అంబానీ ఇంట చేరిన మరో 3 లగ్జరీ కార్లు ; వివరాలు

భారతదేశంలో అపర కుబేరుడుగా ప్రసిద్ధి చెందిన ముఖేష్ అంబానీ గురించి తెలియని వారు ఉండరు. ముఖేష్ అంబానీ గొప్ప వ్యాపారవేత్త అని అందరికి తెలుసు. అంతే కాదు అంబానీ అత్యంత ఖరీదైన అనేక లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు. ఇటీవల అంబానీ గ్యారేజ్ లోకి మరో కొన్ని లగ్జరీ కార్లు చేరాయి.

అంబానీ ఇంట చేరిన మరో 3 లగ్జరీ కార్లు ; వివరాలు

ముఖేష్ అంబానీ ఇటీవల మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి జి 63 లగ్జరీ కార్లను కొనుగోలు చేసిన విషయం మనం మునుపటి కథనంలో తెలుసుకున్నాం. గత సంవత్సరం కొన్ని ఖరీదైన కార్లను వారి కుటుంబం ఉపయోగం కోసం కూడా కొనుగోలు చేశారు. ముఖేష్ అంబానీ కోసం కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కార్లు ఏవో, వాటి వివరాలను మనం ఇక్కడ తెలుసుకుందాం..

అంబానీ ఇంట చేరిన మరో 3 లగ్జరీ కార్లు ; వివరాలు

రోల్స్ రాయిస్ కల్లినన్

ముఖేష్ అంబానీ తన మొదటి రోల్స్ రాయిస్ కల్లినన్ కారును 2019 లో కొనుగోలు చేశాడు. అప్పుడు వారు చాపెల్ కలర్ కలినన్ కారు కొన్నారు. అతని కుటుంబం వరుసగా రెండవ సంవత్సరం కూడా మరో కొత్త కలినన్ కారును కొనుగోలు చేసింది. రెండవసారి కొనుగోలు చేసిన కార్ ఆర్కిటిక్ వైట్ కలర్ లో ఉంది.

MOST READ:ఔరా.. ఏమి క్రియేషన్.. స్కూటర్ సైకిల్ అయిపోయింది

ముఖేష్ అంబానీ ఇంటిలోని ఆంటిల్లా ప్రాంతంలో ఈ కారు కనిపించింది. అప్పుడు తీసిన ఫోటో మరియు వీడియో ఇప్పటికీ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ లగ్జరీ ఎస్‌యూవీ ధర రూ. 7 కోట్లు. అదనపు ఫీచర్లు జోడిస్తే ఈ కారు ధర మరింత పెరుగుతుంది.

అంబానీ ఇంట చేరిన మరో 3 లగ్జరీ కార్లు ; వివరాలు

బెంట్లీ బెంటాయిగా

రోల్స్ రాయిస్ కల్లినన్ ఎస్‌యూవీ కొన్న తర్వాత అంబానీ కుటుంబం బెంట్లీ కారును కొనుగోలు చేసింది. ఈ కారు 2021 మోడల్ లగ్జరీ కారు. గత ఏడాది చివర్లో కంపెనీ ఈ కారును లాంచ్ చేసింది. అంబానీ కుటుంబం ఇప్పటికే బెంట్లీ కంపెనీకి చెందిన అనేక కార్లను కలిగి ఉంది.

MOST READ:సైకిల్‌పై కేరళ నుంచి కాశ్మీర్ ప్రయాణానికి సిద్దమైన టీ అమ్మే కుర్రాడు, ఎందుకో మరి

2021 నాటికి బెంట్లీ బెంటాయిగా కారు ధర సుమారు 4 కోట్ల రూపాయలు. అంబానీ కుటుంబం కొనుగోలు చేసిన కారు యొక్క ఖచ్చితమైన ధర తెలియదు. ఈ బెంట్లీ బెంటాయగా కారు వి 8 డీజిల్ ఇంజిన్‌తో ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారును దేశీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయడానికి ముందే అంబానీ కుటుంబం కొనుగోలు చేసింది. బెంట్లీ కంపెనీ లాంచ్ చేసిన ఈ బెంటాయగా కారును త్వరలో భారత్‌లో విడుదల చేయనున్నారు.

అంబానీ ఇంట చేరిన మరో 3 లగ్జరీ కార్లు ; వివరాలు

2021 మసెరటి లెవాంటే

ముఖేష్ అంబానీ కుటుంబం కొత్తగా కొనుగోలు చేసిన కారు మసెరటి లెవాంటే లగ్జరీ ఎస్‌యూవీ. ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీదారు నుండి వచ్చిన మొదటి కారు ఇది. భారతదేశంలో లగ్జరీ ఎస్‌యూవీలను ఎక్కువగా కోరుకునే వాటిలో లెవాంటే ఒకటి.

MOST READ:ట్రయంఫ్ టైగర్ 900 బైక్ సొంతం చేసుకున్న మలయాళీ స్టార్

కొంతమంది ఈ కారును ముఖేష్ అంబానీ యొక్క ఆంటిలియా ఇంటి ముందు ఇటీవల చూశారు. 2021 మసెరటి లావెండర్ ప్రారంభ ధర రూ. 2 కోట్లకు విక్రయించబడుతోంది. 2021 లో మసెరటి లెవాంటే ఎస్‌యూవీని భారత్‌లో విడుదల చేయనున్నట్లు నివేదికలు తెలిపాయి.

అంబానీ ఇంట చేరిన మరో 3 లగ్జరీ కార్లు ; వివరాలు

ఏది ఏమైనా అత్యంత లగ్జరీ కార్లు అంబానీ తన కుటుంబం కోసం ఉపయోగిస్తారు. అంతే కాకుండా తన సెక్యూరిటీ కోసం ఇటీవల బెంజ్ కార్లను కూడా కొనుగోలు చేశారు. అంబానీ అత్యంత ఖరీదైన చాలా లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు.

MOST READ:మీకు తెలుసా.. రోడ్డుపై ఇలా చేస్తే కూడా తప్పదు భారీ జరిమానా

Most Read Articles

English summary
Mukhesh Ambani Family Buys Few More Luxury SUVs. Read in Telugu.
Story first published: Friday, February 5, 2021, 9:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X