పోలీసులు సీజ్ చేసిన మిలటరీ టైప్ మహీంద్రా స్కార్పియో; కారణం ఇదే

భారతీయ మార్కెట్లో ఎక్కువ మంది వినియోగదారులకు ఇష్టమైన వాహనం మహీంద్రా యొక్క స్కార్పియో. ఎక్కువ మంది సాహసయాత్రలు చేసే వారికీ ఆఫ్ రోడింగ్ సమయంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. మహీంద్రా స్కార్పియో దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహనంగా ప్రసిద్ధి పొందింది.

ముంబై పోలీసులు సీజ్ చేసిన మహీంద్రా స్కార్పియో; కారణం ఇదే!!

ఇదిలా ఉండగా ఇటీవల ముంబై నగర పోలీసులు మహీంద్రా స్కార్పియో కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇంతకీ పోలీసులు ఈ మహీంద్రా స్కార్పియో వాహనాన్ని ఎందుకు స్వాధీనం చేసుకున్నారు, దీని వెనుక ఉన్న కారణం ఏమిటి అనే విషయాన్నీ గురించి మరింత సమాచారం ఆ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ముంబై పోలీసులు సీజ్ చేసిన మహీంద్రా స్కార్పియో; కారణం ఇదే!!

నివేదికల ప్రకారం ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్న మహీంద్రా స్కార్పియో కారు చూడటానికి మిలటరీ దళాలు ఉపయోగించే కారులాగా కనిపిస్తుంది. ఈ కారణంగానే ముంబై పోలీసులు మహీంద్రా స్కార్పియో కారును స్వాధీనం చేసుకున్నారు.

ముంబై పోలీసులు సీజ్ చేసిన మహీంద్రా స్కార్పియో; కారణం ఇదే!!

ముంబై పోలీసుల స్వాధీనం చేసుకున్న ఈ కారు చూడటానికి మిలటరీ వాహనంలా కనిపించే ఒక వ్యక్తిగత వాహనం. ఈ డిజైన్ సైనిక వాహనాలపై మాత్రమే ఉపయోగించాలనే నియమం కూడా ఉంది. కావున ఇతర వ్యక్తిగత వాహనాలపై కానీ ఇతర కంపెనీ వాహనాలపై కానీ ఉపయోగించకూడదు.

ముంబై పోలీసులు సీజ్ చేసిన మహీంద్రా స్కార్పియో; కారణం ఇదే!!

ఒక్క మాటలో చెప్పాలంటే మిలటరీ దళాలను వ్యక్తిగతం చేసే కలర్ మరియు డిజైన్ అనేవి భారత సైన్యం తప్ప ఇతరులు ఉపాయోగించకూడదు. అయితే ఇక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్న మహీంద్రా స్కార్పియో ఈ నిబంధనను ఉల్లంఘించింది.

ముంబై పోలీసులు సీజ్ చేసిన మహీంద్రా స్కార్పియో; కారణం ఇదే!!

వాహనాలను తనిఖీ చేస్తున్నప్పుడు మిలిటరీ లుక్‌తో స్కార్పియో కారును నడుపుతున్న కొంతమంది యువకులను ముంబై పోలీసులు కనుగొన్నారు. అయితే ఈ మహీంద్రా స్కార్పియో కారులో ఎవరూ మిలటరీ యూనిఫాం ధరించలేదు. అయితే అనుమానంతో పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

ముంబై పోలీసులు సీజ్ చేసిన మహీంద్రా స్కార్పియో; కారణం ఇదే!!

విచారణ సమయంలో, కారు మిలటరీ డిజైన్ కలిగిన వ్యక్తిగత వాహనం అని కనుగొనబడింది. ఆలివ్ గ్రీన్ భారతదేశంలో సైనిక వాహనాలకు మాత్రమే ఉపయోగించబడుతుంది. ఈ కలర్ ప్రత్యేకంగా దేశ భద్రతా దళాలకు ప్రత్యేకించబడింది. ముందు చెప్పినట్లుగా, పబ్లిక్ మరియు ఇతర సంస్థలు ఈ రంగును ఉపయోగించకుండా నిషేధించబడ్డాయి. ఈ నియమం అందరికీ వర్తిస్తుంది.

ముంబై పోలీసులు సీజ్ చేసిన మహీంద్రా స్కార్పియో; కారణం ఇదే!!

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన బైక్‌లలో కొన్నింటిని బాటిల్ గ్రీన్‌ కలర్ లో అంతర్జాతీయ మార్కెట్లలో ఎగుమతి చేస్తుంది. ఈ వాహనాలు భారతదేశంలో తయారు చేయబడతాయి మరియు విదేశాలకు ఎగుమతి చేయబడతాయి. కానీ ఈ వాహనాలు భారతదేశంలో అమ్మకానికి లేవు.

ముంబై పోలీసులు సీజ్ చేసిన మహీంద్రా స్కార్పియో; కారణం ఇదే!!

భారతదేశంలో, మహీంద్రా అండ్ మహీంద్రా, జావా మరియు జీప్ కంపెనీలు ప్రభుత్వ ఆమోదంతో ఆలివ్ గ్రీన్ రంగు వాహనాలను విక్రయిస్తాయి. ఈ వాహనాలు మిలిటరీ వాహనాల కంటే కొంచెం భిన్నమైన రూపాన్ని కలిగి ఉండటం గమనార్హం. సైనిక వాహనం వలె కనిపించే కార్లు లేదా బైకులు సరైన అనుమతి ఉంటేనే ఉపయోగించాలి.

ముంబై పోలీసులు సీజ్ చేసిన మహీంద్రా స్కార్పియో; కారణం ఇదే!!

ఇలాంటి వాహనాలకు కూడా సరైన సరైన లైసెన్స్ మరియు డాక్యుమెంట్లు లేనట్లయితే వాటిని పోలీసులు సీజ్ చేయవచ్చు. భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో వాహనాలు మాడిఫై అవుతున్నాయి. అయితే నిబంధనలకు వ్యతిరేఖంగా తయారైన వాహనాలపై పోలీసులు చర్యలు తీసుకుంటారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే విషయం తెలియదు. కానీ ప్రస్తుతం ముంబై పోలీసుల అదుపులో ఉన్న స్కార్పియో కారు యజమానులకు భారీ జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు మాత్రం తెలుస్తుంది.

Most Read Articles

English summary
Mumbai cops seizes scorpio car which was modified like military vehicle details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X