మరోసారి 1970 నాటి వింటేజ్‌ కారులో రోడ్డుపై కనిపించిన MS ధోనీ.. వైరల్ అవుతున్న వీడియో

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కార్లన్నా, బైకులన్నా మహా క్రేజ్‌. ఈ విషయం ఆయన గ్యారేజ్‌ను చూస్తే అర్థమవుతుంది. రాంచీలోని తన ఫాంహౌస్‌లో ఉన్న గ్యారేజ్‌ని చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. ధోనీ గ్యారేజ్‌లో విభిన్న రకాల మోడల్‌ల బైక్‌లతో పాటు వింటేజ్‌ కార్లూ ఉన్నాయి.

తను మొదటి సారి వాడిన బైక్‌ నుంచి.. అధునాతన ఫీచర్లు ఉన్న రోల్స్‌ రాయిస్‌ వరకు ప్రతి వాహనం ధోనీ గ్యారేజ్‌లో ఉండాల్సిందే. ఇటీవల మిస్టర్‌ కూల్‌ గ్యారేజ్‌ని సందర్శించిన మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ అక్కడ ఉన్న మోడల్స్‌ను చూసి ఆశ్చర్యపోయారు. అసలు ఇన్ని వాహనాలు షోరూంలో కూడా ఉండవని నోరెళ్లబెట్టారు.

MS-Dhoni-Iconic-Muscle-Cars

ధోనీ వద్ద ఉన్న అనేక రకాల విలాసవంతమైన కార్లలో ప్రఖ్యాత రోల్స్‌ రాయిస్‌ కారు చాలా ప్రత్యేకం. ఇటీవల రాంచీ వీధుల్లో రోల్స్‌ రాయిస్‌ కారులో ధోనీ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరలైంది. ఆయన అభిమానులే ఆ వీడియోను పోస్ట్‌ చేశారు. తాజాగా 1973 నాటి ప్రఖ్యాత పోంటియాక్‌ ట్రాన్స్‌ యామ్‌ కారులో ధోనీ చక్కర్లు కొట్టిన వీడియో వైరల్‌గా మారింది.

రాంచీ వీధుల్లో ఎరుపు రంగు పోంటియాక్‌ ట్రాన్స్‌ యామ్‌ SD - 455 మోడల్‌ కారులో ధోనీ రయ్‌మంటూ దూసుకుపోతున్న వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఐకానిక్‌ మజిల్‌ కారులో ధోనీ కనిపించడం అభిమానులకు ఫుల్‌ జోష్‌నిచ్చింది. ఎరుపు రంగు పోంటియాక్‌ ట్రాన్స్‌ యామ్‌ 5డీ-455 మోడల్‌ కారులో కళ్లకు అద్దాలు పెట్టుకొని టీ షర్ట్‌తో దూసుకెళ్తున్న ధోనీ వీడియో వైరల్‌గా మారింది.

MS-Dhoni-Iconic-Muscle-Cars

వీడియోను చూసినట్లయితే ధోనీ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ చేస్తున్నట్లుగా కనబడుతోంది. ధోని తన అరుదైన కారులో తన స్వగ్రామంలో చక్కర్లు కొట్టారు. కాగా ఈ కారుపై మహారాష్ట్ర నంబర్ ప్లేట్ ఉంది. ఖాళీ సమయాల్లో రాంచీలోని తన వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్‌తో పొలం దున్నుతూ కనిపించే ధోనీ.. తాజాగా వింటేజ్‌ కారులో రయ్‌రయ్‌న దూసుకెళ్తూ కనిపించడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు.

ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని రకాల ఫార్మాట్‌లకు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. అప్పటి నుంచి ధోనీ అరుదైన వింటేజ్‌ కార్లను సేకరిస్తూ తన క్లాసిక్ కార్ గ్యారేజ్‌ని పరిధిని పెంచుతున్నారు. వారం రోజుల క్రితం కూడా మిస్టర్‌ కూల్‌ రాయల్‌ బ్లూ వింటేజ్‌ కారులో రాంచీ రోడ్లపై చక్కర్లు కొట్టి అభిమానులకు కనువిందు చేశారు.

ఈ వీడియోను పలువురు సోషల్ మీడియా సైట్లలో అభిమానులు షేర్ చేశారు. ఈ వీడియోకు వేలల్లో లైక్‌లు రాగా చాలామంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ధోని నిజమైన కారు, బైక్ లవర్ అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ధోనీ రాంచీలో ఇలా పాతకాలపు కారు నడపడం వారంలో ఇది రెండోసారి.

ధోని గ్యారేజ్‌లో ఉన్న టాప్‌ కార్లను పరిశీలిస్తే.. ఫెరారీ 599 జీటీవో ప్రత్యేకమైనది. ఇది ఫెరారీ తయారు చేసిన లిమిటెడ్ ఎడిషన్ కార్లలో ఒకటి. మరో కారు జీప్‌ గ్రాండ్‌ చెరోకీ హాక్‌ట్రాక్‌.. రగ్డ్ నెస్, పెర్ఫార్మెన్స్ రెండిటినీ పర్‌ఫెక్ట్‌గా మిక్స్ చేయడంలో జీప్ గ్రాండ్ చెరోకీ హాక్‌ట్రాక్ ముందంజలో ఉంది. ఈ కారును మనదేశంలో కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి ధోనినే.

పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ ఏఎం.. ఇది ఒక వింటేజ్ కారు. 1967 నుంచి 2002 మధ్య ఈ కారును రూపొందించారు. క్లాసిక్ అమెరికన్ స్టైలిష్ కారు ఇదని చెప్పవచ్చు. చరిత్రలో ఉన్న మోస్ట్ ఐకానిక్ మజిల్ కార్లలో ఇది కూడా ఒకటి. వింటేజ్ కార్లు అంటే ధోనికి ఎంత ఇష్టమో ఈ కారును చూస్తే అర్థమవుతుంది.

ధోనీ వద్ద కేవలం పవర్ ఫుల్ వాహనాలు మాత్రమే కాకుండా చరిత్రకు సంబంధించిన వాహనాలు కూడా ఉన్నాయి. భారత సైనిక దళాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నిస్సాన్ జోంగా కూడా మహేంద్ర సింగ్ ధోని గ్యారేజ్‌లో ఉంది. నిస్సాన్ జోంగా అనేది కేవలం కారు మాత్రమే కాదు. మనదేశంలో చరిత్రకు ఒక చిహ్నం.

రోడ్డుపై హమ్మర్‌ను ఛాలెంజ్ చేయాలంటే అది కేవలం కొన్ని వాహనాలకు మాత్రమే సాధ్యం అవుతుంది. అలాంటి కెపాసిటీ ఉన్న హమ్మర్ కూడా మన ధోని గ్యారేజ్‌లో ఉంది. పవర్, డామినెన్స్, ఆఫ్ రోడ్ సామర్థ్యం ఇందులో ఉన్నాయి. ధోనికి వింటేజ్‌ కార్లంటే ఎంతో ఇష్టమో ఈ టాప్‌ 5 కార్లను చూస్తేనే అర్థమవుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 3, 2023, 9:15 [IST]
English summary
Ms dhoni spotted driving 1973 pontiac trans am sd 455 video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+