బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

ముంబైలో దిలీప్ చాబ్రియా కేసు ఛేదించిన తర్వాత ముంబై క్రైమ్స్ పోలీసులు మరో పెద్ద కుభకోణంపై విరుచుకుపడ్డారు. ఇందులో ఫోర్జరీకి సంబంధించిన 7 మందిని క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసి వారి వద్ద ఉన్న ఆడి, బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, మినీ వంటి 19 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకుంది.

బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

ఈ కుంభకోణం గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కార్ల ధర సుమారు రూ. 7 కోట్లు అని తేలింది. ఈ రాకెట్‌కు సంబంధించి ముంబై పోలీసులు ఇండోర్, బెంగళూరుతో సహా పలు నగరాలపై దాడి చేశారు. ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితుడు ప్రదీప్ మౌర్యగా గుర్తించారు.

బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

ప్రదీప్ మౌర్య హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో పనిచేశారని, కార్ లోన్ కి సంబంధించిన అన్ని విధానాల గురించి బాగా తెలుసునని పోలీసులు తెలిపారు. వాస్తవానికి, ప్రదీప్ మాత్రమే బ్యాంకుల నుండి రుణాలు తీసుకునేవాడు.

MOST READ:ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి

బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

బ్యాంకుల నుండి కార్ లోన్ పొందటానికి మౌర్య, నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్, ఇన్కమ్ టాక్స్ స్టేట్మెంట్ వంటి డాక్యుమెంట్స్ ఉపయోగించాడు. ఇది మాత్రమే కాదు, బ్యాంకుల్లో కారు లోన్ కోసం దరఖాస్తు చేసిన తరువాత, అతను ఒక తెలివైన మాకెన్‌ను నియమించుకున్నాడు.

బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

లోన్ అప్లై చేసుకున్న తరువాత బ్యాంకు నుండి తనిఖీ కోసం వస్తున్న అధికారిని డాడ్జ్ చేయడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి రెండు నెలలు అక్కడ నివసించేవాడు.

MOST READ:ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

లోన్ కన్ఫర్మ్ అయిన తర్వాత, అతను ఇంటిని ఖాళీ చేసేవాడు మరియు క్రొత్త స్థలంలో మరో ఇల్లు అద్దెకు తీసుకుని మరొక బ్యాంకును లక్ష్యంగా చేసుకునేవాడు. లోన్ పాస్ అయిన తరువాత, రాకెట్టులో కొంతమంది డీలర్ నుండి కారును కొనుగోలు చేసి, ఆ తరువాత వారు కారును అమ్మడానికి కొనుగోలుదారుడి కోసం వెతకడం ప్రారంభించేవాడు.

బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

కార్లు కొన్న తర్వాత వాటిని అతడు సగం ధరకు అమ్మేసేవాడు. డబ్బు లేదని లేదా సోదరి పెళ్లి కోసం కారు సగం ధరకు అమ్ముతున్నట్లు అతను కొనుగోలుదారులను నమ్మించేవాడు. కారు అమ్మిన తరువాత బ్యాంకులకు ఇఎంఐ చెల్లించడం మానేసాడు. ఈ విధంగా చేయడం వల్ల అతను కస్టమర్ కాదని మోసగాడు అని బ్యాంకులకు తెలిసింది.

MOST READ:ఆటో డ్రైవర్ కొడుకు ఇప్పుడు 'బీమర్' ఓనర్ అయ్యాడు; సిరాజ్ కొత్త కార్ చూడండి

బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

ఈ నేపథ్యంలో సంబంధిత బ్యాంకులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ కేసుకు సంబంధించి కుర్లా పోలీసులు జనవరి 15 న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మోసం చేసి లోన్ తీసుకుని దుర్వినియోగం చేసినందుకు గాను పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. నకిలీ పత్రాలపై రుణాలు మంజూరు చేయడంలో బ్యాంక్ అధికారులు పాల్గొనవచ్చని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి సంఘటనలే చాలా వెలుగులోకి వచ్చాయి.

బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

మీరు సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేస్తుంటే, అలాంటి కార్లకు సంబందించి డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని ద్రువీకరించుకోవాలి. అంతే కాకుండా సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసేటప్పుడు, కారు RTO తో ఎక్కడ రిజిస్టర్ చేయబడిందో నిర్ధారించుకోండి లేదా వాహన పోర్టల్‌లో కారు స్టేటస్ తెలుసుకోండి. వాహనానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే సెకండ్ హ్యాండ్ కార్స్ కొనాలి.

MOST READ:ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి

బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

సమాజంలో రోజురోజుకి మోసాలు పెరిగిపోవడంతో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది చేసే తప్పుల వల్ల అమాయకులు కూడా బలైపోతారు. కావున వాహనాలను కొనేముందు అన్ని ఉన్నాయని నిర్దారించుకున్న తర్వాత కొనడం మంచిది.

NOTE : ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే

Most Read Articles

English summary
Mumbai Crime Branch Police Busts Car Loan Scam, Seizes Luxury Cars. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X