ముఖేష్ అంబానీ సేవలో ఉన్న భారత పోలీసులకు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

Written By:

ఇండియాలో అత్యంత ధనిక కుటుంబాలలో అంబానీ ఫ్యామిలీది మొదటి స్థానం. అంబానీ కుంటుంబ పెద్దగా వ్యవహరిస్తున్న ముఖేష్ అంబానీ విలాసవంతమైన జీవనశైలి గురించి మనకు ఇదివరకు తెలిసిందే. అయితే ఆయన భద్రత కోసం విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల కోసం విలాసవంతమైన లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. దీనికి గురించి ఆన్‌లైన్ చర్చా వేదికలో అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరింత సమాచారం ఇవాళ్టి స్టోరీలో చూద్దాం రండి...

To Follow DriveSpark On Facebook, Click The Like Button
పోలీసులకు ముఖేష్ అంబానీ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

ముఖేష్ అంబానీ మరియు ఆయన కుటుంబం ఇప్పుడు అతి ముఖ్యమైన జడ్ ప్లస్ కెటగిరీ భద్రతా వలయంలో ఉన్నారు. భారత ప్రధానిక మంత్రి నుండి ఎలాంటి వారికైనా జడ్ ప్లస్ రక్షణ కల్పిస్తుంది పోలీసు శాఖ. అయితే బలమైన ఈ రక్షణ కోసం బలమైన ఆధారాలు చూపించాలి.

పోలీసులకు ముఖేష్ అంబానీ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

ముఖేష్ అంబానీ తన భద్రత కోసం అత్యాధునిక బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ హై సెక్యూరిటీ కారును వినియోగిస్తున్నాడు. దీని ధర సుమారుగా రూ. 8.5 కోట్లుగా ఉంది. అయితే ముఖేష్ అంబానీ భద్రతా కాన్వాయ్‌లోకి ఇప్పుడు అత్యంత ఖరీదైన మరో కారు వచ్చి చేరింది. పోలీసు సిబ్బంది కోసం బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు.

పోలీసులకు ముఖేష్ అంబానీ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

ప్రస్తుతం ముఖేష్ అంబానీ కోసం జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్న సిఆర్‌పిఎఫ్ పోలీస్ లోగోను ఈ తెలుపు రంగు ఎక్స్5 కారు మీద ముద్రించడం జరిగింది. ప్రస్తుతం ఇండియన్ పోలీసులు వినియోగిస్తున్న అత్యంత ఖరీదైన మొదటి కారు ఇదే.

పోలీసులకు ముఖేష్ అంబానీ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

భారత ప్రధాన మంత్రి కాన్వాయ్‌లో కూడా ఖరీదైన కార్లే ఉన్నాయి, మరి ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా ? ముఖేష్ అంబానీ ప్రత్యేకంగా తన పోలీసుల కోసం తీసుకువచ్చిన కారు గురించి లోతుగా పరిశీలిస్తే, ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరు మీద ఉన్నట్లు తెలిసింది. అంటే ఇది ముఖేష్ అంబానీ యొక్క వ్యక్తిగత కారు కాదన్నమాట.

పోలీసులకు ముఖేష్ అంబానీ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

అంతే కాకుండా మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బిఎమ్‌డబ్ల్యూ కంపెనీ యొక్క లోగోను కారు మీద నుండి తొలగించేశారు. ఈ కారు ఎక్స్5 లోని ఎక్స్ డ్రైవ్ 30 వేరియంట్. ప్రస్తుతం ఇండియన్ లైనప్‌లో ఎక్స్ 5 వేరియంట్లలో అత్యంత చవకయిన కారు ఇదే. కాని దీని ధర రూ. 70 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా ఉంది.

పోలీసులకు ముఖేష్ అంబానీ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎక్స్ డ్రైవ్30 సాంకేతిక వివరాల పరంగా చూస్తే, ఇందులో 3.0-లీటర్ సామర్థ్యం ఉన్న ట్విన్ స్క్రోల్ టుర్బో 6-సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 258బిహెచ్‌పి పవర్ మరియు 560ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

పోలీసులకు ముఖేష్ అంబానీ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రాలకు సరఫరా అవుతుంది. ఇది కేవలం 6.9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిమీల వేగాన్ని అందుకుంటుంది.

పోలీసులకు ముఖేష్ అంబానీ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

వ్యాపార ప్రపంచంలో ముఖేష్ అంబానీ ఎంతటి ముఖ్యమైన వ్యక్తో అందరికి తెలిసిందే. అతను ప్రయాణిస్తున్న వాహనంతో పాటు కాన్వాయ్ లోని పోలీసులు వాహనాలు కూడా అంతే శక్తివంతమైనవయ్యి ఉండాలి, అంతే వేగాన్ని కలిగి ఉండాలి. అందుకే కాబోలు తన భద్రతలో సేవలందించే పోలీసుల కోసం దీనిని కాన్వాయ్‌లోకి చేర్చాడు.

పోలీసులకు ముఖేష్ అంబానీ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

ఈ మధ్యనే ముఖేష్ అంబానీ పోలీసు కాన్వాయ్‌లోకి ఫోర్డ్ ఎండీవర్ వచ్చి చేరింది. అయితే దీని తాలుకు ఫోటోలు ఇంకా రాలేదు....

పోలీసులకు ముఖేష్ అంబానీ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

ముఖేష్ అంబానీ వ్యక్తిగత భద్రత దృష్ట్యా కొనుగోలు చేసిన సుమారుగా 10 కోట్ల ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం రండి...

