అంబానీ గ్యారేజిలో చేరిన మరో ఖరీదైన లగ్జరీ కారు.. ఇది కూడా అదే బ్రాండ్ కారు
భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థకు అధ్యక్షుడు 'అంబానీ' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబం మరియు అత్యంత ఖరీదైన కార్లు కలిగిన కుటుంబం కూడా. ఇప్పటికే అంబానీ కుటుంబం రోల్స్ రాయిస్ వంటి అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. అయితే ఇటీవల మరో లగ్జరీ కారు అంబానీ గ్యారేజిలోకి చేరింది. దీని గురించి పూర్తి సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ముఖేష్ అంబానీ యొక్క కొత్త 'బెంట్లీ బెంటైగా' (Bentley Bentayga) తెలుపు రంగులో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది అంబానీ ఫ్యామిలిలో చేరిన మూడవ బెంట్లీ కారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీరు కూడా ఇందులో ఆ వీడియో చూడవచ్చు.

ఇప్పటికే అంబానీ చాలా తెలుపు రంగు కార్లను కలిగి ఉన్నారు. ఇందులో రోల్స్ రాయిస్ కల్లినన్ కూడా ఉంది. అయితే ఇప్పటికే తన వద్ద ఉన్న బెంట్లీ బెంటైగా కార్లు ఒకటి రేసింగ్ గ్రీన్ కలర్ లో ఉండగా, మరొకటి బ్రౌన్ కలర్ లో ఉంది. ఇవి కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇందులో ఒకటి డబ్ల్యు12 ఇంజిన్ కలిగి ఉండగా మరొకటి వి8 ఇంజిన్ పొందుతుంది.

బెంట్లీ కంపెనీ గత సంవత్సరం వి8 డీజిల్ ఇంజిన్ నిలిపివేసింది. అయితే పెట్రోల్ డబ్ల్యు12 మరియు పెట్రోల్ వి8 ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో బెంట్లీ కంపెనీ వి8 వేరియంట్‌లను మాత్రమే విక్రయిస్తోంది. అంబానీ యొక్క విలాసవంతమైన నివాసమైన 'యాంటిలియా' వద్ద గత సంవత్సరం ఈ ఖరీదైన కార్లు కనిపించాయి. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడవ మూడవ బెంట్లీ కారు అంబానీ ఫ్యామిలిలో చేరిపోయింది.

బెంట్లీ బెంటైగా వి8 పెట్రోల్ వేరియంట్ ధర రూ. 4.10 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇంత ఖరీదైన బెంట్లీ బెంటెగా కారుని భారతదేశంలో డెలివరీని అందుకున్న వారిలో అంబానీ ఒకరు. ఇది చాలా ఆకర్షణీయమైన రేసింగ్ గ్రీన్ షేడ్‌లో పూర్తయింది. అంతే కాకుండా రూ.1 కోటి కంటే ఎక్కువ విలువైన బ్రెయిట్లింగ్ ముల్లినర్ టూర్‌బిల్లాన్ వాచ్‌ని కలిగి ఉన్న భారతదేశంలోని బెంట్లీ కారు కూడా ఇదే. ఇది 6.0-లీటర్ డబ్ల్యు12 పెట్రోల్ ఇంజన్‌తో వచ్చిన బెంటెగా యొక్క టాప్-ఎండ్, హై-పెర్ఫార్మెన్స్ వెర్షన్. ఇది గరిష్టంగా 600 బిహెచ్‌పి పవర్ మరియు 900 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

అంబానీ కుటుంబం ఈ కారును ఎక్కువగా ఉపయోగించలేదని తెలుస్తోంది. కానీ ఆకాష్ అంబానీ చాలా సందర్భాలలో కారు డ్రైవ్ చేస్తూ కనిపించారు. అంబానీ కుటుంబంలో హై-ఎండ్ ఎస్‌యువిలు మాత్రమే కాకూండా, పెర్ఫార్మెన్స్ కార్లు కూడా ఉన్నాయి. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వంటివి కూడా వారి వద్ద ఉన్నాయి.
భారతదేశంలో అత్యంత ఖరీదైన మొదటి బెంట్లీ బెంటైగా డెలివరీ చేసుకున్న అతి తక్కువ కాలంలోనే రెండవ బెంట్లీ బెంటైగాను కూడా డెలివరీ చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే వారికి ఖరీదైన కార్ల పట్ల ఎంత మక్కువ ఉందొ మనకు స్పష్టంగా తెలుస్తోంది. వీటిని ఎక్కువగా అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ వినియోగిస్తారని తెలిసింది. ఈ కారు 4.0-లీటర్ వి8 ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 542 బిహెచ్‌పి పవర్ మరియు 770 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
పారిశ్రామిక రంగంలో పేరుమోసిన అంబానీ కుటుంభం అత్యంత ఖరీదైన నివాస భవనం కలిగి ఉండటమే కాకుండా, ఖరీదైన కార్లను కూడా కలిగి ఉన్నారని మనం గతంలోనే తెలుసుకున్నాము. వీరు మెర్సిడెస్ బెంజ్, రోల్స్ రాయిస్ మొదలైన బ్రాండ్ వాహనాలను కలిగి ఉన్నారు. ఇప్పుడు మరో కొత్త అతిథి కూడా వారి గ్యారేజిలోకి అడుగుపెట్టింది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మరియు కొత్త కార్లు & బైకుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.
Image Courtesy: Automobili Ardent


Click it and Unblock the Notifications








