ఆర్డినరీ కారులో అంబానీ అల్లుడు.. ఆ కారు ధర కేవలం రూ. 46 లక్షలు మాత్రమే.. అందేంటి ఆశ్చర్యపోతున్నారా?

ప్రస్తుతం అంబానీ కుమారుడి పెళ్లి వైభవంగా జరుగుతోంది. అంబానీ పెళ్లి వైపు యావత్‌ దేశంతో పాటు ప్రపంచం మొత్తం చూస్తుంది. దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ పెళ్లికి హాజరయ్యేందుకు వస్తున్న కోటీశ్వరులు, సినీ ప్రముఖులు, పొలిటీషియన్స్‌తో ముంబయి ఎయిర్‌పోర్ట్‌ కిక్కిరిసి పోతుంది. దేశంలోని సెలబ్రిటీలు ఈ పెళ్లికి వచ్చేందుకు ప్రత్యేక విమానాలను సైతం అంబానీ కుటుంబం ఏర్పాటు చేసింది. ఈ రోజు (జులై 12) పెళ్లి జరగబోతోంది. ఈ పెళ్లికి గత నెల రోజులుగా ముంబయిలో పండుగ వాతావరణం నెలకొంది. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహంతో ముంబయి లోని చాలా మంది కార్యాలయ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడానికి అనుమతించారు.

ఈ పెళ్లి ఎఫెక్ట్‌తో ఏకంగా వర్క్‌ఫ్రమ్‌ హోమ్ ‌అవకాశం ఇచ్చారంటే ఏ స్థాయిలో ముంబయి మహా నగరం సెలిబ్రిటీలతో నిండిపోయి ఉందో అర్థం చేసుకోవచ్చు. పెళ్లికి వచ్చే సంపన్నుల కార్లను పార్క్ చేసేందుకు పెద్ద ఎత్తున స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. జూన్‌లో గుజరాత్‌లోని అంబానీ కుటుంబం స్వగ్రామంలో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి.

Mukesh-Ambani-Son-In-Law-Toyota-Carmy

నెల రోజుల ముందే జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్‌లో చాలా మంది సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఆ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో పాల్గొనేందుకు ముఖేష్ అంబానీ అల్లుడు ఇషా అంబానీ భర్త ఆనంద్ పిరమల్ ఖరీదైన టయోటా కారులో వచ్చారు. ఆనంద్ పిరమల్ టయోటా క్యామ్రీ సెడాన్ కారును ఉపయోగించి అంబానీ కుటుంబంలో జరిగిన ఈ వేడుకకు హాజరయ్యారు.

అంబానీ కుటుంబం తరచుగా తమ కార్ల వెనుక సీట్లలో కూర్చోవడానికి ఇష్టపడుతుంది. అయితే ఆ సమయంలో తీసిన వీడియోలో ఆనంద్ పిరమల్ తన టయోటా క్యామ్రీ ముందు సీటు నుంచి బయటకు వచ్చాడు. ఆనంద్ పిరమల్ టయోటా క్యామ్రీలో బహిరంగంగా కనిపించడం ఇది మొదటిసారి కాదు. కొన్నేళ్ల క్రితం ఈ జంట తమ బ్లాక్ టయోటా క్యామ్రీలో రెస్టారెంట్‌లకు షాపింగ్స్‌కి వెళ్తూ కనిపించాడు.

Anand-Piramal-Toyota-Carmy

అయితే ఇప్పుడు ఆనంద్ పిరమల్ వైట్ టయోటా క్యామ్రీలో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌కి హాజరవ్వడం షాక్‌కి గురిచేస్తుంది. తన భార్యతో కలిసి పాత తరం టయోటా క్యామ్రీ కారులో వేదిక వద్దకు వచ్చారు. మహీంద్రా XUV500, ఎంజీ గ్లోస్టర్, ల్యాండ్ రోవర్ డిస్కవరీ కార్లు వారి కారు ముందు వెనుక ఉన్నాయి.

ఇదే కాన్వాయ్‌లో రోల్స్ రాయిస్ కల్లినన్ కూడా ఉంది. అయితే ఆనంద్‌ పిరమల్‌ అల్ట్రా లగ్జరీ కారుకు బదులుగా టయోటా క్యామ్రీలో ఇషా, ఆనంద్ పిరమల్ వచ్చిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. వీరి వద్ద ఉన్న ల్యాండ్ రోవర్ డిస్కవరీ, రోల్స్ రాయిస్ కార్లతో పోలిస్తే టయోటా క్యామ్రీ అంత ఖరీదైనది కాదు.

కానీ టయోటా నుంచి అమ్ముడవుతున్న అత్యంత ఖరీదైన కార్లతో పోలిస్తే క్యామ్రీ అత్యధిక ధరను కలిగి ఉంది. టయోటా క్యామ్రీకి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. కానీ ఇండియాలో మాత్రం ఈ కారును ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.46.17 లక్షలుగా ఉంది.

వాస్తవానికి రూ.50 లక్షల విలువైన కార్లు అంబానీ కుటుంబంలో చాలా తక్కువ ఉంటాయి. వారు కోట్ల రూపాయల్లో సొంత సెక్యూరిటీ వాహనాలను కొనుగోలు చేస్తారు. కానీ ఆనంద్ పిరమల్ టయోటా క్యామ్రీని ఉపయోగిస్తుండటంతో ఏదైనా సెంటిమెంట్‌గా ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. ఎంతైనా అంబానీ అల్లుడు అంత తక్కువ ఖరీదైన కారులో రావడం కూడా ఇప్పుడు ఓ వైరల్‌ వార్తగా నిలిచింది.

More from DriveSpark

Article Published On: Friday, July 12, 2024, 14:23 [IST]
English summary
Mukesh ambani son in law anand piramal attended anant ambani pre wedding event in toyota carmy
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+