ముఖేష్ అంబానీ ఇంట టైర్లు మోపిన రెండవ రోల్స్ రాయిస్ కార్: వీడియో

భారతదేశపు అపర కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కుటుంబం, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేసింది. అంబానీ ఇంట ఇది రెండవ రోల్స్ రాయిస్ బ్రాండ్ కారు.

ముఖేష్ అంబానీ ఇంట టైర్లు మోపిన రెండవ రోల్స్ రాయిస్ కార్: వీడియో

ఈసారి రోల్స్ రాయిస్ కల్లినన్ కారును ముఖేష్ అంబానీ ఫ్యామిలీ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇంతకుముందు 2019లో ముఖేష్ అంబానీ కుటుంబం ఓ రోల్స్ రాయిస్ కల్లినన్ కారును కొనుగోలు చేసింది.

ముఖేష్ అంబానీ ఇంట టైర్లు మోపిన రెండవ రోల్స్ రాయిస్ కార్: వీడియో

ముఖేష్ అంబానీ ఫ్యామిలీ మొదట కొనుగోలు చేసిన తొలి రోల్స్ రాయిస్ కల్లినన్ కారు కొత్త చాపెల్ రంగులో పెయింట్ చేయబడి ఉంటుంది. కాగా, తాజాగా వారు కొనుగోలు చేసిన రెండవ రోల్స్ రాయిస్ కల్లినన్ కారును ఆర్కిటిక్ వైట్ కలర్‌లో పెయింట్ చేయబడి ఉంది.

ఇప్పటి వరకూ పాత చాపెల్ కలర్ రోల్స్ రాయిస్ కల్లినన్ కారులో తిరుగుతూ కనిపించిన ముఖేష్ అంబానీ ఫ్యామిలీ, తాజాగా తమ కొత్త వైట్ కలర్ రోల్స్ రాయిస్ కల్లినన్‌లో ప్రయాణిస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఓ యూట్యూబ్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది.

ముఖేష్ అంబానీ ఇంట టైర్లు మోపిన రెండవ రోల్స్ రాయిస్ కార్: వీడియో

ముంబైలోనే అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన ఆంటిలియా నివాసంలో ముఖేష్ అంబానీ కుటుంబం నివిసిస్తున్న సంగతి తెలిసినదే. ఈ కొత్త రెండవ రోల్స్ రాయిస్ కల్లినన్ కారు కూడా అదే ఇంటిలో ప్రత్యక్షమైంది. ప్రపంచ మార్కెట్లో రోల్స్ రాయిస్ కల్లినన్ అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ ఎస్‌యూవీ.

ముఖేష్ అంబానీ ఇంట టైర్లు మోపిన రెండవ రోల్స్ రాయిస్ కార్: వీడియో

రోల్స్ రాయిస్ కల్లినన్ కారు శక్తివంతమైన 6.8-లీటర్ వి12 టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 560 బిహెచ్‌పి శక్తిని, 850 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ముఖేష్ అంబానీ ఇంట టైర్లు మోపిన రెండవ రోల్స్ రాయిస్ కార్: వీడియో

ఈ ఆల్ట్రా లగ్జరీ కారులో 4x4 డ్రైవ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇందులో ఆఫ్-రోడ్ పరిస్థితులకు అనుగుణంగా అనేక డ్రైవింగ్ సాంకేతికతలు కూడా ఉంటాయి. నిజానికి ఆఫ్-రోడ్ ప్రయాణాల కోసం ఎవరైనా ఇంతటి విలాసవంతమైన కారును ఉపయోగిస్తారా అనేది ఆలోచించాల్సిన విషయం.

ముఖేష్ అంబానీ ఇంట టైర్లు మోపిన రెండవ రోల్స్ రాయిస్ కార్: వీడియో

రోల్స్ రాయిస్ విడుదల చేసిన మొదటి ఎస్‌యూవీ కల్లినన్. సాధారణంగా మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7 కోట్ల వరకూ ఉంటుంది. అయితే, రోల్స్ రాయిస్ ఈ కార్లను పూర్తిగా చేతుల్తోనే తయారు చేస్తుంది. అంతేకాకుండా, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వీటిని కస్టమైజ్ చేసిస్తుంది.

ముఖేష్ అంబానీ ఇంట టైర్లు మోపిన రెండవ రోల్స్ రాయిస్ కార్: వీడియో

నిజానికి, ఇలాంటి కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు (ధనవంతులు) స్టాక్ మోడళ్లను కొనుగోలు చేయరు. వారి అభిరుచికి తగినట్లుగా ఇంటీరియర్లను మోడిఫై చేయించుకుంటూ ఉంటారు. ఫలితంగా ఈ కార్ ధర స్టాక్ మోడల్ ధర కన్నా అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో, అంబానీ ఫ్యామిలీ కొనుగోలు చేసిన ఈ కార్ ధర ఎంత ఉండొచ్చదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

More from DriveSpark

Article Published On: Sunday, January 17, 2021, 9:00 [IST]
English summary
Mukesh Ambani Family Brought Second Rolls Royce Cullinan SUV - Video. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+