అంబానీ కాన్వాయ్‌లోకి లగ్జరీ బుల్లెట్, బ్లాస్ట్‌ ప్రూఫ్‌ కారు..పంక్చర్‌ అయినా వెళ్లేలా ప్రత్యేకభద్రతా ఏర్పాట్లు

ప్రపంచంలోని సంపన్నుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అంబానీ ఒకరు. అందువల్ల వారు ప్రయాణించే వాహనాలు చాలా సురక్షితంగా ఉండేలా చూసుకుంటారు. అంబానీ నివాసం ప్రాంతం సహా కార్యాలయం వద్ద అత్యంత భద్రత ఉంటుంది. దేశంలో అత్యంత భద్రతా ముప్పును ఎదుర్కొంటున్నవారిలో అంబానీ ఒకరు. ఫలితంగా వారి ప్రయాణానికి ప్రత్యేక భద్రత కలిగిన కార్లను ఎంచుకుంటారు.

అయితే తాజాగా అంబానీ కాన్వాయ్‌లోకి కొత్తగా మరో కారు వచ్చి చేరింది. మెర్సిడెస్‌ బెంజ్‌ S680 సెడాన్‌ కారును కొనుగోలు చేశారు. ఇది అంబానీ గ్యారేజీలో ఉన్న ఏడో బుల్లెట్‌ ప్రూఫ్‌ మెర్సిడెస్‌ ఫ్లాగ్‌షిప్‌ సెడాన్‌. ఈ ప్రత్యేకమైన కారు గోల్డెన్‌ కలర్‌ను కలిగి ఉంది. ఈ వాహనం ఫోటోలు ఇటీవల వైరల్‌ అయ్యాయి.

Mukesh ambani convoy added with gold colour benz

ఈ కారు చివరన 999 నంబర్‌ను కలిగి ఉంది. ఈ కారు కోసం అంబానీ సుమారు రూ.10 కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. ఈ కారు S- Guard VR10 స్థాయి రక్షణ ఇస్తుంది. ఈ కారు బాడీ ప్రత్యేక స్థాయి ఉక్కుతో తయారు చేయబడింది. ఈ కారుకు అదనపు భద్రతను ఇస్తుంది. ఇది S- క్లాస్‌ మోడల్‌కు చెందినది.

మెర్సిడెస్‌ బెంజ్‌ S680 గార్డ్‌ లగ్జరీ కారుకు VPAM VR 10 సర్టిఫికేషన్‌ కూడా లభిస్తుందని సంస్థ తెలిపింది. ఈ కారు కేవలం బుల్లెట్ ప్రూఫ్‌ మాత్రమే కాకుండా, పేలుడు పదార్ధాలను కూడా తట్టుకుంటుంది. కొత్త S680 గార్డ్‌ బుల్లెట్, బ్లాస్ట్‌ ప్రూఫ్‌ గ్లాస్‌, మల్టీ లేయర్‌ నిర్మాణం, స్ప్లింటర్‌ రక్షణ కోసం పాలీకార్పోనేట్‌ లేయర్‌లున్నాయి. ఈ సెడాన్‌లోని గ్లాసుల పరిమాణం 3.5 నుంచి 4 అంగుళాలు ఉంటుంది.

Mukesh ambani convoy added with gold colour benz

మెర్సిడెస్‌ బెంజ్‌ S680 గార్డ్‌ లగ్జరీ భారీ V12 ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 612bhp మరియు గరిష్ఠంగా 830Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతోపాటు ఈకారు ఆల్‌వీల్‌ డ్రైవ్‌ టెక్నాలజీతో వస్తుంది. దీంతోపాటు ఈ కారు ప్రత్యకమైన టైర్లను కలిగి ఉంటుంది. పంక్చర్‌ అయినా కూడా సుమారు 30 కి.మీ వేగంతో ప్రయాణం చేసేలా డిజైన్‌ చేశారు.

అంబానీ కాన్వాయ్‌లోని భద్రతా సిబ్బందికి కూడా లగ్జరీ వాహనాలను వినియోగిస్తారు. రోల్స్‌ రాయిస్‌ కల్లినన్‌, ల్యాండ్‌ రోవర్‌, మెర్సిడెస్‌ AMG G63, టయోటా ఫార్య్చునర్‌, MG గ్లోస్టర్ సహా అనేక కార్లు ఉన్నారు. అంబానీ కాన్వాయ్‌లో సుమారు రూ.30 కోట్ల విలువైన వాహనాలు ఉన్నాయి. తాజా వాహనంతో కలిపి అంబానీ కాన్వాయ్‌లో 7 బుల్లెట్ ప్రూఫ్‌ కార్లు ఉన్నాయి.

Mukesh ambani convoy added with gold colour benz

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Monday, September 25, 2023, 11:36 [IST]
English summary
Mukesh ambani convoy added with gold colour mercedes benz s680 guard luxury sedan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+