కూతురితో కలిసి బైక్ పై ప్రయాణించిన మహేంద్ర సింగ్ ధోని

కరోనా వైరస్ వ్యాపించడం వల్ల ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. భారతదేశంలో కూడా రెండవ దశ లాక్ డౌన్ అమలులో ఉంది. 2020 మే 03 వరకు భారతదేశంలో లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఈ లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్ డౌన్ వల్ల ప్రజలందరూ తమ కుటుంబాలతో గడుపుతున్నారు.

కూతురితో కలిసి బైక్ పై ప్రయాణించిన మహేంద్ర సింగ్ ధోని

భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన లగ్జరీ ఫామ్‌హౌస్‌లో తన కుటుంబంతో గడుపుతున్నాడు. ఎందుకంటే లాక్ డౌన్ వల్ల మ్యాచ్ లన్నీ వాయిదా పడ్డాయి. ధోని తన ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేస్తున్నాడు. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

కూతురితో కలిసి బైక్ పై ప్రయాణించిన మహేంద్ర సింగ్ ధోని

ఎంఎస్ ధోని చేసిన ఒక వీడియో ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ధోని తన కుమార్తె జివాతో కలిసి తన యమహా ఆర్డీ 350 బైక్ పై వెళ్తున్నాడు. ఈ వీడియోను అతని భార్య సాక్షి ధోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

MOST READ:టయోటా ల్యాండ్ క్రూయిజర్ డూప్లికేట్ మోడల్ కారుని తయారుచేసిన చైనా కంపెనీ

కూతురితో కలిసి బైక్ పై ప్రయాణించిన మహేంద్ర సింగ్ ధోని

ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు మిలియన్ల మంది వీక్షించారు. కొన్ని సంవత్సరాల క్రితం ధోని తన యమహా ఆర్డీ 350 బైక్‌ను అప్డేట్ చేశారు. ధోని దగ్గర ఉన్న కొన్ని పాత బైక్‌లలో యమహా ఆర్డీ 350 బైక్ కూడా ఒకటి. ధోని రాంచీలోనే బిర్సా ముండా క్రికెట్ స్టేడియం వెలుపల ఈ బైక్ మీద చాలాసార్లు కనిపించాడు.

కూతురితో కలిసి బైక్ పై ప్రయాణించిన మహేంద్ర సింగ్ ధోని

కొన్ని వారాల క్రితం ధోని తన స్వస్థలమైన రాంచీలో హార్లే-డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ బైక్ నడుపుతున్నాడు. ఎంఎస్ ధోని దగ్గర యమహా ఆర్డి 350, డుకాటీ 1098, కవాసకి నింజా జెడ్‌ఎక్స్ -14 ఆర్ వంటి బైక్‌లు ఉన్నాయి. ధోని అనేక లగ్జరీ కార్లు మరియు బైక్‌లను కూడా కలిగి ఉన్నారు.

MOST READ:డ్యూటీలో ఉన్న హోమ్ గార్డ్ ని అవమానించిన వ్యవసాయాధికారి, చివరికి ఏమైందంటే..?

కూతురితో కలిసి బైక్ పై ప్రయాణించిన మహేంద్ర సింగ్ ధోని

కవాసాకి నింజా హెచ్ 2 మరియు కాన్ఫెడరేట్ ఎక్స్ 132 హెల్ క్యాట్ ధోని బైక్ సేకరణలో ఫ్యామస్ బైకులు. కవాసకి నింజా హెచ్ 2 బైక్‌ను కొనుగోలు చేసిన తొలి భారతీయుడు ధోని.

కూతురితో కలిసి బైక్ పై ప్రయాణించిన మహేంద్ర సింగ్ ధోని

ఈ బైక్ 2015 లో ధోనికి డెలివరీ చేయబడింది. ధోనికి యమహా ఆర్డీ 350 బైక్ అంటే చాలా ఇష్టం. అతను ఈ బైక్ కోసం కేరళలోని త్రిశూర్ వెళ్ళాడు. ఈ బైక్‌ను కేవలం 4,500 రూపాయలకు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.

MOST READ:కరోనా లాక్‌డౌన్ : చెల్లెలి కోసం 85 కి.మీ సైకిల్ పై వెళ్లిన అన్న

కూతురితో కలిసి బైక్ పై ప్రయాణించిన మహేంద్ర సింగ్ ధోని

యమహా ఆర్డీ 350 లో 2-స్ట్రోక్ 350 సిసి ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 30.5 బిహెచ్‌పి శక్తి మరియు 32.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది మరియు ఈ బైక్ బరువు 155 కిలోల వరకు ఉంటుంది.

Most Read Articles

English summary
MS Dhoni rides his Yamaha RD350 with daughter Ziva as pillion. Read in Telugu.
Story first published: Thursday, April 23, 2020, 13:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X