మనవరాలు చదువు కోసం ఉంటున్న ఇల్లు అమ్మేసిన 74 ఏళ్ల రియల్ హీరో

వయసుమళ్ళిన తర్వాత కొడుకుల వద్ద ఉంటూ చాలామంది కాలం గడుపుతూ హాయిగా ఉంటారు. కానీ ముంబై నగరానికి చెందిన దేశ్‌రాజ్ అనే 74 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి తన మనవరాలి కోసం ఎవరూ చేయని సాహసం చేసాడు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

మనవరాలు చదువు కోసం ఇంటిని అమ్మిన ఆటో తాత

భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైకి చెందిన ఆటో రిక్షా డ్రైవర్ దేశ్‌రాజ్, తన జీవితాంతం తన పిల్లలకోసం కష్టపడ్డాడు. పిల్లలకు పెళ్లిళ్లు చేసాడు, మానవరాళ్లతో హాయిగా ఉందామనుకున్నాడు, కానీ కాలం కన్నెర్రజేసింది. తన ఆలనా పాలనా చూసుకుంటాడనుకున్న కొడుకు మరణించాడు.

మనవరాలు చదువు కోసం ఇంటిని అమ్మిన ఆటో తాత

ఇప్పుడు తన మనవరాళ్ల భాద్యత తీసుకోవాల్సి వచ్చింది. ఈ వయసులో కూడా తానూ ఆటో నడుపుతూ వారిని చదివిస్తున్నాడు. ఇటీవల తన మనుమరాలు ఇంటర్ లో 80% మార్కులతో తాత కష్టానికి తగ్గ ఫలితాన్ని సాధించింది. మంచి మార్కులతో పాసైన తన మనువరాలిని మరింత ఉన్నత చదువులు చదింవించడానికి తగినంత డబ్బులేకపోవడం వల్ల, ఏకంగా వారు ఉంటున్న ఇంటిని అమ్మేశాడు.

MOST READ:మీ వాహనంపై ఈ స్టిక్కర్ ఉందా.. ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకుంటే ?

మనవరాలు చదువు కోసం ఇంటిని అమ్మిన ఆటో తాత

వచ్చిన డబ్బుతో ఫీజు కట్టేశాడు. అందరినీ సొంతూరిలోని బంధువుల ఇంటికి పంపేశాడు. తాను మాత్రం ముంబైలోనే ఉంటూ, ఆటోనే ఇల్లు చేసుకున్నాడు. ప్రస్తుతం తన మనవరాలు డిల్లీలో చదువుతోంది. తన మనవరాలు ఎప్పుడు టీచర్ అవుతుందా అని ఆశతో ఎదురుచూస్తున్నాడు.

మనవరాలు చదువు కోసం ఇంటిని అమ్మిన ఆటో తాత

హ్యూమన్ ఆఫ్ బాంబే దేశ్‌రాజ్ కథను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో పోస్ట్ చేసినప్పుడు, అతని కథ వైరల్ అయింది. దీన్ని చూసి చలించిపోయిన చాలామంది దాతలు ఉదారంగా విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. మొత్తం విరాళాలు అక్షరాలా 24 లక్షలు పోగయ్యాయి.

MOST READ:కారులో ఆహారపదార్థాలు నిల్వచేస్తే వచ్చే సమస్యలేంటో మీకు తెలుసా.. అయితే ఇది చూడండి

హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఇటీవల తనకు 24 లక్షల చెక్కును అందజేసింది. ఇందులో పది లక్షలు పిల్లల చదువుకు, మరో పది లక్షలు దేశ్ రాజ్ ఇంటికి, మిగతా సొమ్ము ఇతర అవసరాలకు ఉపయోగపడేలా ఉపయోగించుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు.

మనవరాలు చదువు కోసం ఇంటిని అమ్మిన ఆటో తాత

ఏది ఏమైనా నెటిజన్లు చేసిన సహాయానికి దేశ్ రాజ్ కన్నీళ్లతోనే కృతజ్ఞతలు చెప్పాడు. నెటిజన్ల సాయంతో దేశ్‌రాజ్ కు ఓ ఇల్లు దొరికింది. తన మనవరాలిని చదివించుకునే స్ధోమత లభించింది. మనవరాలిని చదివించాలన్న కోరికే, దేశ్‌రాజ్ ని 74 ఏళ్లలో రియల్ హీరోగా చేసింది.

MOST READ:ఈ వాహనంలో మనుషులకు మాత్రమే కాదు, కుక్కలకు కూడా లగ్జరీ ఫీచర్స్.. ఆ వాహనాన్ని మీరు చూసారా..!

Most Read Articles

English summary
Mumbai Auto Driver Sells His House To Give Education To His Granddaughter. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X