Just In
- 10 hrs ago
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!
- 12 hrs ago
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- 14 hrs ago
భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు
- 15 hrs ago
మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులు అకస్మాత్తుగా ప్రయాణం చేయొచ్చు...!
- News
వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం
- Sports
PBKS vs CSK: 'సూపర్' జడేజా! కళ్లుచెదిరే రనౌట్.. స్టన్నింగ్ క్యాచ్!వీడియోలు
- Movies
పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన రాంగోపాల్ వర్మ.. కోవిడ్ 19 హీరో అంటూ..
- Finance
మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మనవరాలు చదువు కోసం ఉంటున్న ఇల్లు అమ్మేసిన 74 ఏళ్ల రియల్ హీరో
వయసుమళ్ళిన తర్వాత కొడుకుల వద్ద ఉంటూ చాలామంది కాలం గడుపుతూ హాయిగా ఉంటారు. కానీ ముంబై నగరానికి చెందిన దేశ్రాజ్ అనే 74 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి తన మనవరాలి కోసం ఎవరూ చేయని సాహసం చేసాడు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైకి చెందిన ఆటో రిక్షా డ్రైవర్ దేశ్రాజ్, తన జీవితాంతం తన పిల్లలకోసం కష్టపడ్డాడు. పిల్లలకు పెళ్లిళ్లు చేసాడు, మానవరాళ్లతో హాయిగా ఉందామనుకున్నాడు, కానీ కాలం కన్నెర్రజేసింది. తన ఆలనా పాలనా చూసుకుంటాడనుకున్న కొడుకు మరణించాడు.

ఇప్పుడు తన మనవరాళ్ల భాద్యత తీసుకోవాల్సి వచ్చింది. ఈ వయసులో కూడా తానూ ఆటో నడుపుతూ వారిని చదివిస్తున్నాడు. ఇటీవల తన మనుమరాలు ఇంటర్ లో 80% మార్కులతో తాత కష్టానికి తగ్గ ఫలితాన్ని సాధించింది. మంచి మార్కులతో పాసైన తన మనువరాలిని మరింత ఉన్నత చదువులు చదింవించడానికి తగినంత డబ్బులేకపోవడం వల్ల, ఏకంగా వారు ఉంటున్న ఇంటిని అమ్మేశాడు.
MOST READ:మీ వాహనంపై ఈ స్టిక్కర్ ఉందా.. ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకుంటే ?

వచ్చిన డబ్బుతో ఫీజు కట్టేశాడు. అందరినీ సొంతూరిలోని బంధువుల ఇంటికి పంపేశాడు. తాను మాత్రం ముంబైలోనే ఉంటూ, ఆటోనే ఇల్లు చేసుకున్నాడు. ప్రస్తుతం తన మనవరాలు డిల్లీలో చదువుతోంది. తన మనవరాలు ఎప్పుడు టీచర్ అవుతుందా అని ఆశతో ఎదురుచూస్తున్నాడు.

హ్యూమన్ ఆఫ్ బాంబే దేశ్రాజ్ కథను సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పోస్ట్ చేసినప్పుడు, అతని కథ వైరల్ అయింది. దీన్ని చూసి చలించిపోయిన చాలామంది దాతలు ఉదారంగా విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. మొత్తం విరాళాలు అక్షరాలా 24 లక్షలు పోగయ్యాయి.
MOST READ:కారులో ఆహారపదార్థాలు నిల్వచేస్తే వచ్చే సమస్యలేంటో మీకు తెలుసా.. అయితే ఇది చూడండి
హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఇటీవల తనకు 24 లక్షల చెక్కును అందజేసింది. ఇందులో పది లక్షలు పిల్లల చదువుకు, మరో పది లక్షలు దేశ్ రాజ్ ఇంటికి, మిగతా సొమ్ము ఇతర అవసరాలకు ఉపయోగపడేలా ఉపయోగించుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు.

ఏది ఏమైనా నెటిజన్లు చేసిన సహాయానికి దేశ్ రాజ్ కన్నీళ్లతోనే కృతజ్ఞతలు చెప్పాడు. నెటిజన్ల సాయంతో దేశ్రాజ్ కు ఓ ఇల్లు దొరికింది. తన మనవరాలిని చదివించుకునే స్ధోమత లభించింది. మనవరాలిని చదివించాలన్న కోరికే, దేశ్రాజ్ ని 74 ఏళ్లలో రియల్ హీరోగా చేసింది.
MOST READ:ఈ వాహనంలో మనుషులకు మాత్రమే కాదు, కుక్కలకు కూడా లగ్జరీ ఫీచర్స్.. ఆ వాహనాన్ని మీరు చూసారా..!