఇష్టమైన వింటేజ్ కారు అందించిన ధోని; వివరాలు

టీమిండియా‌ మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన విషయం అందరికి తెలిసిందే. అంతర్జాతీయ కెరీర్‌లో ధోనీ 90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4876 పరుగులు సాధించిన విషయం కూడా క్రికెట్ అభిమానులకు తెలుసు.

సాక్షికి పెళ్లిరోజు గిఫ్ట్‌గా ఇష్టమైన వింటేజ్ కారు అందించిన ధోని; వివరాలు

రిటైర్ దగ్గర నుంచి ధోని తన ఫామ్ హౌస్ లో భార్య సాక్షి, తన కూతురు జీవాలతో సరదాగా గడిపేస్తున్నాడు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు మరియు వీడియోలు కూడా గతంలో చాలా వైరల్ అయ్యాయి. ధోని సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరు, కానీ తన భార్య సాక్షి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ధోనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు కూడా ఈమె షేర్ చేస్తూ ఉంటుంది.

సాక్షికి పెళ్లిరోజు గిఫ్ట్‌గా ఇష్టమైన వింటేజ్ కారు అందించిన ధోని; వివరాలు

ధోని గిఫ్ట్ గా ఇచ్చిన కారు పాత మోడల్ కి చెందినదైనప్పటికీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా మరియు చాలా కొత్తగా కనిపిస్తుంది. డ్యూయెల్ టోన్ లో ఉన్న ఈ కారు అద్భుతంగా ఉంది. క్రికెట్ రంగంలో తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్న ధోని, ఇప్పుడు హాయిగా ఫ్యామిలీతో గడిపేస్తున్నారు.

Most Read Articles

English summary
Dhoni Presents Favorite Vintage Car As A Wedding Gift To Sakshi. Read in Telugu.
Story first published: Monday, July 5, 2021, 11:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X