పోలీసులకు ముఖేష్ అంబానీ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీల మధ్య రెండు పోలికలున్నాయి. ఎంటో తెలుసా ? ఇద్దరూ గుజాత్‌కు చెందిన వారే మరియు ఇద్దరూ దాదాపు ఒకే కార్లలో ప్రయాణిస్తారు. వీరిరువురు ఉపయోగించే కామన్ కారు బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్.

పోలీసులకు ముఖేష్ అంబానీ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

భద్రత పరంగా బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్‌లోని టాప్ ఎండ్ వేరియంట్ 760ఎల్ఐ ను పరిచయం చేసింది. సాధారణ 7-సిరీస్ వేరియంట్‌తో పోల్చితే పూర్తి భిన్నంగా ఉండేందుకు ప్రత్యేకంగా దీనిని బిఎమ్‌డబ్ల్యూ మోడిఫై చేస్తుంది.

పోలీసులకు ముఖేష్ అంబానీ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

పూర్తిగా విఆర్7 బాలిస్టిక్ సేఫ్టీ ప్రొటెక్షన్ కలిగిన ప్రపంచపు మొదటి ఆర్మర్డ్ కారు ఇదే. కాల్పుల ద్వారా ప్రమాదానికి గురికాకుండా ఈ కారులోని డోర్లలో కెవ్లర్ ప్లేట్లను అందివ్వడం జరిగింది. అన్ని అద్దాలు కూడా బుల్లెట్ ఫ్రూవ్ తో ఉన్నాయి. ఒక్కో అద్దం 65ఎమ్ఎమ్ మందంతో సుమారుగా 150కిలోల బరువును కలిగి ఉంటుంది.

పోలీసులకు ముఖేష్ అంబానీ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

మిలిటరీలో వినియోగించే ఆయుధాలతో దాడులు జరిపినా, గ్రెనేడ్ బ్లాష్ట్ జరిపినా చెక్కుచదరకుండా ఉంటుంది. పేళుళ్ల తీవ్రత ఎక్కువగా ఉండే టిఎన్‌టి ను సుమారుగా 17 కిలోలు వరకు ఉపయోగించి బ్లాష్ట్ జరిపినా తట్టుకోగలదు.

పోలీసులకు ముఖేష్ అంబానీ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

ఏకె-47 గన్‌తో కాల్పులు జరిపినా కూడా ఈ ఆర్మర్డ్ 7-సిరీస్‌కు ఏమీ కాదు, అదే విధంగా కాల్పులు మరియ పేళ్లుల్ల సమయంలో చెలరేగే నిప్పు ద్వారా ఇంధన ట్యాంకు అగ్నికి ఆహుతి కాకుండా సెల్ఫ్ సీలింగ్ కెవ్లర్ పదార్థతో తయారు చేశారు.

పోలీసులకు ముఖేష్ అంబానీ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

760ఎల్ఐ కారులో భద్రత పరంగా చేతితో రసాయన దాడి జరిపే పరికరం, అత్యవసర సమయంలో వినియోగించేందుకు ముందుగానే నింపిన ఆక్సిజన్, అగ్నిని నియంత్రించడం మరియు ఆటోమేటిక్‌గా నిప్పును ఆర్పివేసే మెకానిజమ్ ఇందులో కలదు. డ్యూయల్ లేయర్ ఉన్న టైర్లు మీద కాల్పులు జరిపినా కూడా ఏమీకాదు. ఒక వేళ టైర్లుకు పెద్ద రంధ్రాలు ఎర్పడ్డా కూడా గంటకు 80కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.

ఈ కారు ఎంత వరకు శక్తివంతమైనది ?

ఈ కారు ఎంత వరకు శక్తివంతమైనది ?

బిఎమ్‌డబ్ల్యూ ఈ 7-సిరీస్ ఆర్మర్డ్ కారులో 6.0-లీటర్ సామర్థ్యం ఉన్న వి12 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 544బిహెచ్‌పి పవర్ మరియు 750ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 8-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

పోలీసులకు ముఖేష్ అంబానీ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

ఇది కేవలం 6.2 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది, మరియు దీని గరిష్ట వేగం గంటకు 210కిలోమీటర్లుగా ఉంది. ఈ కారు గమ్యాన్ని శాటిలైట్ ద్వారా ట్రాక్‌చేయవచ్చు మరియు ఇందులోని ఇంటర్‌కామ్ పరిజ్ఞానం ద్వారా అత్యవసర సమయాల్లో సపోర్ట్ కోసం ఎమర్జెన్సీ కాల్ చేయవచ్చు.

ధర ?

ధర ?

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ హై సెక్యూరిటీ కారు యొక్క రిటైల్ ధర రూ. 8.7 కోట్లు ఎక్స్ షోరూమ్. ఈ ధరతో రెండు లాంబోర్గిని సూపర్ కార్లను కొనుగోలు చేయవచ్చు. మరియు కేవలం రిజిస్ట్రేషన్ కోసం 1.6 కోట్లు వెచ్చించాలి. అంటే దీని రిజిస్ట్రేషన్ ధరతో 20 వరకు హోండా సిటి కార్లు లేదా 50 వరకు రెనో క్విడ్ కార్లు కొనుగోలు చేయవచ్చు.

 
English summary
Mukesh Ambanis Security Cops Gets BMW X5 SUV
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark