మనవరాళ్లకు ఖరీదైన కార్లతో స్వాగతం.. ముఖేష్ అంబానీ అంటే అలానే ఉంటుంది మరి
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ గురించి దాదాపు చాలామందికి తెలుసు. గతంలో అంబానీ ఉపయోగించే కార్లను గురించి చాలానే తెలుసుకున్నాము. అయితే ఇటీవల తన మనవరాళ్లకు స్వాగతం పలకడానికి అత్యంత ఖరీదైన కార్లతో కనిపించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

నివేదికల ప్రకారం, ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీకి కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. వారు యుఎస్ఎలో పుట్టిన తరువాత మొదటిసారి ఇండియాకి వచ్చిన సందర్భంలో అంబానీ వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంలో అత్యంత ఖరీదైన కార్లు కనిపించాయి. ముఖేష్ అంబానీ యొక్క అత్యంత ఖరీదైన భవనం ఆంటీలా యొక్క గేట్లను ఫోటోగ్రాఫర్ల కోసం తొలిసారి ఓపెన్ చేశారు.
దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వెల్లడైంది. ఇందులో అంబానీ మానవరాళ్లను చూడవచ్చు. ఇందులో అంబానీ ఖరీదైన సాయుధ కార్లను కూడా చూడవచ్చు. అంతే కాకుండా ఇందులో రోల్స్ రాయిస్ యొక్క కల్లినన్ కారుని చూడవచ్చు. ఈ కార్లను గురించి మరిన్ని వివరాలు కింద చూడవచ్చు..

W222 మెర్సిడెస్ బెంజ్ S600 గార్డ్:
ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ W222 మెర్సిడెస్ బెంజ్ S600 గార్డ్ కారుని అంబానీ సొంత చేసుకున్నాడు. ఇది కస్టమైజ్ చేయబడిన కారు. కావున దీని ధర రూ. 12 కోట్లు వరకు ఉంటుంది. ఇది చూడటానికి సాధారణ బెంజ్ కారు మాదిరిగా ఉన్నప్పటికీ ప్రయాణికులకు అత్యంత రక్షణ కల్పించే బుల్లెట్ ప్రూఫ్ కారు. ఇది పటిష్టమైన భద్రతలను అందిస్తుంది. అంతే కాకుండా ఈ బుల్లెట్ ప్రూఫ్ కారు విఆర్ 10 లెవెల్ భద్రతను అందిస్తుంది.

విఆర్ 10 లెవెల్ భద్రత సర్టిఫికేషన్ పొందిన ప్రపంచంలోనే మొదటి ప్రయివేట్ వాహనం. ఇది స్టీల్ కోర్ బుల్లెట్లు 2 మీటర్ల దూరం నుండి 15 కిలోల TNT బ్లాస్ట్ వంటి వాటి నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. అంతే కాకుండా ఈ కారు పాలీకార్బోనేట్ పూసిన విండోలను కలిగి ఉంటుంది. కావున చాలా గట్టి భద్రతను అందిస్తుంది.
W222 మెర్సిడెస్ బెంజ్ S600 గార్డ్ బుల్లెట్ పేరొఫ్ కారులో 6.0-లీటర్ వి 12, బై-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 523 బిహెచ్‌పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో జతచేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

బిఎండబ్ల్యు 7-సిరీస్ 760 ఎల్ఐ:
అంబానీ గ్యారేజిలో ఉన్న కార్లలో బిఎండబ్ల్యు 7-సిరీస్ 760 ఎల్ఐ ఒకటి. ఇది అత్యంత భద్రతా ఫీచర్స్ కలిగిన సాయుధ వాహనం. దీని ధర రూ. 10 కోట్లు ఖర్చు. ఇలాంటి సాయుధ కార్లను ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రధాని నరేంద్ర మోడీ వంటి వారు ఉపయోగించారు. బిఎండబ్ల్యు 7-సిరీస్ హై సెక్యూరిటీ సెలూన్ 760ఎల్ఐ ఆధారంగా రూపొందించబడింది. అయినప్పటికీ ఈ కారు రెగ్యులర్ 7-సిరీస్ కంటే భిన్నంగా కనిపించే అవకాశం లేదు.

ఈ బిఎండబ్ల్యు 7-సిరీస్ 760 ఎల్ఐ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ విండోతో సహా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండటమే కాకుండా, గ్రెనేడ్ పేలుళ్లను కూడా తట్టుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏకే-47 కాల్పుల నుంచి కూడా ఇది లోపల ఉన్న వ్యక్తులను కాపాడగలదు. ఫ్యూయల్ ట్యాంక్ కూడా సెల్ఫ్ సీలింగ్ కెవ్లార్ తో తయారు చేయబడింది, కావున ఎటువంటి పరిస్థితుల్లోనూ మంటల చెలరేగే అవకాశం ఉండదు.
బిఎండబ్ల్యు 7-సిరీస్ 760 ఎల్ఐ కారు వి12 6.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 544 బిహెచ్‌పి పవర్ మరియు 750ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు కేవలం 6.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లు.

రోల్స్ రాయిస్ కల్లినన్:
ముఖేష్ అంబానీ గ్యారేజిలో అత్యంత ఖరీదైన కార్లు దాదాపు 200 వరకు ఉన్నట్లు సమాచారం. ఇందులో రోల్స్ రాయిస్ కల్లినన్ కూడా ఉంది. ఈ లగ్జరీ కారుని అంబానీ ఈ ఏడాది ప్రారంభంలో కొనుగోలు చేశారు. దీని ధర రూ. 13.8 కోట్లు. అంబానీ గ్యారేజిలో ఇది మూడవ కల్లినన్ కావడం విశేషం.

అంబానీ కొనుగోలు చేసిన ఈ కారు అద్భుతమైన టుస్కాన్ సన్ కలర్ షేడ్ లో ఉంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారు యొక్క పెయింట్ కోసం రూ. 1 కోటి కంటే ఎక్కువ ఖర్చయినట్లు సమాచారం. ఇది 21 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా రోల్స్ రాయిస్ కార్లు అన్నీ అద్భుతంగా ఉంటాయి. పనితీరు పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








