Ambani Convoy: అంబానీ Z+ సెక్యూరిటీ కార్ల ధర అక్షరాల రూ.30 కోట్లు..!

భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీ అతని కుటుంబం Z+ సెక్యూరిటీని కలిగి ఉంది. కొన్నేళ్లుగా, అంబానీ కుటుంబం తమ సెక్యూరిటీ కార్లను పలు విధాలుగా అప్‌గ్రేడ్ చేసింది. అంబానీ కుటుంబానికి చెందిన లగ్జరీ సెక్యూరిటీ కార్లు BMW X5 SUVలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుంతం ల్యాండ్ రోవర్ డిస్కవరీ, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్స్, ఇప్పుడు Mercedes-AMG G63 SUVలుగా అభివృద్ధి చెందాయి.

ప్రస్తుత అంబానీ వినియోగిస్తున్న సెక్యూరిటీ కాన్యాయ్ లు అత్యంత ఖరీదైనవిగా ఉన్నాయి. ఈ సెక్యూరిటీ కార్ల ధర అక్షరాల రూ. 30 కోట్లు!. ఏడు Mercedes-AMG G63 SUVలు, మూడు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ SUVలతో సహా సరికొత్త అంబానీ సెక్యూరిటీ కార్లకు సంబంధించిన వివరాలు మీకోసం.

ముకేశ్ అంబానీ సెక్యూరిటీ

అన్ని హై ఎండ్ కార్లు..
అంబానీ కార్ల కాన్వాయ్‌లు ఎల్లప్పుడూ విలాసవంతమైన, హై-ఎండ్ SUVలను కలిగి ఉంటాయి. ఏడు Mercedes-Benz G63 AMG SUVలతో కూడిన అంబానీ తాజా కాన్వాయ్‌ను వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వీటిలో ఒక్కొక్క కారుకు దాదాపు రూ. 3 కోట్లు వరకు ధర ఉంటుంది. అంటే కాన్వాయ్ మొత్తం ఖర్చు రూ. 21 కోట్లు అన్నమాట.

ఇందులోనూ మూడు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ SUVలు కూడా ఉన్నాయి. ఒక్కో ఎస్‌యూవీ ధర రూ. 2.5 కోట్లు, అంటే మొత్తం ధర దాదాపు రూ.7.5 కోట్లుగు ఉంది. మొత్తంగా చూసుకుంటే అంబానీ కాన్వాయ్ ఖరీదు దాదాపు రూ.30 కోట్లుగా ఉండనుంది. కాన్వాయ్ కి ఈ రేంజ్ లో మెయింటైన్ చేయడం ఒక్క అంబానీకే దక్కుతుంది.

ముకేశ్ అంబానీ కార్లు

మెర్సిడెస్-AMG G63..
2021లో, మెర్సిడెస్-AMG G63 తాజా వెర్షన్ ను ఆ సంస్థ భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇది సంపన్నులు, సెలబ్రిటీలకు అత్యంత పేరొందిన కారుగా గుర్తింపు పొందింది. ఎక్స్-షోరూమ్ లో ఈ కారు ధర రూ. 2.2 కోట్లుగా ఉంది. ఈ కారు ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 3 కోట్లు ఉంటుంది.

ఈ కారు పూర్తి-LED సెటప్‌ను కలిగి ఉంటుంది. టర్న్ సూచికలు హుడ్‌పై ఉండనున్నాయి. అదనంగా, వాహనం టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్‌ను కలిగి ఉంది. భారీ 21-అంగుళాల ఏడు-స్పోక్ అల్లాయ్ వీల్స్‌పై ఈ అధునాతన కారు నడుస్తుంది. ఈ కారు అధునాతన 4.0-లీటర్ బై-టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజన్‌తో ఆధారితమైనది.

ముకేశ్ అంబానీ కార్లు

హై స్పీడ్ కారు..
ఇక కారు పనితీరుని పరిశీలిస్తే 585 Bhp వద్ద 850 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 9-స్పీడ్ AMG SPEEDSHIFTని కలిగి ఉంది, ఈ కారు కేవలం 4.5 సెకన్లలో 100 కి.మీ/గం అందుకుంటుంది. ఈ కారు ఎలక్ట్రిక్ మోడ్ లో ఈ కారు గరిష్ట వేగం 220 కి.మీ లకే పరిమితం చేయబడింది. గంటకు 20 కి.మీ వేగం వద్ద మొదలై ఎలక్ట్రిక్ మోడ్ లోని గరిష్ట వేగాన్ని అందుకుంటుంది.

G63 AMGలకు ముందు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ అంబానీ భద్రతలో వినియోగించే అత్యంత ఖరీదైన వాహనంగా ఉండేది. వాటిలో చాలా కార్లు ఇంకా వాడుకలో ఉన్నాయి. అంబానీ కాన్వాయ్‌లో ఇప్పటికే చాలా రేంజ్ రోవర్‌లు ఉండగా, ఇప్పుడు ఈ కార్లను స్ట్రోబ్ లైట్లు, పోలీసు స్టిక్కర్‌లతో పబ్లిక్ రోడ్లపై మరింత అధికారికంగా కనిపించేలా మారుస్తున్నట్లు తెలుస్తోంది.

ముకేశ్ అంబానీ కార్లు

గ్యారేజీలో ప్రత్యేక కార్లు..
ఈ ప్రత్యేకమైన రేంజ్ రోవర్ కి సంబంధించి కచ్చితమైన వెర్షన్, స్పెసిఫికేషన్‌లు తెలియనప్పటికీ, కొత్త కారు ధర సాధారణంగా రూ. 2 కోట్లు నుంచి రూ. 3.5 కోట్ల మధ్య ఉండే అవకాశం ఉంది. అంబానీ ప్రభావం కుటుంబం ఎదుర్కొనే సెక్యూరిటీల దృష్ట్యా, బుల్లెట్ ప్రూఫ్ కార్లలో ప్రయాణించడాన్ని ఎంచుకోవడంలో ఆశ్చర్యం లేదు. గత సంవత్సరం, అతను కొత్త Mercedes-Benz S600 గార్డ్‌ని కొనుగోలు చేశారు. అలానే BMW 7-సిరీస్ H సెక్యూరిటీ కూడా ఉంది.

భద్రతా-కేంద్రీకృత వాహనాలతో పాటు, అంబానీ గ్యారేజీలో బెంట్లీ బెంటెగా, మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్, మెర్సిడెస్-AMG G63, బెంట్లీ ముల్సాన్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ వంటి విలాసవంతమైన కార్లతో నిండి ఉంది. కయెన్, BMW i8 అనేక ఇతర కార్లు కూడా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, April 4, 2023, 12:27 [IST]
English summary
Mukesh ambani z plus security cars cost and details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+