ఖరీదైన మెర్సిడెస్‌ బెంజ్‌ GLS కారులో ‘ఎంఎస్‌ ధోనీ'.. ఈ వీడియో చూస్తే ధోనీకి సెల్యూట్‌ చేస్తారు.!!

టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ (MS Dhoni).. పరిచయం అక్కర్లేని వ్యక్తి. మిస్టర్‌ కూల్‌ ధోనీ ఎక్కడికి వెళ్లినా ఆయనకు అభిమానుల తాకిడి ఎక్కువే ఉంటుంది. అయితే ధోనీకి కార్లు, బైక్స్‌ అంటే మహా పిచ్చి. సమయం దొరికనప్పుడల్లా తన స్వస్థలం రాంచీ వీధుల్లో కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా రైడ్‌కు వెళ్తుంటారు.

ప్రస్తుతం ఎంఎస్‌ ధోనీకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్(Viral Video) అవుతోంది. ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంఘటన జరిగింది. అభిమానులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. వీడియోలో ధోనీ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు రావడం, బయటకు వచ్చాక కారు ఎక్కడం మనం చూడవచ్చు.

MS-Dhoni-Seatbelt

అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. కారు ఎక్కిన తర్వాత ధోనీ(MS Dhoni Viral Video) చేసిన ఓ పని అందరినీ ఆకర్షిస్తోంది. ఈ వీడియోలో మిస్టర్‌ కూల్‌ కారు ఎక్కిన వెంటనే సీట్ బెల్ట్ ధరించారు. ధోనీ చేసిన ఈ పని నిజంగా మెచ్చుకోదగ్గ విషయం.. కార్లో ప్రయాణించేవారు ఇది తప్పనిసరిగా పాటించాల్సిన విషయం. అందుకే అందరికీ ధోనీ ఇన్‌స్పిరేషన్‌.

దేశంలో కారులో ప్రయాణించే చాలా మంది సీటు బెల్టు(Seat Belts)లు ధరించరనేది వాస్తవం. సీట్‌ బెల్ట్‌ ధరించడం ద్వారా ప్రమాదానికి గురైన సందర్భంలో ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. అందుకే ఇక్కడ ధోనీ చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే మిస్టర్‌ కూల్‌ Mercedes-Benz GLS కారులో ప్రయాణిస్తూ కూడా అందరి దృష్టిని ఆకర్షించారు.

MS-Dhoni-Seatbelt

ప్రస్తుతం మెర్సిడెస్‌ బెంజ్‌ జీఎల్‌ఎస్‌ కారు ఇండియన్ మార్కెట్లో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి 400d 4MATIC మరియు మేబ్యాచ్‌ 600 4MATIC. 400T 4 మ్యాటిక్ వేరియంట్‌లో 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను పొందుపరిచారు. దీని ధర అక్షరాలు రూ. 1.31 కోట్లు.

మరోవైపు, మేబ్యాచ్‌ 600 4 మ్యాటిక్ వేరియంట్‌లో 4.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ని అమర్చారు. ఈ వేరియంట్ ధర రూ.2.96 కోట్లుగా ఉంది. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్. ఆన్-రోడ్ ధర ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ధోనీ ఏ వేరియంట్‌లో డ్రైవ్ చేశాడనేది స్పష్టంగా తెలియదు. వీడియోలో కారు భాగాలు పాక్షికంగా మాత్రమే కనిపించడంతో, వేరియంట్‌ను గుర్తించడం కష్టం.

MS-Dhoni-Seatbelt

ధోనీకి వింటేజ్ కార్లు, బైకులన్నా చాలా ఇష్టం. రాంచీలో ఆయన నివాసంలోని గ్యారేజీలో ఎన్నో రకాల బైక్, కార్ల మోడల్స్ ఉన్నాయి. వాటిని చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవడం ఖాయం. సమయం చిక్కినప్పుడల్లా ఒక్కో వింటేజ్ కారులో ఆయన బయటకు వస్తూ అభిమానులను అలరిస్తుంటారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, September 21, 2023, 21:21 [IST]
English summary
Ms dhoni is spotted in mercedes benz gls at mumbai airport and wear seat belt
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+