రాంచీలో సూపర్‌బైక్ షోరూమ్‌ను ఓపెన్ చేయనున్న ధోనీ

By Ravi

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సూపర్‌బైక్‌లు అంటే చాలా ఇష్టమన్న సంగతి మనందరికీ తెలిసినదే. ధోనీ తన సూపర్‌బైక్ ప్యాషన్‌ను ఇప్పుడు కొత్త మార్గంలో చూపించనున్నాడు. అదేంటంటే, ఎమ్ఎస్ ధోనీ ఇప్పుడు తన స్వగ్రామం రాంచీలో ఓ సూపర్‌బైక్ షోరూమ్‌ను ప్రారంభించనున్నాడట.

అంతేకాకుండా, ఎమ్ఎస్ ధోనీ రాంచీలో ఓ షాపింగ్ మాల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ షాపింగ్ మాల్ కోసం ప్లాన్ కూడా సిద్ధమైంది, దీని అనుమతుల కోసం అతను మున్సిపల్ కార్పోరేషన్‌ను ఆశ్రయించినట్లు సమాచారం.

MS Dhoni

మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ధోనీ ఓ షాపింగ్ కాంప్లెక్స్‌ను రిజిస్టర్ చేయించి, బోర్ వెల్ కోసం అనుమతి కోరారరని, అందుకు కావల్సిన అనుమతులను తాము మంజూరు చేశామని వారు తెలిపారు.

రాంచీలోని హైదల్ ప్రాంతంలో ఓ 10 అంతస్థుల షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు ధోనీ ప్లాన్ చేస్తున్నారు. ఇదే కాంప్లెక్స్ లోనే ధోనీ ఓ సూపర్‍‌బైక్ షోరూమ్‌ను కూడా ప్రారంభించనున్నారు. ధోనీ వద్ద ఇప్పటికే దాదాపు 28కి పైగా సూపర్‌బైక్‌లు ఉన్నట్లు సమాచారం.

More from DriveSpark

Article Published On: Tuesday, June 17, 2014, 11:07 [IST]
English summary
Indian cricket captain Mahendra Singh Dhoni is planning to open a super bike showroom in his hometown Ranchi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+